తాను చనిపోతున్నట్టు వాట్సాప్‌లో స్టేటస్ పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నాడో ఆటో డ్రైవర్. ఈ ఘ‌ట‌న కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సికింద్రాబాద్ పార్సీ గుట్ట ప్రాంతానికి చెందిన రాము (28) వృత్తి రిత్యా ఆటో డ్రైవర్. అతడికి భార్య రూత్, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో రాము ఆవేదనకు గురయ్యాడు.

బుధవారం అర్ధరాత్రి దాటాక ‘భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా ఈ వ్యక్తి చనిపోయాడు’ అని వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. అనంతరం జామై ఉస్మానియా-ఆర్ట్స్ కాలేజీ స్టేషన్ల మధ్య రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్