బ్రేకింగ్ : ఘోర రైలు ప్రమాదం.. 15 మంది వలస కూలీలు మృతి
By సుభాష్ Published on 8 May 2020 8:34 AM IST
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో శుక్రవారం ఉదయం ఘోర రైలు ప్రమదం సంభవించింది. రైల్వే పట్టాలపై నిద్రపోతున్నవలస కూలీలపై గూడ్స్ రైలు వెళ్లింది.
ఈ రైలు ప్రమాదంలో 15 మంది వలస కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. గఢనిద్రలో ఉన్న కూలీలపై గూడ్స్ రైలు దూసుకెళ్లడంతో మృతదేహాలు పట్టాలపై చెల్లాచెదురైపోయాయి.కర్మాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది, రైల్వే పోలీసుబలగాలు, ఇతర పోలీసు బలగాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, రైల్వే ట్రాక్ ఖాళీగా ఉండటంతో వలస కూలీలు ట్రాక్ పై నిద్రించారని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరగడంపై అధికారులు విచారణ చేపడుతున్నారు.
[video width="480" height="480" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/05/WhatsApp-Video-2020-05-08-at-9.08.55-AM.mp4"][/video]