ఆంటీ వైఖరికి బెదిరిపోయిన వాహనదారులు

By రాణి  Published on  24 Feb 2020 3:18 PM IST
ఆంటీ వైఖరికి బెదిరిపోయిన వాహనదారులు

పూణెలో ఒక ఆంటి వైఖరికి వాహనదారులు బెదిరిపోయారు. అసలే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఆ ట్రాఫిక్ లో అన్ని బండ్లను దాటుకుంటూ వెళ్లాలంటే పాదచారులకు చాలా కష్టం. పాదచారులకోసం వేసిన ఫుట్ పాత్ లను కూడా వదలడం లేదు వాహనదారులు. ఇది కేవలం పూణేలో మాత్రమే జరుగుతున్నది కాదు. దేశంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అన్ని ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి. కాస్త ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే చాలు. వెనుక ఉన్నవాడు బండిని ఫుట్ పాత్ ఎక్కించేస్తాడు. వాడిని చూసి మరొకడు..అతడిని చూసి ఇంకొకడు..ఇలా ఫుట్ పాత్ లపై నడిపే బండ్లకు అంతు లేదు. దానిని ఆపే నాథుడూ లేడు. ట్రాఫిక్ పోలీస్ ఏమయ్యాడని మీకు అనుమానం రావొచ్చు. ఆ ట్రాఫిక్ పోలీస్ లు ఫుట్ పాత్ పై ఎందుకుంటారు..? ఏ సిగ్నల్ దగ్గరో..ఏ టర్నింగ్ పాయింట్లలోనో, మెయిన్ రోడ్ పక్కనో ఉంటారు.

ఇలా ఫుట్ పాత్ లపై బైక్ లను ఎక్కించడం వల్ల దానిపై నడిచేవారు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఒక్కోసారి బైకర్స్ వల్ల ఫుట్ పాత్ పై వెళ్లేవారికి ప్రమాదాల బెడప తప్పట్లేదు. పూణేలో ఫుట్ పాత్ పై బైక్ లు వెళ్లకుండా ఓ పెద్దావిడ తగిన బుద్ధి చెప్పారు. ఫుట్ పాత్ పైకి బైక్ ఎక్కించి వెళ్లేవారికి అడ్డుగా నిలబడి తిట్ల దండకం మొదలుపెట్టారు. ఆవిడ తిట్లకు బెదిరిపోయిన బైకర్లు..వెనక్కి తగ్గారు. ఈమెకు తోడుగా మరో ఇద్దరు రాగా..అక్కడే ఉన్న అమిత్ రూకే అనే జర్నలిస్ట్ వీడియో తీసి తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇది కాస్తా బాగా వైరల్ అయి 2.3 లక్షల వ్యూస్ తెచ్చుకుంది. ఈ ట్వీట్ పై పలువురు నెటిజన్లు పాజిటివ్ గా స్పందించారు. ఆంటీ బాగా బుద్ధి చెప్పిందని కొందరంటే..పుణె పోలీసులకు తమ కర్తవ్యాన్నిగుర్తు చేశారని మరికొందరు మెచ్చుకున్నారు. ఇంకొందరు గాడ్‌ బ్లెస్‌ యూ మేడమ్‌, ఫుట్‌పాత్‌ పై బైక్‌ నడిపేవారు సిగ్గుపడాలి ఇంకొకరు కామెంట్‌ చేశారు. ‘ఈ ఆంటీ ముంబైకి వచ్చి మాతో ఉంటే బాగుండనుకుంటున్నారు ముంబై వాసులు. అక్కడ ట్రాఫిక్ ఇందుకు రెండింతలుంటుందిగా మరి. ఒక్క ముంబై ఏంటి..ఢిల్లీ, హైదరాబాద్ లలో కూడా ఇదే పరిస్థితి.



Next Story