వైఎస్సార్ కాలనీలో మహిళా వాలంటీర్లపై దాడి
By సుభాష్ Published on 1 May 2020 4:01 PM ISTఏపీలో దారుణం చోటు చేసుకుంది. వైఎస్సార్ కాలనీలో మహిళా వాలంటీర్లపై దాడి జరిగింది. సాధిక అనే వాలంటీర్‌పై కాలనీ వాసులు దాడికి పాల్పడ్డారు. దాడి జరుగుతున్న విషయం తెలిసి వెళ్లిన మేరీ అనే వాలంటీర్‌పై కూడా దాడి చేశారు. మేరీ నాలుగు నెలల గర్భవతి.
కాగా, రెండో విడత రేషన్ ఇప్పించలేదన్న కోపంతో వాలంటీర్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులపై దాడికి దిగారు. ఇద్దరు వాలంటీర్లపై దాడి చేయడంతో వారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలకు రక్షణ కరువైందని వాలంటీర్లు ఆందోళన చేశారు. దాడి జరుగుతున్న విషయమై 100 కు డయాల్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందిస్తే.. ఎస్సై ఉచిత సలహాలు ఇచ్చారని వాలంటీర్‌లు ఆరోపించారు. వారంతా విధులు బహిష్కరించి జక్కంపుడి వైఎస్సార్ కాలనీ సచివాలయం వద్ద ధర్నాకు దిగారు.
Next Story