షారుక్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమా మళ్లీ విజయ్‌తో..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 May 2020 5:36 PM ISTకోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తీసింది నాలుగు సినిమాలే అయినా.. హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. 2013లో రాజా రాణి సినిమాను తెరకెక్కించడం ద్వారా అట్లీ దర్శకుడిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరో విజయ్ తో తీసిన తెరి, మెర్సల్, బిగిల్ సినిమాలు తీసి బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు అట్లీ. ఈ సినిమాలు ఊహించిన దానికంటే డబుల్, త్రిపుల్ లాభాలను తెచ్చిపెట్టాయి నిర్మాతలకు.
ఒక దర్శకుడు ఒక్క హిట్ కొడితేనే.. అతనితో సినిమా చేసేందుకు ఎదురు చూస్తారు స్టార్ హీరోలు. కానీ అట్లీ విషయంలో మాత్రం అది రివర్స్ అయింది. వరుస విజయాలతో షారుక్, ఎన్టీఆర్ లను కలిసే అవకాశాలైతే వచ్చాయి కానీ సినిమా మాత్రం చేసేందుకు ఇష్టపడలేదు వాళ్లు. షారుఖ్ ను కలిసిన అట్లీ సినిమా స్టోరీ చెప్పగా అది ఆయనకు నచ్చలేదట.
ఇటు టాలీవుడ్ లోనూ అట్లీకి దాదాపు అలాంటి పరిస్థితే ఎదురయింది. ఎన్టీఆర్ కి అట్లీ చెప్పిన కథ నచ్చింది. సినిమాకు కూడా ఓకే చెప్పేశారు కానీ..ఎన్టీఆర్ తో అట్లీ తీయాలనుకున్న సినిమాలో ఎక్కువ కమర్షియల్ సీన్లు ఉండటంతో ఆఖరి నిమిషంలో ఎన్టీఆర్ సినిమా రిజెక్ట్ చేశారు. బాలీవుడ్, టాలీవుడ్ లోనూ అట్లీతో కలిసి పనిచేసేందుకు హీరోలు అంతగా ఆసక్తి చూపకపోవడంతో మళ్లీ హ్యాట్రిక్ కాంబినేషన్ హీరో విజయ్ తోనే సినిమా తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సుమారు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ తో కొత్త సినిమా పట్టాలెక్కనున్నట్లు టాక్. విజయ్ - అట్లీ కాంబినేషన్ లో 4వ సారి ఈ సినిమా తెరకెక్కిస్తే హిట్ అవుతుందో.. లేదో చూడాలి.