వంద రూపాయలు పెట్టి ఆ సినిమా చూస్తారా.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 May 2020 11:39 AM GMT
వంద రూపాయలు పెట్టి ఆ సినిమా చూస్తారా.?

ఇండియాలో అలుపూ సొలుపూ లేకుండా సినిమాలు చేసే దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ ఒకడు. గత సినిమాల ఫలితాల ప్రభావం ఆయనపై ఎంతమాత్రం ఉండదు. ఎలాగోలా తన కొత్త సినిమాకు పెట్టుబడి సమకూర్చుకుంటాడు. విరామం లేకుండా సినిమాలు తీస్తూ పోతుంటాడు. లాక్ డౌన్ టైంలో అందరు ఫిలిం మేకర్స్ సైలెంటుగా ఉంటే వర్మ మాత్రం చడీచప్పుడు లేకుండా ఈ లాక్‌డౌన్‌కు కారణమైన కరోనా వైరస్ మీదే సినిమా తీసేశాడు. దాని కంటే ముందు ఇలాగే సైలెంటుగా ‘క్లైమాక్స్’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ‘గాడ్ సెక్స్ ట్రూత్’ అనే షార్ట్ పోర్న్ మూవీ తీసిన వర్మ.. ఈసారి ఆమెతో ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిలిమే చేశాడు. కొన్ని రోజులుగా దాని ప్రోమోలతో హంగామా చేస్తున్నాడు.

ప్రస్తుతం థియేటర్లు మూతబడి ఉండటంతో నిర్మాతలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వైపు చూస్తుంటే.. వర్మ మాత్రం తనే సొంతంగా ఆర్జీవీ వరల్డ్ థియేటర్ పేరుతో ఒక ఫ్లాట్ ఫాం పెట్టుకున్నాడు. అందులోనే ‘క్లైమాక్స్’ను రిలీజ్ చేస్తున్నాడు. మే 29నే రిలీజ్ అన్నారు కానీ కుదర్లేదు. జూన్ 6కు కొత్త డేట్ ఇచ్చారు. ఈ సినిమాను పే పర్ వ్యూ పద్ధతిలో చూసే అవకాశం కల్పించనున్నట్లు వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే యూట్యూబ్‌లో మాదిరి ఒకసారి సినిమా చూసేందుకు ఇంత అని చెల్లించాలన్నమాట. మరి ఆ రేటు ఎంత ఉంటుందా అని చూస్తే.. ఏకంగా వంద పెట్టేశాడు వర్మ. కొన్నేళ్లుగా వర్మ సినిమాల క్వాలిటీ ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఆయనేదో అద్భుతమైన సినిమా తీసి ఉంటాడన్న ఆశలు ఎవరికీ లేవు. ఈ సినిమా చూడాల్సిందల్లా మియా మాల్కోవా అందాల కోసమే. ఐతే ఆల్రెడీ ఫ్రీగా ఆమె పోర్న్ సినిమాలు లెక్కలేనన్ని అందుబాటులో ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు వంద పెట్టి ఆమె అర్ధనగ్న దృశ్యాలు చూసేందుకు కుర్రాళ్లు ఏమాత్రం ఆసక్తి చూపిస్తారన్నది ప్రశ్నార్థకం.

Next Story