వార ఫలాలు: తేది 5-10-2025 నుంచి 11-10-2025 వరకు

గృహానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ఈ వారం తీసుకునే అవకాశముంది. స్థిరాస్తి వివాదానికి దూరపు బంధువుల సహాయం లభిస్తుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు.

By -  అంజి
Published on : 5 Oct 2025 6:04 AM IST

weekly horoscope: 5-10-2025 to 11-10-2025

వార ఫలాలు: తేది 5-10-2025 నుంచి 11-10-2025 వరకు

మేషం:

గృహానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ఈ వారం తీసుకునే అవకాశముంది. స్థిరాస్తి వివాదానికి దూరపు బంధువుల సహాయం లభిస్తుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. వ్యాపార విస్తరణకు మంచి అవకాశాలు వస్తాయి, ఆర్థికంగా సంతృప్తి కలుగుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది. విద్యార్థులకు విదేశీ ప్రయాణం లేదా ఉన్నత చదువుల విషయాల్లో శుభవార్తలు అందుతాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే మానసిక ఉల్లాసం కలిగి, శత్రు అడ్డంకులు తొలగుతాయి.

వృషభం:

సంతానానికి విద్యా, ఉద్యోగ సంబంధమైన శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లేదా ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశముంది. కొంత వృథా ఖర్చు పెరిగినా రావలసిన డబ్బు లభ్యం అవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై ఆత్మీయ చర్చలు జరుగుతాయి. హయగ్రీవ స్తోత్రం పారాయణం చేస్తే విద్యా, జ్ఞానం, వాక్చాతుర్యం పెరిగి అన్ని పనులు సాఫీగా సాగుతాయి.

మిథునం:

చేపట్టిన పనులు ఆలస్యంగా అయినా పూర్తవుతాయి. రుణభారం తగ్గుముఖం పడుతుంది. సోదరులతో ఉన్న స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఏర్పడి ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. విద్యార్థులు తమ కృషితో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. శివ సహస్రనామం జపం చేస్తే అంతరాయాలు తొలగి మనశ్శాంతి కలుగుతుంది.

కర్కాటకం:

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో మేలుచేసే అవకాశాలు కలుగుతాయి. వ్యాపార లాభాలు పెరుగుతాయి. ఉద్యోగ సమస్యలు తొలగి కొత్త ఉత్సాహం వస్తుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది కానీ వారం మధ్యలో చిన్నపాటి వివాదాలు వచ్చే అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు ఫలప్రదమవుతాయి. నవగ్రహ స్తోత్రం పారాయణం చేస్తే గ్రహపరివర్తనాల వల్ల కలిగే సమస్యలు తొలగి శుభఫలితాలు లభిస్తాయి.

సింహం:

స్థిరాస్తి సంబంధిత కొత్త ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబంతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. వారం ప్రారంభంలో ఋణ వత్తిడి అనిపించినా దానిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై కాస్త జాగ్రత్త అవసరం. గృహనిర్మాణ యత్నాలు ప్రారంభమవుతాయి. విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేస్తే అన్ని పనులు నిరవధికంగా సాఫీగా సాగుతాయి.

కన్య:

పనుల్లో ఉన్న అవరోధాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. సోదరుల శుభకార్య ఆహ్వానాలు వస్తాయి. వ్యాపార పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అప్రమత్తత అవసరం కానీ చివరికి సానుకూల ఫలితాలే వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సమయానుకూల సహాయం లభిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేస్తే రక్షణ కలిగి ధనప్రాప్తి లభిస్తుంది.

తుల:

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. వారం మధ్యలో కొంత ఆర్థిక ఇబ్బంది తలెత్తినా తర్వాత లాభాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తత అవసరం. ఉద్యోగంలో స్థానచలన సూచనలు ఉంటాయి. గురుచరిత్ర పారాయణం చేస్తే అన్నివిధాల శ్రేయస్సు కలుగుతుంది.

వృశ్చికం:

శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. వ్యాపారాలు విస్తరించి కొత్త లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. విదేశీ ప్రయాణానికి అనుకూల సమయం. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు వస్తాయి. సామాజిక వర్గంలో గౌరవం పెరుగుతుంది. రామరక్షా స్తోత్రం పారాయణం చేస్తే శత్రు అడ్డంకులు తొలగి విజయాలు సాధిస్తారు.

ధనుస్సు:

కుటుంబ సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగ సమస్యలు తొలగుతాయి. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చివరికి శుభం కలుగుతుంది. విలువైన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మేధా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేస్తే జ్ఞానం పెరిగి పనులు విజయవంతమవుతాయి.

మకరం:

భూవివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వాహనం కొనుగోలు యత్నం సఫలమవుతుంది. గృహనిర్మాణ యత్నాలు సానుకూలంగా మొదలవుతాయి. వ్యాపార విస్తరణ వేగవంతం అవుతుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం తగ్గుముఖం పడుతుంది. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు వస్తాయి. దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేస్తే శక్తి, ధైర్యం పెరిగి విజయం సాధిస్తారు.

కుంభం:

భూవివాదాలు పరిష్కారం అవుతాయి. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. సంతానం విద్యా విషయాల్లో శుభవార్తలు అందిస్తారు. గృహనిర్మాణ యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగ సమస్యలు పరిష్కారమవుతాయి. వారం మధ్యలో వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కనకధారా స్తోత్రం పారాయణం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనప్రాప్తి కలుగుతుంది.

మీనం:

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కొత్త రుణాలు తీసుకునే అవసరం వస్తుంది. ఇంటి బయట బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. బంధువులతో తగాదాలు రావచ్చు. వాహనం కొనుగోలు యోగం ఉంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగంలో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేస్తే ఆరోగ్యకరమైన శక్తి లభించి విజయాలు సాధిస్తారు.

Next Story