వార ఫలాలు: తేది 29-12-2024 నుంచి 04-01-2025 వరకు

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఇంటాబయటా అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. దీర్ఘకాలిక రుణాలు తొలగుతాయి. గృహమున వివాహాది శుభకార్యల కొరకు ఖర్చు చేస్తారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Dec 2024 6:30 AM IST
horoscope, Astrology, Rasiphalalu

వార ఫలాలు: తేది 29-12-2024 నుంచి 04-01-2025 వరకు

మేష రాశి :

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఇంటాబయటా అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. దీర్ఘకాలిక రుణాలు తొలగుతాయి. గృహమున వివాహాది శుభకార్యల కొరకు ఖర్చు చేస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. స్ధిరాస్తి వివాదాలు తొలగుతాయి. వ్యాపారంలో నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తిఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉంటుంది. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ధన పరంగా ఇబ్బందులు కలుగుతాయి. కనకధారా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృషభ రాశి :

ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. గృహనిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వారం ప్రారంభంలో ఆరోగ్య ఇబ్బందుల కలుగుతాయి. కుటుంబ సభ్యులు మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

మిథున రాశి :

ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. ధన పరంగా ఇబ్బందులను అధిగమించి రుణాలు తీరుస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన గృహం కొనుగోలుకు సన్నిహితుల నుండి సహకారం లభిస్తుంది. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఊహించని పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థానచలనాలు కలుగుతాయి. కొన్ని రంగాల వారికి తగిన గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యన ఇంటా బయట చికాకులు కలుగుతాయి.సోదరులతో సఖ్యతగా వ్యవహరించడం మంచిది. ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేయించడం వలన అనుకూల ఫలితాలను పొందుతారు.

కర్కాటక రాశి :

కుటుంబ సమస్యలను ఓర్పుతో పరిష్కరించుకుంటారు అవసరానికి ధనసహాయం లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు కుదుటపడి ఉపశమనం కలుగుతుంది. సమాజంలో పేరుప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అకస్మాత్తుగా మధ్యలో నిలిచిపోయిన గృహ నిర్మాణ ప్రయత్నాలు మరలా ప్రారంభిస్తారు. కొత్తగా ప్రారంభించిన వ్యాపారాలు మరింత రాణిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. చిన్న తరహా పరిశ్రమల వారు తగిన లాభాలను పొందుతారు వారం మధ్యలో పనులలో జాప్యం కలుగుతుంది. ఆకస్మిక ధన నష్ట సూచనలు ఉన్నవి. గణపతిని గరికతో పూజించడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

సింహ రాశి :

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. బంధుమిత్రులతో ఆకస్మికంగా మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య విషయాలలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఆర్థికంగా నిలకడ లోపిస్తుంది. కుటుంబ విషయంలో ఒక సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వాహన కొనుగోలు వాయిదా వేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం వలన మానసిక సమస్యలు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి చికాకులు తప్పవు. వారం చివరిన కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. పరమేశ్వరుడికి మారేడు దళాలు సమర్పించడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కన్య రాశి :

సంఘంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు మరింత ఉత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ధన పరంగా ఒడిదుడుకులను అధిగమించి నష్టాలు భర్తీ చేసుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది. వారం చివరన బంధు మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సూర్యారాధన చేసి బియ్యంతో వండిన పరమాన్నం నైవేద్యంగా సమర్పించిన శుభ ఫలితాలను పొందుతారు.

తుల రాశి :

ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయట పడతారు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలను మంచి ఆలోచన జ్ఞానంతో తొలగించుకుంటారు. బంధుమిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతాయి. గృహ కొనుగోలు ప్రయత్నాలకు అవరోధాలు తొలగుతాయి. ధార్మికసేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగమున పై అధికారులతో ఉన్న ఒత్తిడి ఒక్కసారిగా ఉపశమనం కలుగుతుంది. కొన్ని రంగాల వారికి శుభ వార్తలు అందుతాయి. ధన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిదికాదు. వారంమధ్యన ఆకస్మిక ఖర్చులుంటాయి ప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు. కాలభైరవ స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చిక రాశి :

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఊహించిన విధంగా మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో సమస్యలు సర్దుమణుగుతాయి. కొన్ని విషయాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు కలసివస్తాయి. బంధు మిత్రులను కలుసుకుని ఒక వ్యవహారంపై చర్చలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది. సమాజంలో మీ విలువ పెరుగుతుంది. ఉద్యోగాలలో చిక్కులు అధిగమించి ముందుకు సాగుతారు. చిన్న తరహా పరిశ్రమలకు లాభాలు అందుతాయి. వారం ప్రారంభంలో బంధుమిత్రులతో విభేదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి :

ఇంటాబయటా కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. నూతన పరిచయాలు వలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్తువులకు ధన వ్యయం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారపరంగా భాగస్వాములతో వివాదాలు సద్దుమణుగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సఖ్యతగా వ్యవహరించడంతో మీ పనులు పూర్తి అవుతాయి. నిరుద్యోగులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలుంటాయి. వారం చివరన కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కలుగుతాయి. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. దుర్గాదేవికి ఖడ్గమాలా పూజ చేయించిన శుభ ఫలితాలను పొందుతారు.

మకర రాశి :

సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థికంగా కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి. మిత్రులతో గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యాపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి నూతన అవకాశాలు లభిస్తాయి. గృహనిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యలనూ ఓర్పుతో పరిష్కరించుకోవాలి. ఉద్యోగ విషయమై అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. కొన్ని రంగాల వారికి సానుకూలంగా ఫలితాలుంటాయి. వారం మధ్యన ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. సుబ్రహ్మణ్య స్వామికి సర్ప సూక్తం తో అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కుంభ రాశి :

చాలా కాలంగా పూర్తికాని పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయం కలుగుతుంది. ఆర్థికంగా మరింత స్థిరత్వం లభిస్తుంది. సన్నిహితులతో సమస్యల గూర్చి చర్చిస్తారు.సేవా కార్యక్రమాలు నిర్వహించి పేరు ప్రతిష్టలు పెంచుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు పుంజుకుంటాయి. పోగొట్టుకున్నవిలువైన వస్తువులు తిరిగి దక్కుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు సర్దుబాటు అవుతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో చికాకులు తొలగి ప్రశాంతత కలుగుతుంది. కొన్ని రంగాల వారికి నూతన అవకాశాలు అందుతాయి. వారం చివరన సోదరులతో స్థిరాస్తి సంబంధిత విభేదాలు కలుగుతాయి. నవగ్రహ ప్రదక్షిణ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మీన రాశి :

ముఖ్యమైన పనులలో తొందరపాటు పనిచేయదు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలూ తీసుకోవడం మంచిది. బంధువుల నుండి ధన సహాయం అందుతుంది.సంఘంలో పరిచయాలు మరింత విస్తృతమవుతాయి. సోదరులసహాయంతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. గృహమున ఒడిదుడుకులు అధిగమిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ సందర్శనలు చేసుకుంటారు. గృహనిర్మాణ ప్రయత్నాలలో అవాంతరాలు తొలగి పనులు ముందుకు సాగుతాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగ విషయమై అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. అన్ని రంగాల వారికి అధికారుల ఆదరణ కలుగుతుంది. వారం మధ్యన చిన్నపాటి వివాదాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుండి మాననసిక ఒత్తిడి పెరుగుతుంది. మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Next Story