వార ఫలాలు: తేదీ 28-04-2024 నుంచి 04-05-2024 వరకు

కీలక సమయంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

By జ్యోత్స్న  Published on  28 April 2024 12:51 AM GMT
horoscope, astrology, Rasiphalalu

వార ఫలాలు: తేదీ 28-04-2024 నుంచి 04-05-2024 వరకు  

మేష రాశి :

కీలక సమయంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. ఉద్యోగులకు అధికారులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. చేపట్టిన కార్యక్రమాలు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందుతాయి. అన్నిరంగాల వారికి అనుకూల సమయం. వారం చివరిలో చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం:

శ్రీరాజరాజేశ్వరి అష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృషభ రాశి :

చాలా కాలంగా వేచి చూస్తున్న ఆశయాలు నెరవేరతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇంటాబయట మీదే పైచేయి అవుతుంది. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఒక సమాచారం సంతోషానిస్తుంది. విద్యార్థుల ఆశించిన అవకాశములు అందుతాయి. బంధువర్గంతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలలో అవాంతరాలు తొలగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో ఋణఒత్తిడులు అధికమౌతాయి. బంధువులతో విభేదాలు తప్పవు.

పరిహారం:

నవగ్రహ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మిథున రాశి :

ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటా బయట బాధ్యతలు మరింత పెరుగుతాయి. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. గృహ నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. చిన్నతరహా పరిశ్రమలకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి. వారం చివరిలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ప్రముఖుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.

పరిహారం:

రామ ఆపదుద్దారణ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి :

వారం ప్రారంభంలో ఆకస్మిక ధనప్రాప్తి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. గృహ నిర్మాణయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం తప్పదు. కొన్ని రంగాల వారికి చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు మందకోడీగా సాగుతాయి. మిత్రులతో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటాబయట సమస్యలు అధిగమవుతాయి. సోదరులను కలుసుకుని వివాహ విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తప్పవు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి.

పరిహారం:

గరుడ కవచం పారాయణ చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

సింహ రాశి :

స్థిరాస్తి వివాదాలు కొంతమేర తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. అనుకున్న వ్యవహారాలలో ఆశించిన ఫలితాలుంటాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ అధికారులతో ఉన్న సమస్యలు అధిగమిస్తారు. అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయ సూచనలు ఉన్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాదిస్తాయి.

పరిహారం:

హనుమాన్ ఛాలీసా పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కన్య రాశి :

విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుని ఉత్సాహంగా ముందుకు సాగుతారు. నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు తప్పవు. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం:

శ్రీ కృష్ణ చంద్రాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

తుల రాశి :

ఆత్మీయుల నుంచి అందిన సమాచారం కొంత ఊరటనిస్తుంది. మిత్రులతో వివాదాలు మానసికంగా బాధిస్తాయి. వ్యాపారమున తీసుకునే నిర్ణయాలలో మరింత నిదానంగా వ్యవహారించాలి. చేపట్టిన వ్యవహారాలలో కొద్దిగా ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. స్థిరస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పవు. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని రంగాల వారికి శ్రమ మరింత పెరుగుతుంది. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో శుభాకార్యాలలో పాల్గొంటారు. నూతన వాహనయోగం ఉన్నది. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

పరిహారం:

సుబ్రమణ్య భుజంగ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి :

ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. రుణబాధల నుంచి విముక్తి కలుగుతుంది. నూతన పనులు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. అన్ని రంగాల వారికి అరుదైన అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. వారం మధ్యలో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

పరిహారం:

మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

ధనస్సు రాశి :

దూరపు బంధువుల నుండి అందిన ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. సన్నిహితులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. వారం చివరిలో అనుకోని ధనవ్యయ సూచనలున్నవి. కుటుంబంలో గంధరగోళ పరిస్థితులుంటాయి. మానసిక చికాకులు తప్పవు. పరిహారం:

హనుమాన్ బడబానల స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మకర రాశి :

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగమున్నది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. నూతన గృహ వాహన యోగం ఉన్నది. నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగమున జీత భత్యముల విషయంలో శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు భాధిస్తాయి. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి.

పరిహారం:

గణేశ హృదయ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కుంభ రాశి :

కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబంలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చేపట్టిన శ్రమ తప్ప ఫలితం కనిపించదు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కొన్ని అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. విద్యార్థులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపారాలలో మరిన్ని ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి. చిన్నతరహా పరిశ్రమలకు ఊహించని వివాదాలు నెలకొంటాయి. వారం చివరిలో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.

పరిహారం:

దుర్గా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మీన రాశి :

మిత్రులతో ఆకారణ వివాదాలు చికాకు పరుస్తాయి. స్థిరస్తి సంబంధించిన ఒప్పందాలు వాయిదా వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో చర్చలు విఫలమౌతాయి. ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. ఏ పని చేపట్టినా ముందుకు నిరాశ పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు. వ్యాపారాలలో అనుకోని మార్పులు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు సకాలంలో అందవు వారం ప్రారంభంలో బంధువుల ద్వారా శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

పరిహారం:

లక్ష్మీ నృసింహ కవచం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

Next Story