వార ఫలాలు: తేది 27-04-2025 నుంచి 03-05-2025 వరకు

చేపట్టిన వ్యవహారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నూతన రుణాల కోసం ప్రయత్నాలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

By జ్యోత్స్న
Published on : 27 April 2025 6:16 AM IST

horoscope, Astrology, Rasiphalalu

వార ఫలాలు: తేది 27-04-2025 నుంచి 03-05-2025 వరకు

మేష రాశి :

చేపట్టిన వ్యవహారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నూతన రుణాల కోసం ప్రయత్నాలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. గృహ నిర్మాణయత్నాలు మందకొడిగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. విద్యార్థుల శ్రమ అంతగా ఫలించదు. దాయాదుల తో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. కొన్ని రంగాల వారికి అకారణ వివాదాలు కలుగుతాయి. వారం మధ్యలో శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృషభ రాశి:

ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. సోదరులు, మిత్రుల నుంచి అందిన శుభకార్య ఆహ్వానాలు ఉత్సాహాన్నిస్తాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. వ్యతిరేక పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటారు. విలువైన వస్త్రా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చేపడతారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధు వర్గంతో వివాదాలు తప్పవు. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

మిధున రాశి:

నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమౌతాయి. స్థిరస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. మిత్రుల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వాహన, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు క్రమ క్రమంగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం దుర్గా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కర్కాటక రాశి:

చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచన లో స్థిరత్వం లోపిస్తుంది. సోదరులతో స్థిరాస్తి విషయంలో ఊహించని వివాదాలు కలుగుతాయి. గృహ నిర్మాణయత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అధికారులు ఆగ్రహం వలన స్థాన చలనాలు తప్పవు. కొన్ని రంగాల వారు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. వారం ప్రారంభంలో ఆర్థికంగా సంతృప్తికర వాతావరణం ఉంటుంది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. పంచముఖ హనుమత్ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

సింహ రాశి:

ఆర్థిక పరిస్థితులు కొంత గందరగోళంగా ఉంటాయి. సోదరులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. ఇంటా బయట బాధ్యతలతో సతమతమవుతారు. కొందరు ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. కీలక సమయంలో ఆలోచనలు నిలకడగా ఉండవు. గృహ నిర్మాణ ప్రయత్నాలు మధ్యలో నిలిచిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు నష్టాలు తప్పవు. వారం చివరిలో ఆప్తుల నుండి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కన్య రాశి:

ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. స్థిరస్తి విషయంలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులకు లభించిన అవకాశాలు చేజారుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం ప్రారంభమున కొందరి మాటలు ఆశ్చర్యపరుస్తాయి. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం మరింత పెరుగుతుంది. వారం ప్రారంభంలో శుభవార్తలు అందుతాయి. విలువైన వస్త్రా భరణాలు కొనుగోలు చేస్తారు. సంతాన గోపాల స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

తుల రాశి:

చాలా కాలంగా బాదిస్తున్న సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరస్తి క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. బంధువుల సహాయంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు సర్దుమణుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో బంధువులతో మాటపట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. కొన్ని వ్యవహారాలలో శిరో బాధలు తప్పవు. గణేశాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చిక రాశి :

ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఇంట బయట ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. దూరపు బంధువుల ఆగమనం ఆనందానిస్తుంది. స్థిరస్తి వివాదాలు కొంత బాధిస్తాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. వారం మధ్యలో ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. నూతన వాహనయోగం ఉన్నది. శివ సహస్రనామా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ధను రాశి:

దీర్ఘకాలిక వివాదాలు కొన్ని పరిష్కార దశకు చేరుకుంటాయి. విద్యార్థులు ఆశించిన లక్ష్యాలు నెరవేరతాయి. నూతన వాహన, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సమయస్ ఫూర్తితో కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. వ్యాపారాలు క్రమక్రమంగా మెరుగుపడుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్నతరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో చిన్నపాటి విబేధాలుంటాయి. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మకర రాశి:

బందు, మిత్రుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమౌతాయి. నూతన వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. పాత ఋణాలు కొంత వరకు తొలగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్నతరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివరిలో ధనపరంగా ఇబ్బందులు తప్పవు. మిత్రుల నుంచి ఒత్తిడులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. గృహ నిర్మాణయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. లక్ష్మి నృసింహ కరావలంభ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కుంభ రాశి:

వృత్తి ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగుల కృషి కొంత వరకు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ విషయాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయట అందరిని మంచి మాట తీరుతో ఆకట్టుకుని ముందుకు సాగుతారు. వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి. బందువులతో వివాదాలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. చిన్నతరహా ప్రయత్నాలు సఫలమౌతాయి. గణేశాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మీన రాశి:

గృహమున శుభకార్యాలు నిర్వహణపై చర్చలు జరుపుతారు. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో ఒక సంఘటన మీలో కొంత మార్పు తెస్తుంది. చేపట్టిన పనులు కొంత నిదానంగా సాగుతాయి. బంధు మిత్రుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు అదిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పనిభారం నుండి కొంత ఉపశమనం పొందుతారు. వారం ప్రారంభంలో ఆర్థిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మిత్రులతో కలహా సూచనలున్నవి. విష్ణు పంజరస్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

Next Story