వార ఫలాలు: 21-12-2024 నుంచి 27-12-2024 వరకు

బంధుమిత్రుల నుంచి కీలక విషయాలు తెలుస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో ఇబ్బందులు తొలగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.

By జ్యోత్స్న  Published on  22 Dec 2024 6:13 AM IST
horoscope, Astrology, Rasiphalalu

వార ఫలాలు: 21-12-2024 నుంచి 27-12-2024 వరకు

మేషం రాశి :

బంధుమిత్రుల నుంచి కీలక విషయాలు తెలుస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో ఇబ్బందులు తొలగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన అవకాశాలు అందుతాయి. వారం మధ్యలో కుటుంబ సమస్యల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

వృషభం రాశి :

అధిక కష్టంతో స్వల్ప ఫలితం పొందుతారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందక ఇబ్బంది పడతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. రావలసిన ధనం చేతికి అందడంలో ఆలస్యం అవుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు అంతగా రాణించవు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని బాధ్యతల వలన విశ్రాంతి లభించదు. కొన్ని రంగాల వారికి నిరాశ తప్పదు. ఆర్థికంగా ఒత్తిడి అధికమవుతుంది. వారాంతంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆంజనేయస్వామిని సింధూరంతో పూజించడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మిథునం రాశి :

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘ కాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ప్రముఖుల సహాయంతో కొన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు ఉన్నా అంతగా ఇబ్బంది కలిగించవు. రుణగ్రస్తుల నుండి రావలసిన ధనం చేతికి అందుతుంది. మొండి బాకీలు తీర్చగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలుకు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో విధులను సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్నతరహా పరిశ్రమల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. వారం చివరన ధనవిషయంలో జాగ్రత్త వహించాలి. స్వల్ప వివాదాలు ఉంటాయి. విష్ణు ఆరాధనా శుభ ఫలితాలను కలిగిస్తుంది.

కర్కాటకం రాశి :

గృహమున శుభకార్యాలు జరుగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల కొరకు డబ్బు ఖర్చు చేస్తారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి అవుతాయి. నిరుద్యోగులు అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. రుణదాతల ఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు. ఇతరుల నుండి రావలసిన ధనం అందుతుంది. వ్యాపారాలు అనుకున్న విధంగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి బయటపడతారు. చిన్న తరహా పరిశ్రమల వారు అంచనాలను అందుకుంటారు. వారం ప్రారంభంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బంధు మిత్రులతో తొందర పడి మాట్లాడటం మంచిది కాదు. రామరక్షా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందతారు.

సింహం రాశి :

చాలా కాలంగా పడుతున్న కష్టానికి తగిన ఫలితం పొందుతారు. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అండదండలు లభిస్తాయి. బంధు మిత్రులతో ఉన్నటువంటి వివాదాలను సర్దుబాటు చేసుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు అవరోధాలు తొలగుతాయి. అవసరానికి చేతికి ధనం అందుతుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులను సేకరిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్న తరహా పరిశ్రమలవారికీ అందిన సమాచారం భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటుంది. వారం చివరన దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వివాదాలకు వెళ్లకపోవడం మంచిది. కనకధారా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కన్య రాశి :

నిరుద్యోగులు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణాలకు అవసరమైన ధనం అందుతుంది. బంధుమిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. రుణ భారం నుండి కొంత ఉపశమనం కలుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఊహించని సహాయం అందుతుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. చిన్నతరహా పరిశ్రమల వారికి కొంత పనిభారం తప్పదు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలుంటాయి. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. శివాలయ దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

తుల రాశి :

శత్రువులను కూడా మిత్రులు గా మార్చుకుని సహాయ పడతారు. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. రావలసిన బాకీలు వసూలవుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపార విస్తరణకు ఉన్నటువంటి అడ్డంకులను అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలను చేపడతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు అందిన ఒక వార్త ఊరట కలిగిస్తుంది. నూతన వస్త్రా వస్తు లాభాలు అందుతాయి. వారం చివరన ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. ఇతరులకు ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. మధురాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చికం రాశి :

ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. బంధువర్గం వారి నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు. సంతాన వివాహయత్నాలు సానుకూలమవుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. విద్యా ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో ఉన్న సమస్యలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. కొన్ని రంగాల వారికి అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. వారం ప్రారంభంలో ఖర్చులు అధికమవుతాయి. మీ మాటకు విలువ తగ్గుతుంది. ఆర్ధిక సమస్యలు పెరుగుతాయి. రాజరాజేశ్వరీ దేవి ఆరాధన శుభ ఫలితాలను కలిగిస్తుంది.

ధనస్సు రాశి :

సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత వివాదాలుతొలగి లబ్ధిపొందుతారు. కొన్ని పనులలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలలో కష్టానికి తగిన లాభాలు అందుకుంటారు. సమాజ సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో విశేషంగా పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో తీసుకున్న నిర్ణయాలలో కలిసివస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చిన్న తరహా పరిశ్రమ వారు అన్ని విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మకరం రాశి :

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున చికాకులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వం నుండి సహాయం అందుతుంది. మంచి ఆలోచన జ్ఞానంతో సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్య పరుస్తుంది. ఇతరుల సమస్యలు సైతం పరిష్కరిస్తారు. ఆర్ధిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వారంచివరిలో వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కుంభం రాశి :

సంతాన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాల నుండి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. నూతన వాహనయోగం ఉన్నది. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది, దీర్ఘకాలిక రుణాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగమున పని భారం నుండి ఉపశమనం కలుగుతుంది. అధికారులతో సఖ్యతగా వ్యవహరించి పనులను పూర్తి చేసుకుంటారు. కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో వ్యయ ప్రయాసలతో గాని పనులు పూర్తి కావు. కాలభైరవ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మీనం రాశి :

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కీలక వ్యవహారాలు సన్నిహితులు సలహా తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ సంబంధిత పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వారం మధ్య నుండి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు కలసి వస్తాయి. ప్రభుత్వ సంబంధిత సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Next Story