వార ఫలాలు: తేది 23-04-2023 నుంచి 29-04-2023 వరకు
ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. సన్నిహితులు, మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా
By జ్యోత్స్న Published on 23 April 2023 6:20 AM ISTవార ఫలాలు: తేది 23-04-2023 నుంచి 29-04-2023 వరకు
మేష రాశి : ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. సన్నిహితులు, మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక పురోగతి సాధిస్తారు. వారం చివరిలో చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువర్గం తో విభేదాలు కలుగుతాయి.
పరిహారం : దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
వృషభ రాశి : దీర్ఘకాలిక రుణబాధలు నుండి ఉపశమనం పొందుతారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట సమస్యలు ఎదురైనా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. సంతాన వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. కొన్ని రంగాల వారికి పదోన్నతులు పెరుగుతాయి. వారం మధ్యలో కొందరి ప్రవర్తన వలన మానసిక శాంతి కలుగుతుంది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.
పరిహారం : సుందరకాండ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
మిథున రాశి : స్థిరాస్తి వివాదమై ఆప్తుల నుండి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు పరిష్కార దిశగా వస్తాయి. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ముఖ్యమైన పనులలో కొంత జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. వ్యాపారాలలో భాగస్తుల సహాయం అందుతుంది. ఉద్యోగులకు ఉన్నత పదవులు పొందుతారు. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది.
పరిహారం : నవగ్రహ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
కర్కాటక రాశి : వాహన అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగులకు ఉన్నత అధికారుల నుండి కీలక సమాచారం అందుతుంది. అన్ని రంగాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు అవాంతరాలను అధిగమించి ముందుకు సాగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడగలుగుతారు. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారం ప్రారంభంలో ధన పరంగా ఇబ్బందులు ఉంటాయి. స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి.
పరిహారం : లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
సింహ రాశి : దాయాదుల తో స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. చిన్ననాటి మిత్రులతో దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరిచిన అవసరానికి ధనసహాయం అవుతుంది. బంధువులతో మరింత సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి ఊహించని ఆహ్వానాలను అందుకుంటారు. కొన్ని రంగాల వారికి అరుదైన అవకాశాలు అందుతాయి. వారం మధ్యలో బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
పరిహారం : విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
కన్య రాశి : కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరస్తి కొనుగోలు యత్నాలలో అవాంతరాలు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో కొన్ని వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ధన పరంగా ఒత్తిడులు పెరుగుతాయి.
పరిహారం : రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
తుల రాశి : నూతన వాహన యోగం ఉన్నది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి చిన్ననాటి సంఘటనలు గుర్తు చేసుకుంటారు నిరుద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి కొంత వరకు బయటపడతారు. కుటుంబ పెద్దల సహాయంతో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకుంటారు. తెలివితేటలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సోదరులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వారం చివరిలో పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
పరిహారం : గణపతి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
వృశ్చిక రాశి : ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి. దైవదర్శనం చేసుకుంటారు. వాహనాలు అనుకూలత కలుగుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. కీలక విషయాలు సేకరిస్తారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి.
పరిహారం : సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
ధనస్సు రాశి : బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్థిరస్తి వివాదాల నుంచి బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త వ్యక్తులు పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. చాలాకాలంగా పూర్తి కాని పనులను సైతం పూర్తి చేస్తారు. సోదరుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. అన్ని రంగాల వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. వారం మధ్యలో ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. మానసిక ఆందోళనలు బాధిస్తాయి.
పరిహారం : మధురాష్టకం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.
మకర రాశి : కీలక విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. స్థిరస్తి విషయంలో ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. ముఖ్యమైన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మందకొడిగా సాగుతుంది. కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. సంతాన విద్యా ఉద్యోగ యత్నాలలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం మంచిది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో పనిభారం అధికమవుతుంది. వారం చివరిలో గృహమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
పరిహారం : శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
కుంభ రాశి : ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారాలలో అనూహ్యంగా రాణిస్తారు. ఆర్థిక ఆశించిన విధంగా ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి అవుతాయి. బంధువులు, మిత్రులతో అత్యంత కీలక విషయాలు గురించి చర్చిస్తారు. ఇంటాబయట నూతన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉద్యోగాలలో సమస్యలు తగ్గుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో దూరపు బంధువులతో తగాదాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.
పరిహారం : కనకధారాస్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
మీన రాశి : గృహమున కీలక ఆలోచనలు అమలు చేస్తారు. బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలలో అవరోధాలను అధిగమించి లాభాలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. అన్ని రంగాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కొందరి ప్రవర్తన మానసిక అశాంతిని కలిగిస్తుంది.
పరిహారం : weekly-horoscope-2023-april-23th-to-29thహనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.