వార ఫలాలు: తేదీ 16-04-2023 నుంచి తేదీ 22-04-2023 వరకు

ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. దూరపు బంధువులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా

By జ్యోత్స్న  Published on  16 April 2023 1:25 AM GMT
horoscope, astrology, Rasiphalalu

వార ఫలాలు: తేదీ 16-04-2023 నుంచి తేదీ 22-04-2023 వరకు 

మేష రాశి : ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. దూరపు బంధువులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన పనులు చిన్న ప్రయత్నంతో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా అవసరాలకు ధనం లభిస్తుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చిన్నతరహా పరిశ్రమలకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యలో ఆర్థికంగా ఇబ్బందులుంటాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక సమస్యలు నుండి ఊరట లభిస్తుంది.

పరిహారం: లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన చేయటం వలన శుభఫలితాలను పొందుతారు.

వృషభ రాశి : గృహమున కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగి ఊరట చెందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృథాఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్నిరంగాల వారికీ ఆశించిన ఫలితాలుంటాయి. వారం చివరిలో చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారమున ఇంతకాలం పడిన శ్రమ తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలుంటాయి.

పరిహారం: మేధా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మిథున రాశి : చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు అవరోధాలు అధిగమించి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్థులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి. అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. గృహమునకు మీరు తీసుకున్న నిర్ణయాలు కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరుస్తాయి. సంతానం విద్యా విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలను అందుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వారం ప్రారంభంలో బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.

పరిహారం: ఆదిత్య హృదయం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి : నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. గృహ వాహన యోగం ఉన్నది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులతో నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. అన్ని రంగాలవారికి క్రమక్రమంగా లాభాల పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఉద్యోగంలో పనిఒత్తిడి అధికమవుతుంది.

పరిహారం: రామరక్షా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

సింహ రాశి : వృత్తి ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వివాదాలు పరిష్కారమవుతాయి. సంతాన వివాహ విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారమున లాభాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున పని ఒత్తిడి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. రాజకీయ రంగాల వారికి అరుదైన అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ఖర్చులను అదుపులో ఉంచడం మంచిది.

పరిహారం: విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కన్య రాశి : స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు వాయిదా పడతాయి. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం కొంత నిరాశ కలిగిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. సోదరులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ విషయమై కొంత మానసిక సమస్యలు తప్పవు. ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆదాయం పెరుగుతుంది.

పరిహారం: హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వలన శుభఫలితాలను పొందుతారు.

తుల రాశి : చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు. ధార్మిక సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు. ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది. బంధుమిత్రులుతో సఖ్యతగా వ్య్వవహరిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు అరుదైన అవకాశాలు అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. వారం చివర్లో చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది.

పరిహారం: గణపతి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చిక రాశి : నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. కుటుంబ సంభందిత వివాదాలు తెలివిగా పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులు మరింత ఉత్సాహంగా పని చేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

పరిహారం: శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయటం వలన శుభఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి : చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో మీ విలువ మరింత పెరుగుతుంది. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. దీర్ఘకాలిక ఒత్తిడి నుండి కొంత వరకు బయట పడతారు వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది చేపట్టిన పనులు మందగిస్తాయి.

పరిహారం: నవగ్రహ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మకర రాశి : సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. సోదరులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. అన్ని రంగాల వారికి మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి. వారం చివరలో ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. నూతన రుణాలు చేయకపోవడం మంచిది.

పరిహారం: దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కుంభ రాశి : ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వారం ప్రారంభంలో కొన్ని సంఘటనలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఆదాయ మార్గాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్థిరాస్తి వివాదాలు కి సంబంధించి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది. ఉద్యోగమున అధికారుల సహాయంతో వివాదాలనుండి బయటపడగలరు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం ప్రారంభంలో మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ధన పరంగా చికాకులు తప్పవు.

పరిహారం: సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మీన రాశి : సోదరుల నుండి ధన సహాయం అందుతుంది. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభాలు కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ధన పరంగా అవరోధాలు అధిగమిస్తారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయంతో స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు సరైన అవకాశాలు లభిస్తాయి. కొన్ని రంగాలవారికి ఒత్తిడి నుండి బయట పడతారు. వారం ప్రారంభంలో ధనవ్యయ సూచనలు ఉన్నవి. బంధు వర్గం వారితో విభేదాలు ఉంటాయి.

పరిహారం: మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

Next Story