వార ఫలాలు: తేది 17-11-2024 నుంచి 23-11-2024 వరకు

చేపట్టినా వ్యవహారాలలో కొంత జాప్యం కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్య విషయాలలో ఆత్మీయుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా స్వల్ప చికాకులు ఉంటాయి.

By జ్యోత్స్న  Published on  17 Nov 2024 6:17 AM IST
horoscope, Astrology, Rasiphalalu

వార ఫలాలు: తేది 17-11-2024 నుంచి 23-11-2024 వరకు

మేష రాశి :

చేపట్టినా వ్యవహారాలలో కొంత జాప్యం కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్య విషయాలలో ఆత్మీయుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా స్వల్ప చికాకులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకులు తప్పవు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. స్థిరాస్తి ఒప్పంద ప్రయత్నాలు ముందుకు సాగవుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఊహించని మార్పులు కలుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలవారు అంచనాలు అందుకోవడంలో విఫలమౌతారు. వారం మధ్యలో దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. లక్ష్మి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృషభ రాశి :

కుటుంబమున సఖ్యత కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుని ఋణాలు తీర్చగలుగుతారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తిచేస్తారు. దీర్ఘ కాలిక సమస్యలను మిత్రుల సహకారంతో పరిష్కరించుకుంటారు. భూ సంభందిత వివాదాలు తొలగుతాయి. నూతన వ్యాపారాలో ఆశించిన లాభాలు పొందుతారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి అధికారుల నుండి గుర్తింపు పొందుతారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి. వారం చివరన ధన వ్యయ సూచనలున్నవి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మిథున రాశి :

ముఖ్యమైన పనులు స్వంత నిర్ణయాలతో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. ఇంట బయట సమస్యలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయాలు కలసివస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగయత్నాలు నిదానంగా అనుకూలిస్తాయి. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వారం చివరిలో శ్రమాధిక్యత పెరుగుతుంది. సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి. సుబ్రమణ్యకవచం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి :

చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ధన పరంగా బంధుమిత్రుల నుండి ఊహించని సహాయం లభిస్తుంది. వివాదాల పరిష్కారానికి నూతన పద్ధతులు పాటించి విజయం పొందుతారు. మిత్రులతో విందు వినోదాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. శత్రువులు మిత్రులుగా మారి సహాయపడతారు. గృహమున శుభకార్యాల పై చర్చలు జరుగుతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలకు ఆలోచనలు ఆచరణలో పెట్టి లాభాలను ఉంటారు. వారం ప్రారంభం ధన పరంగా స్వల్ప చికాకులు తప్పవు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. హయగ్రీవ స్వామి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

సింహ రాశి :

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక చికాకు పెరుగుతుంది. ఆలోచనలలో స్థిరత్వం లోపించడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన విధంగా ఉండవు దైవదర్శనం చేసుకుంటారు. సంఘంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో అవరోధాలు ఉంటాయి. వారం మధ్య నుండి పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలసి వస్తాయి. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు పొందుతారు. అన్ని రంగాల వారికి ఆశించిన అవకాశాలు లభిస్తాయి. కనకధారా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కన్య రాశి :

ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధనం లభిస్తుంది. సన్నిహితులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. పనులలో ఒత్తిడి పెరిగినా అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపార వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేయడం మంచిది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలుస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార ప్రారంభమునకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక లబ్ధి పొందుతారు. వారాంతమున స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. నవగ్రహ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

తుల రాశి :

నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి బయట పడతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి ఒప్పందాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వ్యాపారపరంగా ఆశించిన లాభాలను పొందుతారు. ఉద్యోగ విషయంలో అధికారులతో మనస్పర్థలు తొలగి ఊరట చెందుతారు. కొన్ని రంగాల వారికి చికాకులు తప్పవు. వారం చివరన చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. విష్ణు సహస్ర నామ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చిక రాశి :

చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఆశించిన సహాయం లభిస్తుంది. నిరుద్యోగుల ఆశయాలు నెరవేరుతాయి. నూతన పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. ఇంటాబయటా అందరినీ ఆకట్టుకుంటారు. వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ వాతావరణం మరింత ఉత్సాహంగా సాగుతుంది. చిన్నతరహా పరిశ్రమలకు అవరోధాలు తొలగుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. దుర్గా స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి :

ఆర్థిక పరిస్థితిలో లోటుపాట్లు ఉంటాయి. సన్నిహితుల మధ్య మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చుతాయి. సేవా కార్యక్రమాలలో బంధు మిత్రులతో పాల్గొంటారు. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుని బాధపడతారు. వ్యాపారపరంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. వారాంతమున సంఘంలో పెద్దల నుండి ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. ఆంజనేయ స్వామి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మకర రాశి :

చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఎదురవుతాయి. స్థిరాస్తి విషయాలు సోదరులతో వివాదాలు తప్పవు. స్థిరమైన నిర్ణయాలు చేయకపోవడం వలన ఆర్థికంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. ఎంత శ్రమపడినా ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో దైవదర్శనం చేసుకుంటారు. ఇతరుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఇంటాబయటా ప్రతికూలత పెరుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. వారం ప్రారంభం ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు గణపతి ఆరాధన శుభ ఫలితాలను కలిగిస్తుంది.

కుంభ రాశి :

విద్యార్థులకు శ్రమాధిక్యం పెరుగుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురై నిరాశ కలిగిస్తాయి. ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్పులు చేసుకుంటారు. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. నూతన ఋణయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయాలలో మరింత శ్రద్ధ వహించాలి. నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి చేసే ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో అనిశ్చిత కలుగుతుంది. కొన్ని రంగాలవారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యన స్వల్ప ధనలాభం కలుగుతుంది. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. మేధా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మీన రాశి :

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. కుటుంబ పెద్దల నుండి ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు. శత్రు పరమైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శనం చేసుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్ధిరాస్తి క్రయవిక్రయాలు లాభిస్తాయి. వ్యాపారాలలో అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వారం ప్రారంభమున స్వల్ప ధనవ్యయ సూచనలు ఉన్నవి. సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి. లక్ష్మీ నరసింహ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Next Story