వార ఫలాలు: తేది 15-09-2024 to 21-09-2024 వరకు

చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. కొన్ని వ్యవహారాలలో అనుకున్న విధంగా పూర్తి చేయలేరు. సన్నిహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు.

By జ్యోత్స్న  Published on  22 Sept 2024 6:12 AM IST
horoscope, Astrology, Rasiphalalu

దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి బంధు మిత్రులతో ఊహించని విభేదాలు

మేష రాశి :

చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. కొన్ని వ్యవహారాలలో అనుకున్న విధంగా పూర్తి చేయలేరు. సన్నిహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. రుణయత్నాలు వేగవంతం చేస్తారు. గృహమును ఒక విషయంలో ఓర్పుగా వ్యవహరించడం మంచిది. పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. నిరుద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో సామాన్య లాభాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించక నిరాశ పెరుగుతుంది. వారం మధ్యలో శుభవార్తలు అందుకుంటారు. నూతన వాహన అనుకూలత కలుగుతుంది. సోదరుల నుంచి ధన సహాయం అందితుంది.

వృషభ రాశి :

దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కొన్ని పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు కొంత మానసికంగా చికాకు కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థికంగా అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో అంచనాలు అందుకోవడం విఫలమవుతారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలలో అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు అధికమవుతాయి. అన్ని రంగాల వారికి కొత్త సమస్యలు తప్పవు. వారం ప్రారంభంలో శుభవార్తలు అందుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది.

మిథునం రాశి:

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చుట్టుపక్కల వారితో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారులకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని రంగాల వారికి చికాకులు తప్పవు. వారం ప్రారంభంలో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారస్తులు నూతన లాభాలను అందుకుంటారు.

కర్కాటక రాశి :

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. సోదరులతో అకారణంగా స్థిరాస్తి వివాదాలు నెలకొంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలలో భాగస్వాములతో ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. ఇంటా బయట చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. గృహ నిర్మాణయత్నాలలో అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. అన్ని రంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి. వారం చివరిలో దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణాలు కలిసొస్తాయి.

సింహ రాశి :

చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. గృహమున సొంత ఆలోచనలు అమలు చేయడంలో ముందడుగు వేస్తారు. వారంలో ఒక సంఘటన మిమ్మల్ని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా నిజంగా కావాలి అనుకున్నప్పుడు, అవసరం పడినప్పుడు ధన సహాయం లభిస్తుంది. వ్యాపారాలలో కొన్ని సమస్యల పరిష్కారంలో ముందడుగు వేస్తారు. నూతన వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయ సూచనలు ఉన్నవి. అనారోగ్య విషయాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

కన్య రాశి :

నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో సొంత ఆలోచనలు చేయడం మంచిది. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. నూతన గృహ నిర్మాణానికి సకాలంలో ధనం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివరిలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి.

తుల రాశి :

దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. స్థిరాస్తి విషయంలో సమస్యలు అధిగమిస్తారు. తెలివితేటలతో దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఇంటాబయటా కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొంత వరకు పనిఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. శ్రమ తో కాని పనులు పూర్తి కావు.

వృశ్చిక రాశి :

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయలేక నిరాశ పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బంధు మిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వృత్తి ఉద్యోగాలలో పరిస్థితులు అంతగా అనుకూలించవు. వివాదాలకు కొంత దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు. వారం ప్రారంభంలో శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

ధనస్సు రాశి :

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో గృహమున సందడిగా గడుపుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చగలుగుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దలు సలహాలు తీసుకోవడం మంచిది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. వ్యాపారాలు విస్తరణలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వారం మధ్యలో ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

మకర రాశి :

ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. బంధువులతో వివాదాలు కొంతవరకు రాజి చేసుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా వేస్తారు. అనుకున్న పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఇంటాబయటా పని ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. విద్యార్థులకు ఆశించిన అవకాశములు లభించవు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. ఉద్యోగాలలో స్థాన చలన సూచనలున్నవి. వారం మధ్యలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహన యోగం ఉన్నది.

కుంభ రాశి :

ముఖ్యమైన వ్యవహారాలను ప్రణాళికలను రూపొందించుకుని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారమవుతాయి. కొన్ని విషయాలలో ఓర్పుతో వ్యవహరించటం మంచిది. దీర్ఘకాలిక ఆరోగ్యసమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుని బాధపడతారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. బంధుమిత్రులతో వివాహాది వేడుకలలో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు మరింత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్యం సూచనలు ఉన్నవి.

మీన రాశి :

చాలాకాలంగా పూర్తి కాని పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇతరులకు మీ ఆలోచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగవుతాయి. దీర్ఘకాలిక రుణ బాధల నుండి క్రమక్రమంగా బయట పడతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. నూతనగృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ప్రభుత్వ అధికారులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. అన్ని రంగాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి.

Next Story