వార ఫలాలు: తేది 15-09-2024 to 21-09-2024 వరకు
ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహంలో శుభకార్య చర్చలు జరుగుతాయి. బంధు మిత్రులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు ఉంటాయి.
By జ్యోత్స్న Published on 15 Sept 2024 6:07 AM ISTవార ఫలాలు: తేది 15-09-2024 to 21-09-2024 వరకు
మేషం రాశి :
ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహంలో శుభకార్య చర్చలు జరుగుతాయి. బంధు మిత్రులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు ఉంటాయి. ఋణ భారం పెరుగుతుంది దేవాలయ దర్శనం చేసుకుంటారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి తొలగుతుంది. కొన్ని రంగాల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. గురు చరిత్ర పారాయణ చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.
వృషభం రాశి :
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులతో వివాదాలను సర్దుబాటు చేసుకుంటారు. సన్నిహితులు సలహాతో నూతన లాభాలను పొందుతారు. శత్రువులు కూడా మిత్రులు వలె ప్రవర్తించి సహాయపడతారు. స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహన వ్యాపారులకు అనుకూలత పెరుగుతుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. వారాంతంలో కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
మిథునం రాశి :
ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక ఇబ్బందులు విషయంలో ఆత్మీయుల సహాయంతో బయటపడతారు. సమాజంలో సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొని ప్రశంసలు పొందుతారు. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో ఆర్థికవ్యవహారాల గురించి చర్చలు జరుగుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది సంతానం విద్యా విషయాలలో అంచనాలు నిజమవుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వారం మధ్యన బంధుమిత్రులతో వాదనకు వెళ్లడం మంచిది కాదు. వృధా ఖర్చులు ఉంటాయి. శివారాధన శుభ ఫలితాలను కలుగజేస్తుంది.
కర్కాటకం రాశి :
చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబ సభ్యులతో చిన్న విషయాలకి వివాదాలు కలుగుతాయి. విద్యార్థుల కష్టానికి తగిన అవకాశాలు లభిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరు అవుతారు. వ్యాపారపరంగా ఆలోచనలను ఆచరణలో పెట్టి లాభాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి కొంత ఉపశమనం కలుగుతుంది. వారాంతంలో ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. ధనపరంగా ఒడిదుడుకులు ఉంటాయి. రామరక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
సింహం రాశి :
సమాజంలో పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. బంధు మిత్రులను కలుసుకునే ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆదాయ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు నుండి విముక్తి లభిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసివస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు ఊహించని లాభాలను పొందుతారు. ఉద్యోగాల విషయంలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వారు అనుకూల ఫలితాలను పొందుతారు. వారం మధ్యన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నవగ్రహారాధన శుభ ఫలితాలను కలిగిస్తుంది.
కన్య రాశి :
ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితి కలుగుతుంది. సన్నిహితులతో మాట పట్టింపులు తొలగుతాయి. స్థిరాస్తి ఒప్పందాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారంచుడతారు. సమాజంలో పేరుకలిగినవారితో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారపరంగా నూతన పెట్టుబడులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను అధికారుల సహాయంతో పరిష్కరించుకుంటారు. చిన్నతరహా పరిశ్రమల వారి అంచనాలు నిజమవుతాయి. వారాంతమున వ్యయప్రయాసలతో పనులు పూర్తి కావు. రుణాలు చేయడం మంచిది కాదు. విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయటంవలన శుభఫలితాలను పొందుతారు.
తుల రాశి :
ప్రయాణాలలో నూతన పరిచయాలు మరింత ఉత్సాహం కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని పనులలో ఆత్మీయుల సలహాలు కలసి వస్తాయి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. అవసరానికి పాతబాకీలు వసూలవుతాయి. గృహనిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలను అధిగమించి పనులు పూర్తి చేసుకుంటారు. సోదరులతో సమస్యలను రాజి చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వారాంతంలో బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ఆరోగ్యవిషయాలలో అశ్రద్ధ పనికిరాదు. గణపతిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
వృశ్చికం రాశి :
ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి కలిగిన వారి నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలు నిర్వహించి విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. సంతానం విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. వస్త్రా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహన కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. వ్యాపారాలలో మీ నిర్ణయాలు లాభాలను తీసుకొస్తాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ఆంజనేయస్వామి ఆరాధన చేయడం వలన ఫలితాలను పొందుతారు.
ధనస్సు రాశి :
చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు. మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఆస్తి వ్యవహారాలను సోదరులతో ఒప్పందాలు కలసి వస్తాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో అప్రయత్నంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారపరంగా ఆశించిన లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల స్థానచలనం కలుగుతాయి. వారం ప్రారంభంలో పనులలో అవరోధాలు ఉంటాయి. బంధుమిత్రులతో వివాదాల కలుగుతాయి. ధన ఇబ్బందులు తప్పవు. శివ అష్టకం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.
మకరం రాశి :
ఆదాయం అంతగా లేక నూతన రుణాలు చేయవలసి రావచ్చు. ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. కుటుంబ సభ్యులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు శ్రమ తో కానీ పూర్తికావు. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పత్రాల విషయాలలో జాగ్రత్త వహించాలి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపార పరంగా కొంత నిరుత్సాహం వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉంటాయి. కొన్ని రంగాల వారికి అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వారం మధ్య నుండి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సన్నిహితులు నుండి విలువైన వస్తువులు బహుమతులుగా లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మధురాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
కుంభం రాశి :
వృత్తి వ్యాపారాలు పరంగా ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సేవ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అవసరానికి మిత్రుల నుండి ధన సహాయం లభిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పరిచయాలు మరింతగా విస్తృతమౌతాయి. వృత్తి వ్యాపారాలలో ఉత్సాహంగా పనిచేసి ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వారాంతంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
మీనం రాశి :
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధు మిత్రుల నుండి ఆసక్తికర సమాచారాన్ని సేకరిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వాహన భూ సంబంధిత క్రయవిక్రయాలు లాభాలను కలిగిస్తాయి. దూరప్రాంత బంధువుల ఆగమనంబ ఆనందం కలిగిస్తుంది. శుభకార్యాలలో కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగస్తులు ఉన్నత అవకాశాలు పొందుతారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభమున స్వల్ప ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు.