వార ఫలాలు: తేది 13-04-2025 నుంచి 19-04-2025 వరకు

వారం ప్రారంభంలో చిన్న పాటి చికాకులు ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి.తరువాత పరిస్థితులు అనుకూలిస్తాయి.

By Knakam Karthik
Published on : 13 April 2025 6:25 AM IST

horoscope, astrology, Rasiphalalu

వార ఫలాలు: తేది 13-04-2025 నుంచి 19-04-2025 వరకు

మేషం రాశి :

వారం ప్రారంభంలో చిన్న పాటి చికాకులు ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి.తరువాత పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాతో దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు తగిన అవకాశములు లభిస్తాయి. ఉద్యోగుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు పునః ప్రారంభిస్తారు. సంతాన వివాహ శుభకార్యాల పై నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వాహనం కొనుగోలకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవవకాశాలు అందుకుంటారు. దుర్గా ఆరాధన శుభ ఫలితాలు అందిస్తుంది.

వృషభం రాశి :

ఆర్థికంగా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యవహారాలలో సన్నిహితులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు కొంతవరకు తీరి ఊరట చెందుతారు. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఆశించిన విధంగారాణిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు అధికారుల సహాయం అందుతుంది. అన్ని రంగాల వారు అంచనాలను అందుకుంటారు. వారం మధ్యన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పనులు మందకొడిగా సాగుతాయి. ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేయించడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మిథునం రాశి :

ఆదాయ మార్గాలు మారుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సన్నిహితుల నుండి విలువైన బహుమతులు పొందుతారు. కొన్ని పనులలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. స్ధిరాస్తి సంబంధించి వివాదాలు నుంచి బయటపడతారు. ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగ విషయంలో పని భారం నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. వారం మధ్యన ఖర్చులు పెరుగుతాయి. సోదరులతో మాటపట్టింపులు ఉంటాయి. శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కర్కాటకం రాశి :

దీర్ఘకాలిక సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుండి కొంత విలువైన సమాచారం అందుతుంది. స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. పాత మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఏర్పడిన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఉద్యోగ విషయంలో మీప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అన్ని రంగాల వారికి వ్యవహారాలలో విజయం కలుగుతుంది. వారం ప్రారంభంలో బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ధన వ్యయ సూచనలు ఉన్నవి. శ్రీ మహా విష్ణు స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

సింహం రాశి :

ధన పరంగా పరిస్థితులు కొంత వరకు అనుకూలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. శుభకార్యాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. నిరుద్యోగులు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగ పరంగా అధికారులతో సఖ్యత కలుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు పురోగతి కలుగుతుంది. వారంప్రారంభంలో పనులలో ఆటంకాలు ఉంటాయి. ఇతరుల విషయంలో తలదూర్చిక పోవడం మంచిది. లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కన్య రాశి :

ఆలోచనలు ఆచరణలో పెట్టి విజయం సాధిస్తారు. బంధు మిత్రుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. మొండి బాకీలు కొంతవరకూతీరి ఉపశమనం పొందుతారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. భూ సంబంధిత క్రయవిక్రయాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సొంత నిర్ణయాలతో లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఆహ్వానాలు అందుతాయి. అన్ని రంగాల వారికి ఉత్సాహ వాతావరణం ఉంటుంది. వారాంతంలో దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. దుర్గాద్వాత్రింశన్నామావళి పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

తుల రాశి :

ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. రుణ పరమైన ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగ యత్నాలు నిదానంగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో సమస్యలను పరిష్కరించుకోవడానికి పెద్దలసలహాలు తీసుకుంటారు. భూ సంబంధిత క్రయవిక్రయాలు కొంత అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలను అందుతాయి. వారాంతమున రుణదాతల ఒత్తిడులు పెరుగుతుంది. మానసిక సమస్యలు కలుగుతాయి. నవగ్రహస్తోత్రం పారాయణం చేయటం వలన శుభఫలితాలను పొందుతారు.

వృశ్చికం రాశి :

ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఆదాయ మార్గాలు మెరుగు పడతాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన గృహం కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. గృహమున వివాహ శుభకార్యాలు గూర్చి చర్చలు జరుగుతాయి. వ్యాపారాలలో నూతన పద్ధతులను ప్రవేశపెట్టి లాభాలను పొందుతారు. కొన్ని రంగాల వారికి మరింత గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యలో ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత బాధ కలిగిస్తుంది. ఆదిత్య కవచం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి :

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అనుకొన్న సమయానికి ధనం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాలలో బంధు మిత్రులతో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో మనస్పర్ధలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. పంచముఖ హనుమత్ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మకరం రాశి :

ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఋణాలు కొంత వరకూ తీరుస్తారు. సన్నిహితులతో గృహంలో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా పూర్తవుతాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. బంధువుల సహాయంతో కొన్ని సమస్యల నుంచి బయట పడతారు. వివాహ ఉద్యోగ యత్నాలు పురోగతి కనిపిస్తుంది. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. వ్యాపారాల్లో అంచనాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో నూతన పదవులు పొందుతారు. వారం మధ్యన సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. కాలభైరవ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కుంభం రాశి :

ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులలో ఆలోచనలు కలిసిరావు. ఇతరులతో చిన్న చిన్న విషయాలకి వివాదాలు కలుగుతాయి. ఆలయ సందర్శనాలు చేసుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు మధ్యలో నిలిచిపోతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలు మరింత నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఆకస్మిక స్థానచలన సూచనలు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వారం చివరలో పరిస్థితులు అనుకూలంగా మారతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. శుభవార్తలు అందుతాయి. గణపతి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మీనం రాశి :

చిన్ననాటి మిత్రులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నుండి బయట పడతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థికంగా కొంత ఉత్సాహ వాతావరణం ఉంటుంది. ఆలోచనలు ఆచరణలో పెట్టి విజయం సాధిస్తారు. వ్యతిరేక పరిస్థితులు కూడా అనుకూలంగా మార్చుకుంటారు. నూతన గృహం కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకం వాతావరణం ఉంటుంది. అన్ని రంగాలవారు సానుకూల ఫలితాలు పొందుతారు. వారం చివరన స్వల్ప ధనవ్యయ సూచనలు ఉన్నవి. ఆరోగ్య ఇబ్బందులు తప్పవు. దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Next Story