వార ఫలాలు: తేది 12-10 2025 నుంచి 17-10- 2025 వరకు
చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున బంధుమిత్రులతో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర సందర్శనలు చేసుకుంటారు.
By - అంజి |
వార ఫలాలు: తేది 12-10 2025 నుంచి 17-10- 2025 వరకు
మేషం :
చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున బంధుమిత్రులతో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర సందర్శనలు చేసుకుంటారు. గృహమున దీర్ఘ కాలిక చికాకులు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం కలుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వారాంతమున ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. శ్రీ గురు చరిత్ర పారాయణం శుభఫలితాన్ని కలిగిస్తుంది.
వృషభం :
చేపట్టిన వ్యవహారాలులో విజయ పరంపరలు కొనసాగుతాయి. బంధుమిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఒక ముఖ్యమైన వ్యవహారంలో స్నేహితుల సలహాలు లాభిస్తాయి. ముఖ్యమైన సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. భూ సంబంధిత వివాదాలను పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వాహన యోగం ఉన్నది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభిస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొని ప్రశంసలు పొందుతారు. ఉద్యోగాలలో ఉన్నటువంటి అవరోధాలు అధిగమిస్తారు. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. శ్రీ గణేష్ కవచం పారాయణం శుభ ఫలితాలను ఇస్తుంది.
మిథునం :
ముఖ్యమైన పనులు నిదానంగా సమయానికి పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఉన్నటువంటి వివాదాలను తొలగుతాయి. మొండి బాకీలు కొంతవరకు వసూలు అవుతాయి. పాత మిత్రులను కలుసుకుని కొన్ని సంఘటనల గురించి చర్చిస్తారు. సంఘంలో విశేషమైన ఆదరణ లభిస్తుంది. సంతానం విద్యా విషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు ఊహించని లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో లో అధికారులతో ఉన్నటువంటి మనస్పర్థలు తొలగుతాయి. వారంతమున ఇతరులతో వివాదాలు కలుగుతాయి. ధన పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. హయగ్రీవ స్తోత్రం పారాయణ చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి.
కర్కాటకం :
ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలంగా ఉంటుంది. సన్నిహితులతో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. సంతానం విద్య పరంగా ఆశించిన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొని పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. ఆలోచనలు ఆచరణలో పెడతారు. వ్యాపారస్తులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగాలలో అదనపు పనిభారం తొలగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు స్వల్ప లాభాలు ఉంటాయి. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్యసమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దత్తాత్రేయ స్వామి దర్శనం ఫలితాలను కలిగిస్తుంది.
సింహం :
నూతన పరిచయాలు కలుగుతాయి. దూరప్రాంత బంధువుల నుండి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. పాత మిత్రులను కలుసుకుని శుభకార్యాలలో హాజరవుతారు. సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు లభిస్తాయి. కొన్ని వ్యవహారాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలసివస్తాయి. దైవ సంబంధిత కార్యక్రమాలు పాల్గొంటారు. వ్యాపార పరంగా నూతన ఆలోచనలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు లభిస్తాయి. వారం మధ్య నుండి కుటుంబ సభ్యులు మీ ఆలోచనలతో విభేదిస్తారు. స్వల్ప మానసిక సమస్యలు ఉంటాయి. నవగ్రహారాధన శుభ ఫలితాన్ని కలిగిస్తుంది.
కన్య :
ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. సన్నిహితులతో దీర్ఘకాలికంగా ఉన్న వివాదాలను పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాల సంబంధించి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. గృహమున కొన్ని ఆలోచనలు ఆచరణలో పెడతారు. సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు లభిస్తాయి. ఉద్యోగమున సఖ్యతగా వ్యవహరిస్తారు. కొన్ని రంగాలవారికి అనుకూల ఫలితాలు పొందుతారు. వారాంతమున వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ధన వ్యయసూచనలు ఉన్నవి. నారాయణ కవచ స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
తుల :
ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. మొండిబాకీలు వసూలవుతాయి. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. ఋణదాతల ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. గృహ నిర్మాణానికి ఉన్న ఇబ్బందులు తొలగుతాయి. భూ క్రయ వ్యవహారాల్లో అవరోధాలు అధిగమిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభమున కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు జాగ్రత్త వహించాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభ ఫలితాలను కలిగిస్తుంది.
వృశ్చికం :
సంతాన విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. వాహన యోగం ఉన్నది. కొన్ని వ్యవహారాలలో మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా విషయాలలో నూతన ప్రోత్సాహకాలు పొందుతారు. సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు వలన కొన్ని వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేయగలుగుతారు. కొన్ని రంగాల వారు తమ అంచనాలను అందుకుంటారు. వారాంతమున స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ధన విషయాలలో ఇతరులకు మధ్యవర్తిత్వం చెయ్యడం మంచిదికాదు. గణపతి ఆరాధన ఫలితాలు కలిగిస్తుంది.
ధనస్సు :
నూతన కార్యక్రమాలను చేపడతారు. ఆర్ధిక పరంగా ఉన్నటువంటి చికాకులు తొలగుతాయి. సంతానం విద్యా విషయాల నూతన అవకాశాలు లభిస్తాయి. ఒక శుభ వార్త ఉత్సాహాన్నిస్తుంది. దాయాదులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. రియల్ఎస్టేట్ రంగం వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. పాత మిత్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. వృత్తి వ్యాపార పరంగా చేపట్టిన అన్ని వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగస్తులకు స్దాన చలన సూచనలు లాభసాటిగా ఉంటాయి. వారం చివరన జీవిత భాగస్వామితో వివాదాలు నెలకొంటాయి. మానసిక సమస్యలు అధికమౌతాయి. దత్త పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
మకరం :
ఆదాయ మార్గాలు తగ్గుతాయి. నూతన రుణాలు చేయవలసి రావచ్చు. చేపట్టిన వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. సన్నిహితులతో ఆకస్మిక విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన కొంత నిదానంగా పనులు పూర్తవుతాయి. దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించటం మంచిది. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపారస్తులు ఆశించిన ఫలితాలు పొందలేరు. ఉద్యోగ పరంగా స్థానచలన సూచనలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు అదనపు ఒత్తిడి పెరుగుతుంది. వారాంతంలో ధన లాభాలుంటాయి. నూతన వస్తు లాభాలుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వేంకటేశ్వర స్వామి దర్శనం శుభ ఫలితాలు కలిగిస్తుంది.
కుంభం :
వృత్తి ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పనిచేసి లాభాలను పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఉద్యోగపరంగా ఉన్నటువంటి చికాకులు తొలగుతాయి. ఆర్థికంగా కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి. గృహమున నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు ఆచరణలో పెడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద, విహారయాత్రలో పాల్గొంటారు. ఇతరుల నుండి ధన సహాయం లభిస్తుంది. వ్యాపార విస్తరణకు పెట్టుబడులు లభిస్తాయి. వారం మధ్యన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించడం మంచిది. ప్రయాణాలు అంతగా కలిసిరావు. శివారాధన శుభ ఫలితాన్ని కలిగిస్తుంది.
మీనం :
ధన వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అంచనాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక, సేవ కార్యక్రమాలకు పాల్గొంటారు. ఇతరుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ పనులు వేగంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మీయ్యుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో తగినంత ఆదాయం లభిస్తుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. ధన, కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆంజనేయ స్వామి ఆరాధన శుభ ఫలితాలు కలిగిస్తుంది.