వార ఫలాలు: తేదీ 09-03-2025 నుంచి 15-03-2025 వరకు
చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీరుస్తారు. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగుతాయి.
By జ్యోత్స్న
వార ఫలాలు: తేదీ 09-03-2025 నుంచి 15-03-2025 వరకు
మేష రాశి :
చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీరుస్తారు. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగుతాయి. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం మరింత ఉత్సాహాన్నిస్తుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థానచలన సూచనలు ఉన్నవి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం చివరిలో చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. లక్ష్మి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
వృషభ రాశి :
చాలా కాలంగా పడుతున్న కష్టానికి తగిన ఫలితం పొందుతారు. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అండదండలు లభిస్తాయి. బంధు మిత్రులతో ఉన్నటువంటి వివాదాలను సర్దుబాటు చేసుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు అవరోధాలు తొలగుతాయి. అవసరానికి చేతికి ధనం అందుతుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులను సేకరిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్న తరహా పరిశ్రమలవారికీ అందిన సమాచారం భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటుంది. వారం చివరన దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వివాదాలకు వెళ్లకపోవడం మంచిది. కనకధారా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
మిథున రాశి :
మీ పని తీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అనుకొన్న సమయానికి ధనసహాయం అంది రుణాలు తీర్చగలుగుతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలలో కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివరన వృధా ఖర్చులు ఉంటాయి ఆరోగ్య విషయాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. దేవి ఖడ్గ మాల స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
కర్కాటక రాశి :
ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహంలో శుభకార్య చర్చలు జరుగుతాయి. బంధు మిత్రులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు ఉంటాయి. ఋణ భారం పెరుగుతుంది దేవాలయ దర్శనం చేసుకుంటారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి తొలగుతుంది. కొన్ని రంగాల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. గురు చరిత్ర పారాయణ చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.
సింహ రాశి :
దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. స్థిరాస్తి విషయంలో సమస్యలు అధిగమిస్తారు. తెలివితేటలతో దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఇంటాబయటా కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొంత వరకు పనిఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. శ్రమ తో కాని పనులు పూర్తి కావు నవగ్రహ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
కన్య రాశి :
ఆర్థిక పరిస్థితి కొంత గంధరగోళంగా ఉంటుంది. నూతన రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులులో జాప్యం కలుగుతుంది. బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. భూ సభంధిత క్రయ విక్రయలు కలసిరావు. గృహ నిర్మాణ యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన సమయానికి నిద్రహారాలు ఉండవు. చిన్నతరహా పరిశ్రమలకు శ్రమధిక్యత తప్పదు. వారం మధ్యలో చిన్న నాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
తుల రాశి:
పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. వారం మధ్యలో ధన పరంగా ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.
వృశ్చిక రాశి :
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. పాతమిత్రులను కలుసుకుని మీ అభిప్రాయాలను పంచుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమల వారి ఆశలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వారం మధ్యలో సోదరులతో స్థిరస్తి వివాదాలు నెలకొంటాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
ధనస్సు రాశి :
చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. మిత్రులతో వ్యాపార పరమైన విషయాల గురించి చర్చిస్తారు. దాయాదులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విద్యార్థుల విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగమున అనుకూల స్థాన చలన సూచనలు ఉన్నవి. గృహమున కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వారం మధ్యన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. నరసింహ స్వామి దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.
మకర రాశి:
అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. వాహన అనుకూలత కలుగుతుంది సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. వ్యాపారాలు ఆశించిన విధంగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. రాజకీయ ప్రముఖులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు చేస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి లక్ష్మీ నరసింహ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.
కుంభ రాశి :
కుటుంబ సభ్యులు మరిన్ని బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పెద్దల సహాయంతో పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంతాన వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. చిన్నతరహా పరిశ్రమల శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కుటుంబ సభ్యులతో మతాపట్టింపులుంటాయి. హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
మీన రాశి :
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయట పడతారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలసి వస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు నుండి కొంత ఉపశమనం పొందుతారు. అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహవంతమైన సమయం. వారం మధ్యలో ధన పరమైన సమస్యలు కొంత చికాకు కలిగిస్తాయి. బంధువర్గం తో విభేదాలు తప్పవు. గణనాయకాష్టకం పారాయణ చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.