వార ఫలాలు: తేది 08-12-2024 నుంచి 14-12-2024 వరకు

మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు. సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు.

By జ్యోత్స్న  Published on  8 Dec 2024 6:24 AM IST
horoscope, Astrology, Rasiphalalu

వార ఫలాలు: తేది 08-12-2024 నుంచి 14-12-2024 వరకు

మేషం రాశి :

మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు. సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. స్థిరస్తి విషయంలో సోదరులతో ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరమైన సమయం. వ్యాపారాలలో భాగస్తులు సహాయంతో పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శివాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృషభం రాశి :

ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలిగి పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిదికాదు. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో దాయదులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. సంతానం వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పంచముఖ హనుమత్ కవచం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

మిథునం రాశి :

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలసి వస్తాయి. అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహవంతమైన సమయం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వారం మధ్యలో ధన పరమైన సమస్యలు కొంత చికాకు కలిగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు నుండి కొంత ఉపశమనం పొందుతారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. బంధువర్గంతో విభేదాలు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. గణనాయకాష్టకం పారాయణ చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

కర్కాటకం రాశి :

చిన్నతరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఆర్థికంగా మరింత అనుకూలత కలుగుతుంది. కుటుంబ సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా నేర్పుగా అధిగమిస్తారు. నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆస్తి వివాదాలలో చికాకులు తొలగుతాయి. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహకరిస్తారు. వ్యాపారులకు విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వారం చివరన ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. గురు చరిత్ర పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

సింహం రాశి :

గృహ నిర్మాణం పనులు వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మీ శ్రమ ఫలించి లాభాలు అందుకుంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనువు పూర్తి చేస్తారు. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వారం చివరిలో కొన్ని పనులు సకాలంలో పూర్తి కాకా చికాకులు పెరుగుతాయి. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలు సమసిపోతాయి. మిత్రులతో ఆకారాణ కలహాలు కలుగుతాయి. కనకధారాస్తోత్రాలు పారాయణం చేయడం వలన శుభ ఫలితాన్ని పొందుతారు.

కన్య రాశి :

పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమౌతాయి. నిరుద్యోగులకు చాలాకాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు అనుకున్న విధంగా దక్కుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కొన్ని రంగాల వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. కుటుంబంలో వాతావరణం గందరగోళంగా ఉంటుంది. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం వలన శుభఫలితాలు పొందుతారు.

తుల రాశి :

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగమున వివాదం నుండి తెలివిగా బయటపడతారు. ఆర్థిక వ్యవహారాలు కొంత ఆశాజకనంగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కొన్ని రంగాల వారికి పరిస్థితులు చక్కబడి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చికం రాశి :

కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలున్నవి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ధనాదాయం బాగుంటుంది. చిన్న తరహా పరిశ్రమలవారు పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

ధనస్సు రాశి :

ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంతాన వివాహ, ఉద్యోగయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఇంటా బయట సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. మిత్రుల సహాయంతో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహంతో పదోన్నతుల పెరుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వారం చివరిలో బంధువులతో అకారణ వివాదాలు తప్పవు. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మకరం రాశి :

వారం ప్రారంభంలో మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. ఇంటా బయట విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో ఆశించిన విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు మరింత సజావుగా సాగుతాయి. దాయాదులతో ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. చిన్న తరహా పరిశ్రమల వారు నష్టాలునుండి బయటపడి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. కనకధారా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కుంభం రాశి :

సంతానం విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. వారం మధ్యలో బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో మరింత ఉత్సాహవంతంగా గడుపుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలలో కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగాలలో అధికారులతోనూ వివాదాల నుంచి బయటపడగలుగుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఊహించని అవకాశాలు అందుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. నవగ్రహ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మీనం రాశి :

గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. పాతమిత్రులను కలుసుకుని మీ అభిప్రాయాలను పంచుకుంటారు. చిన్న తరహా పరిశ్రమల వారి ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో సోదరులతో స్థిరస్తి వివాదాలు నెలకొంటాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Next Story