వార ఫలాలు: తేదీ 06-08-2023 నుంచి 12-08-2023 వరకు

ఇంట్లో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.

By జ్యోత్స్న  Published on  6 Aug 2023 12:49 AM GMT
horoscope, Astrology, Rasiphalalu

వార ఫలాలు: తేదీ 06-08-2023 నుంచి 12-08-2023 వరకు

మేష రాశి : ఇంట్లో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. బయట ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమౌతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. అనుకోకుండా పాత బాకీలు వసూలవుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు అందుకుంటారు. సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. వ్యాపారాలలో ఒత్తిడులు అదిగమిస్తారు. లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో మీకు ప్రాధాన్యత పెరుగుతుంది. స్త్రీలకు అన్నిరంగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఊహించని వివాదాలు కలుగుతాయి కానీ కష్టపడకుండానే అవి తొలగిపోతాయి. . ఆరోగ్యసమస్యలు కొంత చికాకు కలిగించినప్పటికీ విపత్కర పరిస్థితులను ఎదుర్కోరు.

పరిహారం : రామ రక్షా స్తోత్రం పారాయణ చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృషభ రాశి : ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ఆప్తుల శుభకార్యాలకు బంధువులతో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలు ప్రారభిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. వ్యాపారాలలొ పెట్టిన పెట్టుబడులలొ పురోగతిలో సాధిస్తారు. సంతాన విద్యా విషయాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలొ నూతన లాభాలు అందుకుంటారు. వారం ప్రారంభంలో అదయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ విషయంలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యాలు బాధిస్తాయి. మిత్రుల నుంచి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. మిత్రులను కలుసుకుని వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

పరిహారం : అమ్మవారికి ఏదన్నా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మిథున రాశి : ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు పొందుతారు. గృహమున శుభకర్యాలు నిర్వహిస్తారు. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. రాజకీయవర్గాలకు అరుదైన అవకాశములు అందుతాయి. ఉద్యోగాలలో మీ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. చిన్నతరహా పరిశ్రమలకు అనుకూల ఫలితాలు ఉంటాయి. వారం మధ్యలో ఇతరులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమౌతాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. గృహ కొనుగోలు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

పరిహారం : నవగ్రహ స్తోత్రం పారాయణ శుభఫలితాలు ఇస్తుంది.

కర్కాటక రాశి : ఆకస్మిక ప్రయాణాలు వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట బాధ్యతలు చికాకు పరుస్తాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంత చికాకు తప్పవు. విద్యార్థులకు శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. గృహ, వాహన కొనుగోలు యత్నాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆకస్మిక స్థానచలన సూచనలున్నవి. కొన్ని రంగాల వారికి ఒత్తిడులు తప్పవు. వారం మధ్యలో దూరపు బంధువులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధన, వస్తు లాభాలు అందుతాయి.

పరిహారం : శివఅష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

సింహ రాశి : రావలసిన సొమ్ము సకాలంలో అంది ఆకస్మిక అవసరాలు తీరతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. చిన్నతరహా పరిశ్రమలకు అరుదైన ఆహ్వానాలు రాగలవు. వారం చివరిలో బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం : మేధో దక్షిణా మూర్తి స్తోత్ర పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కన్య రాశి : సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పాత మిత్రులను కలుసుకుని విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. వ్యాపార పరంగా ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున అధికారులు అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ఆర్థిక పరంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంతాన వివాహ శుభకార్యాలపై చర్చలు సఫలమౌతాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు. అన్నిరంగాల వారికి సమస్యలు తొలగుతాయి. వారం ప్రారంభంలో ధన పరంగా ఇబ్బందులు కలుగుతాయి.

పరిహారం : గణేష కవచం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

తుల రాశి : వారం ప్రారంభంలో సన్నిహితుల నుండి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. కింది స్థాయి ఉద్యోగుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. దూరప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఉద్యోగమున అధికారులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. చిన్నతరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పాత విషయాలు జ్ఞప్తికి వచ్చి బాధిస్తాయి

పరిహారం : దుర్గ అమ్మవారికి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి : ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ఏదోవిధంగా ధనం అందుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు అధికమవుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో కుటుంబమున వివాదాలు చికాకులు పరుస్తాయి. ఖర్చులు అదుపు చెయ్యడం కష్టం. ఆర్థిక విషయాలలో మరింత పురోగతి సాధిస్తారు. వారం ప్రారంభంలో మానసిక సమస్యలు బాధిస్తాయి. కుటుంబంలో మరింత ఒత్తిడులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు అదిగమిస్తారు. బంధువులతో సఖ్యతగా వ్యవహారిస్తారు.

పరిహారం : ఖడ్గమాల కుంకుమ పూజ, గణేశాష్టకం పారాయణం చేయించడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి : గృహమునకు దూరపు బంధువులు ఆగమనం కలిగిస్తుంది. కొన్ని ఊహించని సంఘటనలు వలన మానసిక చికాకులు అధికమవుతాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. క్రమక్రమంగా పరిస్థితులు అనుకూలిస్తాయి. శత్రు సమస్యల నుంచి బయటపడతారు. చిన్నతరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కీలక విషయాలు తెలుసుకుంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు రాజి చేసుకుంటారు.అన్నిరంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో భాగస్వాముల సహాయంతో విస్తరిస్తారు. ఉద్యోగస్థులకు సంతోషకరమైన వార్తలు తెలుస్తాయి.

పరిహారం : హయగ్రీవస్తోత్రం పారాయణం చెయ్యడంవలన శుభ ఫలితాలు పొందుతారు.

మకర రాశి : సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా సాగుతుంది. కీలక వ్యవహారాలలో సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. గృహ, వాహనాలు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగుల కష్టానికి తగిన అవకాశాలు లభిస్తాయి.గృహమునకు బంధుమిత్రుల ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగం ఉన్న వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్నపాటి ప్రయత్నంతో నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. పలుకుబడి కలిగిన వారు పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. శుభాకార్యలకు కుటంబ సభ్యులతో హాజరవుతారు. వ్యాపారాలు క్రమ క్రమంగా విస్తరిస్తారు.

పరిహారం : హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు శుభ ఫలితాలు పొందుతారు.

కుంభ రాశి : ఆర్థిక పరిస్థితి గతం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమౌతాయి. దాయదులతో వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలొ ఊహించిన దాని కంటే అధిక లాభాలు పొందుతారు. దూరప్రాంతాల మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్నిస్తాయి. బంధు మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని రంగాల వారికి అనుకోని సంఘటనలు ఎదురావుతాయి. వారం మధ్యలో బంధువులతో మాటపట్టింపులు మానసిక అశాంతి కలిగిస్తాయి. ధనపరమైన ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

పరిహారం : దత్తపంజర స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మీన రాశి : సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలను పరిష్కారమౌతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. నిరుద్యోగులకు నూతనోత్సాహంతో అవకాశములు అందుకుంటారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వారం చివరిలో అనుకోని ఖర్చులు ఉంటాయి. కుటుంబ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత కలుగుతుంది. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. అన్ని రంగాలవారి అంచనాలు నిజం కాగలవు. విద్యార్థులకు అరుదైన అవకాశాలు దక్కుతాయి.

పరిహారం : విష్ణు పంజర స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

Next Story