వార ఫలాలు: తేది 03-03-2024 నుంచి 09-03-2024 వరకు

గృహంలో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వాహనాలు, స్తిరస్థులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు.

By జ్యోత్స్న  Published on  3 March 2024 6:14 AM IST
horoscope, Astrology, Rasiphalalu

వార ఫలాలు: తేది 03-03-2024 నుంచి 09-03-2024 వరకు

మేష రాశి : గృహంలో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వాహనాలు, స్తిరస్థులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఇంటా బయట ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమౌతాయి. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. పాత బాకీలు వసూలవుతాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వ్యాపారాలలో ఒత్తిడులు అదిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో విలువ పెరుగుతుంది. అన్నిరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యసమస్యలు కొంత చికాకు పరుస్తాయి.

పరిహారం: రామాష్టకం పారాయణ చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృషభ రాశి : ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. ఆప్తుల శుభకార్యాలకు బంధువులతో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమౌతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. సంతాన విద్యా విషయాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలొ నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో మీ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. చిన్నతరహా పరిశ్రమలకు అనుకూల ఫలితాలు ఉంటాయి. వారం ప్రారంభంలో ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ విషయంలో ఆకస్మికంగా నిర్ణయాలలో మార్చుకుంటారు.

పరిహారం: కామాక్షి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మిథున రాశి : మొండి బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు పొందుతారు. నూతన కార్యక్రమాలు ప్రారభిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు గృహమున శుభకర్యాలు నిర్వహిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలలొ పెట్టిన పెట్టుబడులలొ పురోగతిలో సాధిస్తారు. రాజకీయవర్గాలకు అరుదైన అవకాశములు అందుతాయి. వారం మధ్యలో ఇతరులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి.

పరిహారం: నవగ్రహ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి : ఆకస్మిక ప్రయాణాలు వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట బాధ్యతలు చికాకు పరుస్తాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంత చికాకు తప్పవు. విద్యార్థులకు శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. గృహ, వాహన కొనుగోలు యత్నాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆకస్మిక స్థానచలన సూచనలున్నవి. కొన్ని రంగాల వారికి ఒత్తిడులు తప్పవు. వారం మధ్యలో దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధన, వస్తు లాభాలు అందుతాయి.

పరిహారం: అర్ధనారిశ్వర అష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

సింహ రాశి : రావలసిన సొమ్ము సకాలంలో అంది అవసరాలు తీరతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. చిన్నతరహా పరిశ్రమలకు అరుదైన ఆహ్వానాలు రాగలవు. వారం చివరిలో బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం: మేధో దక్షిణా మూర్తి పంచరత్న స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కన్య రాశి : సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన వివాహ శుభకార్యాలపై చర్చలు సఫలమౌతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పాత విషయాలు జ్ఞప్తికి వచ్చి బాధిస్తాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు. అన్నిరంగాల వారికి సమస్యలు తొలగుతాయి. వారం ప్రారంభంలో ధన పరంగా ఇబ్బందులు కలుగుతాయి.

పరిహారం: గణేష కవచం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

తుల రాశి : వారం ప్రారంభంలో సన్నిహితుల నుండి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతనానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు అదిగమిస్తారు. బంధువులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. నూతన వాహనం కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఉద్యోగమున అధికారులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. చిన్నతరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో వివాదాలు కలుగుతాయి.

పరిహారం: కనకధారస్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి : ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. బంధు, మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. చాలకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు పరిష్కారమౌతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాలబాట పడుతాయి. చిన్నతరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. వారం మధ్యలో కుటుంబమున వివాదాలు చికాకులు పరుస్తాయి. ఖర్చులు అదుపుచెయ్యడం కష్టం.

పరిహారం: వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

ధనస్సు రాశి : విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కీలక విషయాలు తెలుసుకుంటారు. అన్నిరంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో భాగస్వాముల సహాయంతో విస్తరిస్తారు. ఉద్యోగస్థులకు సంతోషకరమైన వార్తలు తెలుస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. గృహ కొనుగోలు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక విషయాలలో మరింత పురోగతి సాధిస్తారు. వారం ప్రారంభంలో మానసిక సమస్యలు బాధిస్తాయి. కుటుంబంలో మరింత ఒత్తిడులు పెరుగుతాయి.

పరిహారం: హయగ్రీవస్తోత్రం పారాయణం చెయ్యడంవలన శుభ ఫలితాలు పొందుతారు.

మకర రాశి : సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా సాగుతుంది. కీలక వ్యవహారాలలో సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. గృహ, వాహనాలు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగమున కొన్ని వివాదాలు అత్యంత తెలివిగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు నూతనోత్సాహంతో అవకాశములు అందుకుంటారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. అన్ని రంగాలవారి అంచనాలు నిజం కాగలవు. విద్యార్థులకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యాలు బాధిస్తాయి. మిత్రుల నుంచి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది.

పరిహారం: హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు శుభ ఫలితాలు పొందుతారు.

కుంభ రాశి : ఆర్థిక పరిస్థితి గతం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమౌతాయి. దాయదులతో వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలొ ఊహించిన దాని కంటే అధిక లాభాలు పొందుతారు. దూరప్రాంతాల మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్నిస్తాయి. బంధు మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని రంగాల వారికి అనుకోని సంఘటనలు ఎదురావుతాయి. వారం మధ్యలో బంధువులతో మాటపట్టింపులు మానసిక అశాంతి కలిగిస్తాయి. ధనపరమైన ఇబ్బందులు ఉంటాయి.

పరిహారం: దత్తపంజర స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మీన రాశి : సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలను పరిష్కారమౌతాయి. పలుకుబడి కలిగిన వారు పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. శుభకార్యలకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు. వ్యాపారాలు క్రమక్రమంగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వారం చివరిలో అనుకోని ఖర్చులు ఉంటాయి. కుటుంబ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

పరిహారం: విష్ణు పంజర స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

Next Story