వార ఫలాలు: ఈ రాశివారు ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి

వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్యసమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దత్తాత్రేయ స్వామి దర్శనం ఫలితాలను కలిగిస్తుంది.

By -  Knakam Karthik
Published on : 2 Nov 2025 7:42 AM IST

horoscope, Astrology, Rasiphalalu

వార ఫలాలు: ఈ రాశివారు ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి

మేషం:

ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలంగా ఉంటుంది. సన్నిహితులతో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. సంతానం విద్య పరంగా ఆశించిన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొని పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. ఆలోచనలు ఆచరణలో పెడతారు. వ్యాపారస్తులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగాలలో అదనపు పనిభారం తొలగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు స్వల్ప లాభాలు ఉంటాయి. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్యసమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దత్తాత్రేయ స్వామి దర్శనం ఫలితాలను కలిగిస్తుంది.

వృషభం:

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. వారం మధ్యలో కొంత ఆర్థిక ఇబ్బంది తలెత్తినా తర్వాత లాభాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తత అవసరం. ఉద్యోగంలో స్థానచలన సూచనలు ఉంటాయి.కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలను అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గురుచరిత్ర పారాయణం చేస్తే అన్నివిధాల శ్రేయస్సు కలుగుతుంది.

మిథునం:

చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగుపడుతుంది. పాత రుణాలు తీర్చగలుగుతారు. బంధు, మిత్రుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశములు అందుతాయి ,విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. అన్ని రంగాల వారికి గందరగోళ పరిస్థితులు ఉంటాయి.గృహ నిర్మాణయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది.లింగాష్టకం పారాయణం చేయడం వలన శుభఫలితాలు పొందుతారు.

కర్కాటకం:

ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవర్గాలకు నూతన అవకాశములు అందుతాయి. వారం చివరిలో ఆర్ధిక ఇబ్బందులు తప్పవ. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు ఉంటాయి .ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులుంటాయి. వారం ప్రారంభంలో ధనవ్యయ సూచనలున్నవి. బంధువులతో మాటపట్టింపులుంటాయి.కొన్ని వ్యవహారాలలో పెద్దల సలహాలను స్వీకరించి ముందుకు మంచిది. వ్యాపారాలలో గతం కంటే మెరుగైన లాభాలు అందుకుంటారు. దేవిఖడ్గమాలా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

సింహం:

అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు పరిష్కారమవుతాయి. స్వంత ఆలోచనలు కలసివచ్చి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు అధిగమిస్తారు. ఇంటా బయట కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. నూతన భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పాత విషయాలు గుర్తుచేసుకుంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు నుండి కొంత వరకు బయటపడతారు. లక్ష్మీనృసింహ స్వామి ఆరాధన చెయ్యడం వలన శుభ ఫలితాలుంటాయి.

కన్య :

నూతన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తిచేస్తారు. గృహమునకు బంధుమిత్రులు ఆగమన ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంటాబయటా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్ననాటి ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసివస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కొన్ని వ్యవహారాలలో పెద్దల సలహాలను స్వీకరించి ముందుకు మంచిది. వ్యాపారాలలో గతం కంటే మెరుగైన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగమున బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం శుభ ఫలితాలను పొందుతారు.

తుల :

చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. బంధు మిత్రులనుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. అవసరానికి డబ్బు అందుతుంది. చిన్ననాటి మిత్రులతో గృహమునకు సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొన్ని వ్యవహారాలలో కుటుంబ పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. చాలాకాలంగా పడుతున్న శ్రమ ఫలించి నూతన అవకాశాలను అందుతాయి. నూతన గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. వృత్తి వ్యాపారాలలో అంచనాల అందుకుంటారు. ఉద్యోగ విషయమై అధికారులతో సమస్యలను పరిష్కరించుకుంటారు. అన్ని రంగాల వారికి కొంత అనుకూల వాతవరణం ఉంటుంది. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చికం :

మొదలుపెట్టిన కొన్ని పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. గృహమును ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. దైవ సేవా కార్యక్రమాలకు ధనసహాయం చేస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో ఆలోచన కార్యరూపం దాలుస్తాయి. ఇంటా బయట విశేషమైన ఆదరణ పెరుగుతుంది. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు. సంతాన వివాహ శుభకార్యాల గురించి కుటుంబంలో చర్చలు జరుగుతాయి. ఉద్యోగ విషయంలో పై అధికారులతో సంప్రదించడానికి చేసే ప్రయత్నాలు సఫలమౌతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు అవాంతరాలు తొలగి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో మిత్రులతో చిన్నపాటి కలహా సూచనులున్నవి. వృధా ఖర్చులు పెరుగుతాయి. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ధనస్సు :

ఇంట బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. ప్రముఖ వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహక వాతావరణం ఉంటుంది. వారం చివరిలో బంధువులతో ఆకారణ వివాదాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మకరం :

గృహనిర్మాణం పనులు వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మీ శ్రమ ఫలించి లాభాలు అందుకుంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనువు పూర్తి చేస్తారు. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వారం చివరిలో కొన్ని పనులు సకాలంలో పూర్తి కాకా చికాకులు పెరుగుతాయి. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలు సమసిపోతాయి. మిత్రులతో ఆకారాణ కలహాలు కలుగుతాయి. కనకధారాస్తోత్రాలు పారాయణం చేయడం వలన శుభ ఫలితాన్ని పొందుతారు.

కుంభం :

ఇప్పటికే జరుగుతున్న పనులలో కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆత్మీయులతో మాట పట్టింపులు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాహన సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో సమర్థవంతంగా పనిచేసి విశేషమైన ఫలితాలు పొందుతారు. వారాంతంన ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. హయగ్రీవ స్వామి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

మీనం:

ప్రారంభించిన అన్ని పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు. భూ సంభంధిత వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. జీవిత భాగస్వామి నుండి స్థిరస్తి లాభలు పొందుతారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. సంతాన విద్యా విషయంలో అనుకున్న ఫలితాలు పొందుతారు. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అవసరానికి పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో నూతన భాద్యతలు చేపడతారు. అన్ని రంగాల వారికి విశేషమైన ఫలితాలుంటాయి. వారం ప్రారంభంలో పనులందు స్వల్ప అవరోధలుంటాయి. బంధువులతో మటపట్టింపులుంటాయి. సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

Next Story