వార ఫలాలు: తేది 02-06-2024 నుంచి 08-06-2024 వరకు

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

By జ్యోత్స్న  Published on  2 Jun 2024 5:53 AM IST
horoscope, astrology, Rasiphalalu

వార ఫలాలు: తేది 02-06-2024 నుంచి 08-06-2024 వరకు 

మేష రాశి :

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటాబయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులు సాఫీగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. స్థిరాస్తి వివరాలు ఒక కొలిక్కి వస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు అనుకున్న పనులు సాధిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం : శ్రీ అన్నపూర్ణ దేవి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృషభ రాశి :

నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. బంధువర్గంతో వివాదాలు తీరి ఊరట పొందుతారు. కీలక వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఊహించని విధంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పెద్దల సహాయంతో రాజీ చేసుకుంటారు. వ్యాపార లావాదేవీలు మరింత లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు లభిస్తాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. ఋణ భారం పెరుగుతుంది.

పరిహారం : గణేష హృదయ కవచ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మిథున రాశి :

ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగాలు దక్కుతాయి. ఒక వ్యవహారంలో ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. అవసరానికి ధనసహాయం లభిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాల యత్నాలు సఫలమవుతాయి. వారం చివరిలో మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి.

పరిహారం : శ్రీ కాలభైరవాష్టక స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కర్కాటక రాశి :

చాలా కాలంగా పూర్తి కాని పనులలో ఆటంకాలు తొలగి సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. సంఘంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలపై స్నేహితులతో చర్చలు చేస్తారు. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగ అవకాశాలు అందుతాయి. వ్యాపార విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. అన్ని రంగాల వారికి అప్రయత్నంగా అవకాశములు దక్కుతాయి. వారం ప్రారంభంలో ఆర్థిక సమస్యలు బాధిస్తాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది.

పరిహారం :కార్తికేయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

సింహ రాశి :

నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు ధన వ్యయం చేస్తారు. విద్యార్థులకు గతం కంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. నూతన గృహ, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అన్ని రంగాల వారికి పరిస్థితులు మెరుగుపడతాయి. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు తప్పవు. బంధు వర్గం నుండి ఒత్తిడులు పెరుగుతాయి.

పరిహారం : లక్ష్మీ నరసింహ హృదయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కన్య రాశి :

ముఖ్యమైన కార్యక్రమాలు మరింత ఉత్సాహంతో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. రాజకీయ వర్గం వారితో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార విస్తరణ యత్నాలలో అవాంతరాలు తొలగుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అనుకూల స్థాన చలనాల ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి.

పరిహారం : లక్ష్మష్టక స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

తుల రాశి :

కొన్ని పనులలో ఆటంకాలు తప్పవు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. గృహ నిర్మాణయత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎంత శ్రమించినా అనుకున్న ఫలితం కనిపించదు. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం లభించక నిరాశ పెరుగుతుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చిన్నతరహా పరిశ్రమల అంచనాలు తప్పుతాయి. వారం మధ్యలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.

పరిహారం : పంచముఖ హనుమత్ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చిక రాశి :

శుభకార్యాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడతారు. కొన్ని వ్యవహారాలలో మీ శ్రమ ఫలిస్తుంది. పనులు మరింత సాఫీగా సాగుతాయి. కుటుంభ సభ్యులకు సంబంధించి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. కొన్ని రంగాల వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం చివరిలో ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి.

పరిహారం : రామచంద్రఅష్టకం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి :

నూతన వ్యవహారాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమౌవుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకోవడంలో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. దైవకార్యాలలో పాల్గొంటారు. సంతాన వివాహాది వేడుకలపై చర్చలు జరుపుతారు. వ్యాపారాలలో మరింత పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. అన్ని రంగాల వారు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. వారం ప్రారంభంలో చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం : గుర్వాష్టక స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మకర రాశి :

ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుని బాధపడతారు. సమాజంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. గృహ నిర్మాణయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో పూర్వవైభవం కనిపిస్తుంది. ఉద్యోగాలలో ఉన్నత అధికారుల నుండి ఒత్తిడులు తొలగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో అనారోగ్య సూచనలు ఉన్నవి. కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి.

పరిహారం : శ్రీకృష్ణ చంద్రష్టకం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

కుంభ రాశి :

ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక విషయాలలో అవరోధాలు తొలగుతాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా చేస్తారు. వ్యాపార విషయంలో సొంత ఆలోచనలు కలసివస్తాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున తెలివితేటలతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. దీర్ఘ కాలిక సమస్యల నుంచి బయటపడతారు. అన్ని రంగాల వారికి చిక్కులు తొలగుతాయి. వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. పనుల్లో శ్రమ తప్పదు.

పరిహారం : నవగ్రహ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

మీన రాశి :

అనుకున్న వ్యవహారాలు మరింత విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రత్యర్థులను సైతం సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థికంగా మరింత అనుకూలత కలుగుతుంది. రుణబాధలు తొలగుతాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు. అన్ని రంగాల వారికి సమస్యలు తొలగుతాయి. వారం చివరలో ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి

పరిహారం : వెంకటేశ్వర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Next Story