వార ఫలాలు: తేది 01-12-2024 నుంచి 07-12-2024 వరకు
చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆత్మీయులతో మాట పట్టింపులు ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
By జ్యోత్స్న Published on 1 Dec 2024 12:30 AM GMTవార ఫలాలు: తేది 01-12-2024 నుంచి 07-12-2024 వరకు
మేషం రాశి :
చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆత్మీయులతో మాట పట్టింపులు ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వాహన సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు. వారాంతమున ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సంబంధిత సమస్యలు బాధిస్తాయి. శివాలయం దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
వృషభం రాశి :
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన వ్యాపారస్తుల ఆశించిన లాభాలు అందుతాయి. సంతాన విద్యా ఫలితాలు ఆనందం కలిగిస్తాయి.వృత్తి ఉద్యోగాలలో మీ మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఆప్తుల నుండి అవసరానికి ధనసహాయం అందుతుంది. వారాంతమున కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించాలి. వృధా ఖర్చులు పెరుగుతాయి. గ్రామ దేవత దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
మిథునం రాశి :
చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. మిత్రులతో వ్యాపార పరమైన విషయాల గురించి చర్చిస్తారు. దాయాదులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విద్యార్థుల విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగమున అనుకూల స్థాన చలన సూచనలు ఉన్నవి. గృహమున కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వారం మధ్యన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. నరసింహ స్వామి దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
కర్కాటకం రాశి :
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో అనుకూలత కలుగుతుంది. సోదరులతో సఖ్యత గా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో స్థిరాస్తి వ్యవహారాలను సజావుగా పూర్తిచేస్తారు. సమాజంలో పరిచయాలు మరింత విస్తృతమౌతాయి. సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారపరంగా నూతన పద్ధతులను అవలంబించి సత్ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు పని భారం నుండి కొంత ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వారాంతంలో వ్యయ ప్రయాసలు పెరుగుతాయి. ధన వ్యయ సూచనలు ఉన్నవి. దుర్గా అమ్మవారి దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
సింహం రాశి :
నూతన కార్యక్రమాలను ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సంతాన విద్యా విషయాలలో దృష్టి సారిస్తారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పాత ఋణాలు తీర్చగలుగుతారు. దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయాలు లాభిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సోదరులతో భూ సంబంధిత వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార ప్రారంభమునకు ఆటంకాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వారం మధ్యలో బంధుమిత్రులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. ఋణ ఒత్తిడి పెరుగుతుంది నవగ్రహా ప్రదక్షిణ చేసుకోవడం వలన శుభఫలితాలు పొందుతారు.
కన్య రాశి :
పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. వారం మధ్యలో ధన పరంగా ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.
తుల రాశి:
నూతన పనులు ప్రారంభిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అంది అవసరాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వివాదాల నుంచి తెలివిగా బయటపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత అభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయవర్గాలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి ధన పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. లక్ష్మీ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.
వృశ్చికం రాశి :
ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. సన్నిహితుల నుండి అందిన ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు విస్త్రుతమవుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సన్నిహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన గృహ వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహంతో నూతన పదవులు పొందుతారు. ఇంటా బయట ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ప్రయాణాలు వాయిదా పడతాయి. క్రయ విక్రయాలకు సంబంధించిన ఒప్పందాలు నిరుత్సాహపరుస్తాయి. సుబ్రహ్మణ్య కవచం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.
ధనస్సు రాశి :
ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు తప్పవు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త అవసరం విద్యార్థులు పరీక్ష ఫలితాలు కొంత నిరాశ పరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్థిరాస్తుల వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన సమస్యలు కలుగుతాయి. కొన్ని రంగాల వారికి చిక్కులు తప్పవు. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. నూతన వాహన యోగం ఉన్నది. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
మకర రాశి :
చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు కష్టం ఫలిస్తుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. విలువైన గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలున్నప్పటికి నిదానంగా పూర్తిచేస్తారు. అన్ని రంగాల వారికి సమస్యలు తొలగుతాయి. వారం మధ్యలో ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి. గృహమున వివాదాలు తప్పవు మధురాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
కుంభ రాశి :
సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు. ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశజానాకంగా ఉంటుంది. స్థిరస్తి విషయంలో సోదరులతో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో భాగస్తులు సహాయంతో పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరమైన సమయం. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో మాట పట్టింపు ఉంటాయి. శివాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
మీన రాశి :
కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధుమిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచ. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ధనాదాయం బాగుంటుంది. రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.