శ్రీ శోభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు 2023-2024

ఏప్రిల్ : సమయానికి నిద్రహారాలు ఉండవు. ధనవ్యయం, ఆందోళనలు, శత్రు సమస్యలు.

By జ్యోత్స్న  Published on  22 March 2023 7:16 AM GMT
Sri Shobhakruth Nama Samvatsaram, Horoscope, Ugadi - 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు 2023-2024 

మేష రాశి:

ఆదాయం: 5 వ్యయం: 5

రాజపూజ్యం: 3 అవమానం: 1

మాసవారీ ఫలితములు

ఏప్రిల్ : సమయానికి నిద్రహారాలు ఉండవు. ధనవ్యయం, ఆందోళనలు, శత్రు సమస్యలు. మొదలగు ఇబ్బందులు, కుటుంబ సౌఖ్యానికి మాత్రం లోటురాదు. వాహన లాభము, దూర ప్రయాణములు వివాదములు చికాకులు కలిగించును. దైవ సందర్శనలు, కార్యక్రమాల్లో పాల్గొందురు.

మే : మాసం మొదట్లో స్థానచలనములు, అనారోగ్య సూచనలు. మాసం మధ్యన నుండి అనుకూల వాతావరణం ధనమునకు లోటు ఉండదు. వివాహది శుభాకార్యములలో పాల్గొంటారు ఆరోగ్య లాభము కలుగును.

జూన్ : మాసం ప్రారంభమున సమస్యలు, సోదర కలహాలు. మాసాంతమందు శుభకార్య సంబంద కార్యక్రమాలు, దైవచింతన, ధైర్యంగా ప్రతి పనియందు ముందుకు సాగుతారు, బంధు మిత్రుల కలయిక సంతోషము కలిగిస్తుంది.

జులై : మాసం ప్రారంభమున ఉత్సాహం, ధనలాభం, గౌరవ వృద్ధి మధ్య నుండి ధనవ్యయం, చికాకులు, పనులు ఆటంకములు, అవమానములు. కుటుంబ వాతావరణం కొంత ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపార పరంగా ఇబ్బందులు.

ఆగస్టు : మాసం ప్రారంభమున గృహమందు శుభకార్యాచరణ, కుటుంబంలో ఆనందం. శతృనాశనం, నూతనగృహ నిర్మాణ ప్రయత్నాలు, సోదర సహాయం, ధన లాభములు. మాసం చివరన అనుకోని విధముగా ఋణములు చేయవలసి రావచ్చు, ఆందోళనలు.

సెప్టెంబర్ : కుటుంబ సభ్యులతో కలహాలు. ధనవ్యయం, చికాకులు,పనులందు ఆటంకాలు, శత్రు భయము , మనోక్లేశములు, మాతృ, పితృవర్గ అనారోగ్య సమస్యలు. మాసం చివరన ధనలాభము, పుత్రలాభం, పనులందు యత్నకార్యసిద్ధి సంతానమూలక శుభవార్తలు కల్గును.

అక్టోబర్ : ఈ మాసము అనుకూలంగా ఉండును. అన్ని రంగాల వారికి అనుకూలం. ధనలాభం. శుభకార్య ప్రయత్న అనుకూలత. మాసం చివరన వృధా ప్రయాణాలు, అకారణ వివాదములు. స్థానచలనములు.

నవంబర్ : ఈ మాసం అనుకూలంగా ఉన్నది వ్యాపార వ్యవహారాలయందు అనుకూలంగా యుండును. మనోభీష్టసిద్ధి నెరవేరును. విలువైన వస్తు లాభము. పుణ్యక్షేత్ర సందర్శములు. దైవ కార్యక్రమములలో పాల్గొందురు. మాసాంతమున కొన్ని ఊహించని ఇబ్బందులకు గురికావచ్చు.

డిసెంబర్ : అన్ని రంగాల వారికీ అనుకూలం, ఇష్ట వస్తు లాభములు, బందు ఆదరణ పెరుగును, మానసిక ప్రశాంతత. ధన లాభములు. విందులు, వినోద కార్యక్రమములు. ఇతరుల వ్యవహారముల యందు ఆసక్తి. పుణ్యకార్యములు చేయుటమంచిది.

జనవరి : అన్నిరంగాల వారికీ అనుకూలం, గౌరవ వృద్ధి, విశేష ఆధరాభిమానాలు, అధికారుల వలన ఊహించని ప్రయోజనాలు, మనోభీష్టసిద్ధి నెరవేరును. గృహమున శుభాకార్యములు జరుగును.

ఫిబ్రవరీ: మాసం ప్రారంభమున అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ధనధాన్య లాభం, పెద్దలతో పరిచయం. విందు వినోదములలో ఆసక్తి. గృహ వాతావరణం సంతోషకరంగా ఉండును. మాసం చివరన వృధా ఖర్చు, ఒత్తిడి, గౌరవ నష్టము.

మార్చి : ఆర్ధిక పరిస్థితి మెరుగుపడును, శుభకార్య ప్రయత్న లాభము, నూతన వస్తు లాభము. కుటుంబ పెద్దల సహాయం వలన పనులందు కార్యనుకూలత. వ్యాపార విస్తరణ ప్రయత్న లాభము ఆరోగ్య అనుకులత.

పరిహారం : ఈరాశివారు గురు,రాహు, కేతు జపములు, శివసహస్ర నామ స్తోత్రం పారాయణం, వినాయకుని ఆరాధనా చెయ్యడం మంచిది. శ్రీకాళహస్తి దేవాలయంలో రాహుకేతూ పూజ చేయించాలి.

వృషభ రాశి:

ఆదాయం: 14 వ్యయం: 11

రాజపూజ్యం: 6 అవమానం:1

మాసవారీ ఫలితములు

ఏప్రిల్ : మాసం ప్రారంభములో అన్నిరంగాలలోనూ అభివృద్ధికరంగా ఉండును. గౌరవ మర్యాదలు వృద్ధి అగును వ్యాపారములు లాభసాటిగా సాగును. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు పొందగలరు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు మాసాంతమున వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.

మే : మాసం ప్రారంభమున ఊహించిన సంఘటనలు జరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మాసం మధ్య నుండి అనుకూల వాతావరణం ఉన్నది. విలువైన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు గృహ వాతావరణం బాగుంటుంది.

జూన్ : ఈ మాసం అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి అనుకున్న సమయానికి ఉద్యోగం పొందగలుగుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. మాసం మధ్య నుండి కళాత్ర సమస్యలు స్థానచలనములు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

జులై : మాసం ప్రారంభంలో జ్వరాది అనారోగ్యములు. శత్రు సమస్యలు. ఆందోళనలు పనులందు ప్రయత్న ఆటంకములు. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. మాసం చివరన ధన ధాన్య లాభము ఆరోగ్యానికి శత్రుభాదల నివారణ కలుగును.

ఆగస్ట్: ఈ మాసం అనుకూలంగా ఉన్నది విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ ఖర్చులు అధికమైనప్పటికీ అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మాసం చివరన విద్యార్థులు జాగ్రత్త వహించాలి.

సెప్టెంబర్:ఈ మాసము నందు కొంతమేర శుభాశుభ మిశ్రమముగా ఉన్నది. మాసం ప్రారంభమైన చిన్నపాటి అనారోగ్య సమస్యలు మధ్య మధ్య రుణములు చేయుట, వ్యాపారస్తులకు స్వల్పలాభం కలుగుతాయి. ద్వితీయార్ధమున గౌరవవృద్ధి, శతృజయం, ఉద్యోగులకు పదవీయోగము.

అక్టోబర్ : మాసం ప్రారంభమైన రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. గృహాపకణాలు కొనుగోలు చేస్తారు. నూతన వాహన రాక ఉన్నది పనులందు కార్యసిద్ది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రుపీడలు తొలగి మాసాంతం ఆనందకరంగా ఉందును.

నవంబర్ : ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు. కొన్ని పనులలో ఆటంకాలు కలిగినప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర సందర్శనాలు చేసుకుంటారు.

డిసెంబర్ : ఈ మాసం ప్రథమ భాగంలో వృధా ఖర్చులు పెరుగుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. పూర్వర్ధమున , బంధువులతో కలహ సూచనలు అనారోగ్యములు. స్థానచలనములు వాహన ప్రయాణమున జాగ్రత్త అవసరం.

జనవరి : ఈ మాసం అనుకూలంగా ఉండును, సంతాన విద్యా వృద్ధి అనుకొని పనులు యందు కార్యసిద్ధి వృత్తి వ్యాపారం విషయాల్లో విశేషమైన లాభాలు అందుకుంటారు. మాసాంతమున ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

ఫిబ్రవరీ : గృహమును వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు మాసం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ధన వ్యవహారానికి లోటుపాటు ఉండదు.

మార్చ్: ఈ మాసం అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగమున బాధ్యతలు పెరుగుతాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో విశేషమైన లాభాలు అందుకుంటారు.

పరిహారం :ఈరాశి వారు గురు, రాహు, కేతు దోష నివారణకు గురు,రాహు, కేతు జపములు,సుందర కాండ పారాయణం, వినాయకుని ఆరాధన చెయ్యడం మంచిది. శ్రీ కాళహస్తి దేవాలయంలో రాహుకేతూ పూజ చేయించాలి.

మిథున రాశి:

ఆదాయం: 2 వ్యయం: 11

రాజపూజ్యం: 2 అవమానం: 3

మాసవారీ ఫలితములు

ఏప్రిల్ : మాసం ప్రారంభంలో అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మాసం చివరన అనారోగ్యములు బంధు వివాదములు ప్రత్యర్థుల వలన సమస్యలు స్థానచలనములు కలుగును.

మే : ఈ మాసం మిశ్రమంగా ఉన్నది. మనోరధాలు నెరవేరతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఆందోళనలో కొంత చిరాకు పరుస్తాయి. ఊహించిన సంఘటనలు ఎదురవుతాయి. మాసం చివరన వివాహాది శుభకార్యాలకు పాల్గొంటారు. అధికారుల ప్రోత్సాహంతో పదోన్నతులు పెరుగుతాయి.

జూన్ : ఈ మాసం ప్రారంభం యోగదాయకంగా ఉంటుంది. పనులందు కార్యసిద్ధి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. మాసం మధ్యలో కొన్ని వ్యతిరేక ఫలితాలు వచ్చిన ముందుకు సాగుతారు. భూ గృహ చరాస్తుల విషయమై స్వల్ప ఆటంకాలు ఉంటాయి.

జులై : ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఇంటా బయట బాధ్యతలు అధికమవుతాయి. మధ్య మధ్యలో చిన్నపాటి అనారోగ్యాలు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. కలహాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు సమస్యలు తప్పవు.

ఆగష్టు: ఈ మాసం ప్రారంభంలో వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. చిన్నపాటి విషయాలకే వివాదాలు అధికమౌతాయి. మాసం మధ్యలో బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. పనులందు కార్యసిద్ది కలుగుతుంది.

సెప్టెంబర్ : ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గృహమును ఊహించని మార్పులు కలుగుతాయి. ఇంటా బయట ఒత్తిడిలో అధికమవుతాయి. మాసం మధ్య నుండి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకర సమయం విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

అక్టోబర్ : ఈ మాసం ప్రథమ భాగంలో పనులను ఆటంకాలు మాతా పిత్రులకు అనారోగ్య సమస్యలు. రాబడికి మించి ఖర్చులు అకారణ వివాదాలు కలుగుతాయి. మాసం చివరన ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆదాయానికి లోటు ఉండదు.

నవంబర్ : ఈ మాసం కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. శత్రువుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. చేయని పనికి విమర్శలు ఎదుర్కొంటారు, స్థాన మార్పులు. మాసం మధ్య నుండి కొంత వాతావరణం ఉంటుంది. వ్యాపార వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

డిసెంబర్ : ఈ మాసం అనుకూలంగా ఉన్నది గౌరవ మర్యాదలు విస్తృతమవుతాయి వ్యాపార ఉద్యోగాలలో విజయవంతంగా ముందుకు సాగుతారు. సంతాన వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. చేతికి రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది.

జనవరి : ఈ మాసం అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఊహించని మార్పులుంటాయి. కుటుంబ పెద్దలతో కలహాలు సమసిపోతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.

పీబ్రవరి : ఈ మాసం ప్రధమార్థంలో గృహమున వివాహది శుభాకార్యములలో పాల్గొంటారు. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. మాసం చివరన అనారోగ్యములు స్థానచలనములు వివాదములు ధనవ్యయము.

మార్చ్ : మాసం ప్రారంభమున వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఊహించని సమస్యలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం, మాసం మధ్య నుండి వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి. అన్ని రంగాల వారికి అనుకూలం.

పరిహారం :ఈ రాశివారు శని, కేతువులకు, జప దానాలు చేసుకోవాలి. సుబ్రహ్మణ్య ఆరాధన శుభము. గురు చరిత్ర పారాయణం చెయ్యడం మంచిది. గణపతి అష్టకం నిత్యం పారాయణం చెయ్యాలి.

కర్కాటక రాశి:

ఆదాయం: 11 వ్యయం: 8

రాజపూజ్యం: 5 అవమానం: 4

మాసవారీ ఫలితములు

ఏప్రిల్ : ఈ మాసం కొంత అనుకూల వాతావరణం ఉన్నది. చేపట్టిన పనులలో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలు ఆశించిన విధంగా ఉంటాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

మే: మాసం ప్రారంభంలో రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అమ్ముతుంది విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది.

జూన్ : మాసం ప్రారంభంలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార ఉద్యోగములు ఆశించిన విధంగా లాభిస్తాయి. కీలక వ్యవహారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మాసం చివరన అకారణ వివాదములు, మానసిక ఆందోళన చికాకు పరుస్తాయి.

జులై : మాసం ప్రారంభమున ధనము వ్యయము. అనారోగ్యములు ప్రయాణంలో అలసట వృధా వ్యయం, మాస మధ్య నుండి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తవుతాయి ఉద్యోగ వృద్ధి.

ఆగష్టు: ఈ మాసం సామాన్యంగా ఉంటుంది. గృహమున ఊహించిన సంఘటన చోటు చేసుకుంటాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అకారణ వివాదములు ఉద్యోగంలో స్థానచలనములు మాసం మధ్యన శుభకార్య అనుకూలత స్వల్ప ధన లాభములు కలుగును.

సెప్టెంబర్ : అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. నూతన వాహన యోగం ఉన్నది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణకు అవకాశాలు లభిస్తాయి.

అక్టోబర్ : ఈ మాసం అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. కష్ట సాధ్యమైన పనులు కూడా అతి సులువుగా పూర్తి చేస్తారు. శుభకార్యములకు ధన వ్యయం చేస్తారు. గతం కంటే ఆరోగ్యం మెరుగు అవుతుంది. మాసం చివరన మానసిక ఆందోళనలు వృధా ఖర్చులు పెరుగుతాయి.

నవంబర్ : ఈ మాసం విశేషంగా లాభిస్తుంది. ధన లాభము పనులందు కార్య సిద్ది ఉద్యోగ వ్యాపారాలలో విశేషమైనటువంటి పురోగతి గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. విలువైన వస్త్రా ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

డిసెంబర్ :ఈ మాసం ప్రారంభంలో శుభ ఫలితాలు ఉన్నవి, అన్ని రంగాలలోను అభివృద్ధి, అవసరానికి ధన సహాయం అందుతుంది. మాసం మధ్య నుండి చేపట్టిన పనులు యందు అధిక శ్రమ దేహ అనారోగ్యములు, కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర సందర్శనలు చేసుకుంటారు.

జనవరి: మాసం ప్రారంభంలో ధన వ్యయం, పనులందు అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. మాసం మధ్య నుండి కొంత మెరుగైన ఫలితాలు ఉంటాయి. దూర ప్రయాణ సూచనలు ప్రముఖులతో పరిచయాలు పుణ్యక్షేత్ర సందర్శనాలు చేసుకుంటారు.

పీబ్రవరి :మాసం ప్రారంభంలో మీ మనోరథాలు నెరవేరుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చివరన శరీరపీడ, అనారోగ్యములతో ఇబ్బందులు తప్పవు.

మార్చ్ : మాసం ప్రధమ భాగంలో శ్రమకు తగిన ఫలం పొందగలరు. అన్ని రంగాల వారికు ప్రోత్సాహం ఉంటుంది. మాసం మధ్యన కొన్ని సంఘటనలు చికాకు పరుస్తాయి. వివాదముల వలన మానసిక సమస్యలు జాగ్రత్త అవసరం.

పరిహారం :ఈ రాశివారు శనీశ్వరునికి తైలాభిషేకం, జపతర్పణ, హోమ దానములు చేయుట. సుబ్రమణ్య స్వామి ఆరాధన కందులు దానం. సుందరకాండము పారాయణం చెయ్యటం మంచిది.

సింహ రాశి:

ఆదాయం: 14 వ్యయం: 2

రాజపూజ్యం: 1 అవమానం: 7

మాసవారీ ఫలితములు

ఏప్రిల్ : ప్రధమార్థంలో ప్రయాణములు, తీర్థయాత్రలు చేయుట, కళత్రపీడలు, ద్వితియార్ధమున, భూగృహ ధనధాన్య లాభములు కలుగును, మానసికంగా ప్రశాంతత పనులు యందు యత్నకార్య సిద్ధి. ఉద్యోగమున ఉన్నతి ఆరోగ్య లాభం కలుగును.

మే : ధనధాన్యాభివృద్ధి, తీర్థ యాత్రలు చేయుట, ఆర్థికపరిస్థితి గతం కంటే మెరుగుపడుట, గృహోపకరణ కొనుగోలు, వివాహాది శుభకార్య లాభం. ద్వితియార్థం జాగ్రతగా మెలగవలెను. అకారణ కలహాలు, నిందలు, ఆరోగ్య మూలక సమస్యలు కలుగును.

జూన్ :మాసం ప్రారంభమున ద్వేషము, కలహము, ధనవ్యయం, శుభాశుభ మిశ్రమములు, మానసిక ఆందోళన, వృత్తి వ్యాపార వ్యవహారములలో బాధ్యతలు అధికము, మానసిక ఆందోళనలు.

జులై : మాసం ప్రారంభంలో ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలలో నష్టములు. బంధుమిత్రులతో మాట పట్టింపులు. చెయ్యని పనికి నిందలు పడటం. మాసం చివరన పెద్దలను అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. దైవచింతనం పెరుగుతుంది.

ఆగష్టు : మాసం ప్రారంభంలో వాహన ప్రయాణంలో జాగ్రత్త అవసరం. జ్వరాది అనారోగ్యములు, గాయములు రోగబాధలు మానసిక ఆందోళనలు మాసం చివరన అనుకున్న పనులు ముందుకు సాగును. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

సెప్టెంబర్ : ప్రారంభమున అధికారుల నుండి మానసిక ఆందోళన, అనారోగ్యములు, అధికారుల వలన వత్తిడి, అధికధనవ్యయం, చివరన కొంత అనుకూల పరిస్థితులు, వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి. ఆదాయం పెరుగుతుంది.

అక్టోబర్ : ఈ మాసం అన్ని రంగాల వారికి అభివృద్ధి ఉంటుంది. రావలసిన బాకీలు వసూలగుట, పనులు చురుకుగా సాగుతాయి. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మధ్యలో పనులందు ఆటంకములు, విరోధములు, ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

నవంబర్: ఈ మాసం యోగదాయకంగా ఉంటుంది. మంచి ఆదాయం, గృహమున శుభకార్యములు, ధనధాన్య వృద్ధి, మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వృత్తి ఉద్యోగములలో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారులకు, విశేషమైన లాభాలు అందుతాయి.

డిసెంబర్:ఈ మాసం అనుకూలంగా ఉన్నది. ధనలాభం, శత్రు మూలక లాభములు, ధనధాన్యాభివృద్ధి, ఉద్యోగ వృద్ధి వంటి అనుకూల ఫలితములు. పుణ్య క్షేత్ర సందర్శనములు. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి.

జనవరి: మాసం ప్రారంభములో కొన్ని చిక్కులు ఎదురవుతాయి. అనవసర వ్యయం, విరోధములు, ఊహించని సంఘటనలు. వృధా దూర ప్రయాణాలు, చివరన కొంత పరిస్థితులలో మార్పు. ధన విషయంలో జాగ్రత్త అవసరం.

ఫిబ్రవరి : ప్రారంభమున కొన్ని విషయాలలో మనస్థాపం, మనసున గందరగోళం, ధన నష్టం, భయందోళనలు, ఉత్తరార్ధం శుభకార్యాలు చేయుటలో ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున ఉన్నతి పనులందు కార్యసిద్ధి.

మార్చ్ : ఈ మాసం మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రారంభంలో కొంత గందరగోళ పరిస్థితులు మాసం చివరన పనులందు కార్యసిద్ధి, ధన లాభం, అనుకూల సంఘటనలు, వివాహాది శుభకార్య అనుకూలత ఆరోగ్య లాభం.

పరిహారం :ఈ రాశిగలవారు శని, రాహు, గురు, కేతువులకు జపం, దానం, తైలాభిషేకం. జరిపించుకొనిన మంచిది. మినుములు దానం ఇచ్చుట, దుర్గా అమ్మవారి ఆరాధన, సుందరకాండ పారాయణ చేయుట మంచిది.

కన్య రాశి :

ఆదాయం: 2 వ్యయం: 11

రాజపూజ్యం: 4 అవమానం:7

మాసవారీ ఫలితములు

ఏప్రిల్ : ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ముఖ్యమైన పనులలో కొంత జాగ్రత్త వహించాలి. మాసం ప్రారంభం కంటే మధ్యభాగంలో కొంత అనుకూలంగా ఉంటుంది. ధన దాన్య లాభములు ఇతరులతో మాటపట్టింపులకు వెళ్లకపోవడం మంచిది.

మే : అన్నిరంగాలలోనూ విజయంగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు జరుగుతాయి. గృహోపకరణములు కొనుగోలు చేస్తారు. మీ అభిలాష నెరవేరుతుంది. చేయు పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

జూన్ : తీర్థ యాత్రలు చేస్తారు. ధనానికి లోటున్నప్పటికీ సౌకర్యాలకు లోటు ఉండదు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యములు కలసి వస్తాయి. శ్రమకు తగిన ఆదాయము లభిస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.

జూలై : మాసం ప్రారంభంలో రోగ భయము శత్రు సమస్యలు ధనవ్యయము వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఉద్యోగమున స్థాన చలనములు మాసం చివర నుండి కొంత అనుకూల పరిస్థితులు ఉన్నవి.

ఆగష్టు : ఈ మాసం శుభ శుభ ఫలితాలు ఉన్నవి. ప్రారంభమున అకారణ వివాదములు ఊహించని సమస్యలు ఆదాయానికి మించిన ఖర్చులు. పనులలో తొందరపాటు మంచిది కాదు. మాసాంతము కొంత అనుకూలంగా ఉండును. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది.

సెప్టెంబర్ : మాసం ప్రారంభంలో జ్వరాది అనారోగ్యంలో శిరోబాధలు ధన వ్యయము ఇతరులతో మాట పట్టింపులు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు. మాసం చివరన కొంత అనుకూల పరిస్థితులు ఉన్నవ. శుభకార్య మూలక లాభము సంతాన విషయాలలో శుభవార్తలందుతాయి.

అక్టోబర్: ఈ మాసం కొంత మిశ్రమ ఫలితాలు వున్నది. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. మానసిక ఆందోళనలు, పుణ్య కార్యాలకు, ధనవ్యయం ఇతరుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మాసం చివరన ఔషధ సేవనము స్వల్ప ఆరోగ్యం.

నవంబర్ : మాసం ప్రారంభంలో ధనధాన్య ప్రాప్తి ఆరోగ్య లాభము గృహమున సంతోషకర వాతావరణము, మధ్యనుండి మధ్యమధ్య అనారోగ్యము, స్థానచలనం, ఆందోళన, ధనవ్యయము, ఉద్రిక్తతకు లోనగుతారు. గతంకంటే కొంత మెరుగుగా ఉండును. తీర్ధయాత్రలు చేయుట వలన మానసిక ప్రశాంత లభించును.

డిసెంబర్ : గత మాసం కంటే ఈ మాసం విశేషంగా ఉంటుంది అధికారుల అండదండలు. శుభకార్యాలకు ధనవ్యయము. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలందుతాయి. మాసం చివరన శత్రు పీడలు మానసిక ఆందోళనలు.

జనవరి : ఈ మాసం మిశ్రమ ఫలములు కలుగును. కుటుంబంలోనూ, ఉద్యోగాలలోనూ బాధ్యతలు అధికమగుతాయి. ఏదో ఒక మానసిక ఆందోళన తప్పవు. ఆరోగ్యం జాగ్రత్త వహించాలి. కొన్ని సంఘటనలో ఆశ్చర్యం కలిగిస్తాయి.

ఫిబ్రవరి : మాసం ప్రారంభంలో అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున వివాహాది శుభకార్యములలో పాల్గొంటారు. భూ గృహ లాభము మాసం చివరన మానసిక శ్రమ, ఆందోళనలు కలుగును దైవసందర్శన చేయుట మంచిది.

మార్చ్ : మాసం ప్రారంభమున మానసిక ఆందోళనలు. ఆరోగ్య వ్యవహారములలో జాగ్రత్త అవసరం. సంతాన పరంగా సమస్యలు. మాసం మధ్యలో గృహమున శుభకార్యము భూ, గృహ చర స్థిరాస్తి వ్యవహారములలో జయము. విందు, వినోదాలలో పాల్గొంటారు, శత్రుజయం.

పరిహారం :శని, గురు, రాహు, కేతువులకు జపములు, తైలాభిషేకములు, దానములు చేయుట వల్ల శుభములు కలుగును. నిత్యం ఆదిత్య హృదయం, పారాయణ చెయ్యడం మంచిది.

తుల రాశి:

ఆదాయం: 14 వ్యయం: 11

రాజపూజ్యం: 7 అవమానం:7

మాసవారీ ఫలితములు

ఏప్రిల్ : ఆదాయానికి మించిన ఖర్చులు, నూతన వస్తువులు కొనుగోలు చేయుట, ధన నష్టములు. దూరపు బంధువుల ఆగమనం. కొన్ని విషయాలలో సహనము వహించుట మంచిది. వృత్తి, ఉద్యోగములలో విశేషమైన పురోగతి.

మే : ఈ మాసం వృత్తివ్యాపారములు మందగించుట, వృథాప్రయాణములు, శత్రు భయము, పనులందు శ్రమ, అధికారుల వల్ల ఒడిదుడుకులు. అకారణ వివాదములు. మాసం చివరన పెద్దల సహకారముతో కొన్ని పనులందు కార్యసిద్ధి కలుగుతుంది.

జూన్ : మాసం ప్రారంభమున ప్రయాణాలు వాయిదా పడతాయి. గృహమున కుటుంబ సభ్యులతో వివాదాలు ఉన్నప్పటికీ సమయానుకూలంగా ప్రవర్తించడం వలన కొంత అనుకూలత కలుగుతుంది. ఆదాయ మార్గాలు కొంత విస్తృతమవుతాయి. ఉద్యోగమున పురోగతి వాహన లాభం ఉన్నది.

జులై :మాసం ప్రారంభమున అధిక ఖర్చుల వల్ల కొంత సతమతమగుట, వ్యతిరేకులపై విజయము, ఉద్యోగాభివృద్ధి, నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభము. మాసం చివరన ప్రయాణముల యందు జాగ్రత్త అవసరము.

ఆగష్టు : ఈ మాసం సామాన్యంగా ఉంటుంది. వివాహది శుభ కార్యక్రమాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ధన వ్యవహారములు కూడా ముందుకు సాగుతాయి. ఇతరుల విషయముల యందు మధ్యవర్తిత్వము చేయవలసి రావచ్చును.

సెప్టెంబర్ : ఈ మాసములో కొన్ని అనుకోని సంఘటనల వలన మీ పనులందు ఆటంకములు తప్పవు. సోదర, పుత్ర వివాదములు, వ్యాపార సంబంధిత వ్యవహారములు యందు ప్రత్యేక శ్రద్ధ చూపటం మంచిది. ప్రయాణాలు వాయిదా పడుతాయి.

అక్టోబర్ : నిరుద్యోగ ప్రయత్నాలు పలిస్తాయి. కొన్ని పనులలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వృత్తి, వ్యాపారములు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

నవంబర్ : వృథాప్రయాసచే ధన్యయము, దైవదర్శనములు, ఆరోగ్యభంగములు, మిత్రభేదములు, దూరప్రయాణములు చేయుట వలన శ్రమ, వృధా ఖర్చులు పెరుగుతాయి. బందు వైరములు మానసిక ఆందోళనలు ఉంటాయి.

డిసెంబర్ : విలువైన వస్తు లాభములు, పాతమిత్రులకు అనారోగ్యములు, దూరప్రయాణములు చేయుట, ఊహించని ఖర్చులు మాసం మధ్యనుండి విందులు, వినోదాల కార్యక్రమాలలో పాల్గొనుట. నూతన వ్యాపార ప్రారంభ ప్రయత్న లాభము. నూతన విషయములందు ఆసక్తి పెరుగును.

జనవరి : సంతాన ఉద్యోగ విషయంలో అనుకూలత చేపట్టిన పనులు అధికారులు సహాయంతో పూర్తి చేస్తారు. వ్యాపారవృత్తి విషయములలో కొంత పురోగతి కనబడుతున్నది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. బంధుమిత్రుల ఆగమనం, సంతాన మూలక శుభవార్తలు.

ఫిబ్రవరి : సంతాన శుభకార్యములక ధనవ్యయము. కళాత్రమునకు అనారోగ్య సమస్యలు శారీరక మానసిక ఆందోళనలు. కొన్ని పనుల యందు నిదానము వ్యవహరించడం అవసరము. మాసం చివరన విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు.

మార్చ్ : ముఖ్యమైన పనులలో కష్టపడి పనిచేసిన కాని తగిన ఫలము పొందలేరు. భోజన సౌఖ్యము, దూరప్రయాణ విషయముగా ఆలోచనలు, అధికారుల అనుగ్రహం పొందడానికి ప్రయత్నాలు, నూతన విషయములందు ఆసక్తి, మాసం చివరన ధన వ్యయము.

పరిహారం :ఈ రాశివారు రాహు, కేతువులకు జప దానములు సర్ప దానం, సుబ్రమణ్య స్వామికి అభిషేకము. దేవి ఖడ్గ మాల స్తోత్రం పారాయణం చేయించాలి.

వృశ్చికం రాశి:

ఆదాయం: 5 వ్యయం: 5

రాజపూజ్యం: 3 అవమానం: 3

మాసవారీ ఫలితములు

ఏప్రిల్ :మాసం ప్రారంభమున ద్రవ్యనష్టము, ఉద్యోగ, వ్యాపారములలో అదనపు బాధ్యతలు. మానసికంగా ఆందోళన పెరుగును. అనారోగ్య సూచనలు. దూరప్రయాణముల యందు జాగ్రత్త అవసరము, మిత్ర కలహాములు.

మే : ఈ మాసం అనుకుంలించదు ప్రతికూల పరిస్థితులు, ఆందోళన, జ్వర అనారోగ్యములు, విరోధుల వలన సమస్యలు, ధనాధాయ మార్గాలు తగ్గుట. అకాల భోజనము, ఇతరుల వలన సమస్యలు.

జూన్ : చేపట్టిన పనులందు ఆటంకములు. స్థిర చరాస్తి విషయాలలో వివాదాలు, అతి కష్టం మీద శుభకార్యాలు నిర్వహించగలుగుతారు. ఇతరుల వలన కుటుంబంలో వివాదాలు కలుగుతాయి. చికాకులు, కలతలు.

జులై : ఉద్యోగ ఉన్నతి, వ్యాపారములో కొద్దిపాటి లాభము, సన్నిహితుల వలన వత్తిడి మధ్య మధ్య కొన్ని అపవాదులు. ఊహించని సమస్యలు ఉన్నప్పటికీ ధన పరంగా ఇబ్బందులు ఉండవు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

ఆగష్టు : ఇతరుల వ్యవహారములలో మధ్యవర్తిత్వంలో మంచిది కాదు. ప్రయాణములు వాయిదా వేయుట మంచిది. కోర్టు వ్యవహారములకు అనుకుంలించవు మాసం చివరన ప్రయత్నమూలక లాభములు కళాత్ర మూలక లాభం.

సెప్టెంబర్ :ముఖ్యమైన పనులు శ్రమతో కొన్ని ముందుకు సాగుతాయి. స్త్రీమూలక లాభములు. వ్యాపార పరంగా పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. కోర్టు వ్యవహారాలు కొంత అనుకులిస్తాయి.

అక్టోబర్ : గృహములో ఊహించని సమస్యలు, సన్నిహితుల వలన ఇబ్బందులు, స్థానచలనము, మాసం చివరలో అతికష్టముపై ధనలాభము, నూతన ఋణ ప్రయత్నములు ఫలించును. ఉద్యోగస్తులకు కొంత అనుకూలం.

నవంబర్ :ఈ మాసం మీ మనోబిష్టం నెరవేరును. కొన్ని పనులు మందకోడిగా సాగుతాయి. విందువినోదాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు కొంత సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగస్థులకు అధికారుల వలన సమస్యలు తప్పవు.

డిసెంబర్ : ముఖ్యమైన పనులలో శ్రమ, చర స్థిరాస్తి విషయములలో అనుకోని సమస్యలు, కొన్ని వ్యవహారములలో ఇబ్బందులు, రాజకీయంగా పరంగా ఊహించని సమస్యలు, మానసిక ఒత్తిడి అధికంగా ఉండును.

జనవరి : సంతాన విషయములో ఊహించని సమస్యలు. సన్నిహితుల నుండి కొన్ని వినకూడని మాటలు వినవలసి రావచ్చు. భాగస్వామ్య వ్యాపారములలో నూతన పెట్టుబడులు. మాసం చివరన ఆరోగ్యము మందగించే అవకాశము ఉన్నది.

ఫిబ్రవరి : కుటుంబ సభ్యుల మధ్య విభేదములు పెరిగే అవకాశము ఉన్నది. అధికారుల వలన లబ్ది. ఉద్యోగస్తులకు నూతన అవకాశములకై ప్రయత్నాలు ఫలిస్తాయి. వృధా ఖర్చు పెరిగినప్పటికీ ఆదాయం బాగుంటుంది.

మార్చ్ : నిరుద్యోగులకు అనుకూల సమయం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణములు వాయిదా వెయ్యడం మంచిది. భూ, గృహ, వ్యాపార వృద్ధి కొన్ని రంగముల వారికి ఆశాజనకముగా ఉంటుంది. తీర్ధయాత్రలు, దైవసందర్శన కార్యక్రమములలో పాల్గొందురు.

పరిహారం :ఈ రాశివారు గురునకు జప దానములు. నిత్యము గురుచరిత్ర పారాయణ చెయ్యాలి. శివాలయమున గురువారం ప్రదక్షిణాలు అభిషేకం చేయించడం మంచిది.

ధనస్సు రాశి:

ఆదాయం: 8 వ్యయం: 11

రాజపూజ్యం: 6 అవమానం: 20

మాసవారీ ఫలితములు

ఏప్రిల్ : గృహమున శుభాకార్యములు, వృత్తి వ్యాపారములలో అనుకూల ఫలితాలు. అధికారుల ఆదరాభిమానములు పొందుతారు. పనులలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఆదాయం కూడా పెరుగుతుంది. వివాహది కార్యక్రమాలు నిర్వహిస్తారు. భూ, గృహ లాభములు పొందుతారు.

మే : ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. సంతాన వివాహ శుభాకార్యములు క్రయవిక్రయ మూలక లాభములు వ్యాపారవృద్ధి, మాసం మధ్యలో మధ్య మధ్య కొన్ని చిక్కులు వచ్చినప్పటికి ధైర్యంగా ముందుకు సాగుతారు వివాదాలు కూడా సమసిపోగలవు.

జూన్ : ఆరోగ్య సమస్యలు వున్నప్పటికీ దైర్యంగా ముందుకు సాగుతారు. అధికారులకు పదోన్నతులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల సమయం. ప్రయాణాల విషయమై చర్చలు జరుగుతాయి. శత్రు సమస్యలు బాధిస్తాయి.

జులై : గ్రహబలం అధికంగా ఉండటం వల్ల మీ మనోరథాలు నెరవేరగలవు. బంధుమిత్రులు సహాయ సహకారాలు ఉంటాయి. వ్యాపారలాభాలు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.

ఆగష్టు: ఈ మాసము ప్రారంభమున కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన రుణాలు పొందుతారు. సంతాన విషయాలలో శుభవార్తలు ఉంటాయి. విద్యార్థులు తగిన శ్రమ ఉంటే వారు కోరుకొనే ఫలితాలను చాలా సులువుగా పొందగలరు. దైవ అనుగ్రహం ఉంటుంది.

సెప్టెంబర్ : ఈ మాసం ప్రారంభంలో కొద్దిపాటి అనారోగ్య సూచనలు వున్నవి. పనులలో శ్రమ, ఒత్తిడి ఒడిదుడుకులను అధిగమించి నిలబడతారు. అదనపు సౌకర్యములు కలసివస్తాయి. గ్రహ బలము వలన ఇష్టకార్యసిద్ధి, శుభకార్య లాభాలు పొందుతారు.

అక్టోబర్ : నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు కలుస్తాయి. కోపం అదుపులో ఉంచడం మంచిది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. స్త్రీ మూలక కలహ సూచనలు ఉన్నవి. ఇతరుల వ్యవహారాలలో మధ్యవర్తత్వం చేయడం మంచిది కాదు.

నవంబర్ : ఆదాయంవృద్ధి వున్నప్పటికి ఖర్చుల వలన కొంత ఇబ్బంది తప్పదు. గృహ వాహన మార్పులు. వృత్తి వ్యాపారాలు స్వల్ప లాభాలు అందుతాయి. మాసం చివరన జ్వరాది అనారోగ్య సమస్యలు కొంత భాదిస్తారు.

డిసెంబర్ : భూ వ్యవహారాలలో సోదరులతో వివాదాలు. పుణ్యక్షేత్ర సందర్శనలు చేసుకుంటారు. వివాహాది శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. మాసం చివరలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వృధా ఖర్చులు పెరుగుతాయి.

జనవరి : మాసం ప్రారంభంలో పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వాహనం నడిపే సమయంలో జాగ్రత్త వహించాలి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. సమస్యల నుండి బయట పడతారు.

ఫిబ్రవరి : నూతన వస్తు వాహన ప్రాప్తి, శుభకార్యాల మూలక లాభము మాసం మధ్య నుండి ధన పరంగా ఇబ్బందులు చిన్నపాటి వివాదాలు ఉద్యోగస్తులకు స్థానాచలనములు దైవ కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు.

మార్చ్ : విద్యార్థులకు కొంత అనుకూల సమయం మధ్య మధ్య ఇబ్బందులు వచ్చినప్పటికి తొందరగా పరిష్కరించుకుంటారు. వివాహాది శుభకార్యక్రమాలు లాభిస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకొనుట మంచిది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

పరిహారం :ఈ రాశివారు రాహు, కేతు, శాంతి దానములు, హోమములు చేయించాలి సుందరకాండ పారాయణ మరియు శని కవచం పారాయణం చెయ్యడం మంచిది.

మకర రాశి :

ఆదాయం: 11 వ్యయం: 5

రాజపూజ్యం: 2 అవమానం: 6

మాసవారీ ఫలితములు

ఏప్రిల్ : ఉద్యోగమున ఊహించని సమస్యలు, అధికారుల నుండి ఒత్తిడి కొన్ని విషయాలలో మధ్యవర్తిత్వం చేయడం వలన సమస్యలు గృహమున స్థాన చలనములు ధన దాన్య నష్టములు. అనారోగ్య సమస్యలు.

మే : ఈ మాసం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నవి సోదరులు వలన విరోధములు కొన్ని పనులలో కార్యానుకూలత, గృహ సౌఖ్యము, బంధు మూలక సమస్యలు ప్రభుత్వ అధికారుల వలన లాభము, విందులు, వినోదాలలో పాల్గొందురు, బంధు సమాగమము.

జూన్ : ఈ మాసములో పుణ్యక్షేత్ర సందర్శనములు ధనవ్యయము, ముఖ్యమైన పనులలో కార్యసిద్ధి, కోర్టు వ్యవహారాల యందు అనుకూల ఫలితము, వృత్తి వ్యాపారాలు సామాన్యం చిన్న తరహా పరిశ్రమల వారికి నూతన రుణ లాభములు.

జులై : ఈ మాసం ప్రతికూలంగా ఉన్నది ఊహించని పరిస్థితులు ఏర్పడినప్పటికి సమస్యలను పరిష్కరించుకొనగలుగుతారు. వివాహాది శుభకార్యముల విషయమై సరైన నిర్ణయాలు తీసుకుంటారు. సమయమునకు ధనము చేతికి అందుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం.

ఆగష్టు : గృహ వ్యవహారంలో కుటుంబ పెద్దలతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి. కొన్ని పనులు అతి కష్టం మీద పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారులకు కొంత అనుకూల కాలము. బంధువులు, మిత్రులు సమాగమముతో గృహము నందు సందడిగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యము, స్త్రీమూలక ధనలాభములు.

సెప్టెంబర్ : వృత్తి వ్యాపారాలలో విశేషమైన లాభాలు అందుతాయి. ధన వ్యవహారాలలో పొదుపుగా ఉండాలి. గృహమున ఏర్పడిన కలహములు పరిష్కరించుకుంటారు. కోపమును అదుపులో ఉంచుకొనుట మంచిది. దైవచింతన వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది.

అక్టోబర్ : ఉద్యోగపరమైన లాభములు, సంతాన వివాహ విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు బంధుమిత్రుల ఆగమనము ఆనందం కలిగిస్తుంది. అనుకోని లాభములు, నూతన వస్తు లాభములు, మాసం చివరన వాహన ప్రయాణమందు జాగ్రత్త అవసరం.

నవంబర్ : ప్రారంభంలో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ధనధాన్య లాభాలు పొందుతారు ఆదాయం పెరుగుతుంది. దైవపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాలు కలసివస్తాయి.

డిసెంబర్ : గృహమున శుభకార్యక్రమములు నిర్వహిస్తారు, విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారములయందు అభివృద్ధి, మాసం చివరన మాతృవర్గ సమస్యలు, కొన్ని పనులలో శ్రమ అధికమయిన ధనలాభము పొందుతారు.

జనవరి : ఊహించని వ్యక్తుల వలన మానసిక ఆందోళన, గృహమున కలహాములు, ఋణపరమైన సమస్యలు, పై స్థాయి నాయకుల నుండి అవమానములు, ఉద్యోగస్తులకు స్థానచలనములు వాహన ఇబ్బందులు.

ఫిబ్రవరి : ఈ మాసం శరీర అనారోగ్యం, మానసికాందోళన, వృధా ఖర్చులు, బంధవైరం, భార్య పుత్రుల వలన సమస్యలు ప్రయాణములో వాహన ప్రమాదములు. శ్రమకు తగిన ఫలితం లభించడం కష్టం, మాసం చివరన ధనపరమైన సమస్యలు తగ్గును.దైవ క్షేత్రాలు సందర్శిస్తారు.

మార్చ్ : ఈ మాసం కొంత అనుకూలంగా ఉన్నది గతం కంటే ఆదాయం మెరుగుపడుతుంది నూతన వ్యవహారములలో లాభములు అందుకుంటారు. పై అధికారులు పలుకుబడితో బంధుమిత్రులతో దూరప్రయాణములు చెయ్యవలసి వస్తుంది.

పరిహారం :ఈరాశివారు శనికి తైలాభిషేకం, జపతర్పణ, హోమములు జరిపించుకొనుట మంచిది. శనివార నియమము ఉండటం మంచిది. ఆంజనేయ స్వామి ఆరాధన, శని స్తోత్రం పారాయణం చెయ్యాలి.

కుంభ రాశి:

ఆదాయం: 11 వ్యయం: 5

రాజపూజ్యం: 5 అవమానం: 6

మాసవారీ ఫలితములు

ఏప్రిల్ : ఈ మాసం ప్రారంభంలో స్థాన చలనములు బంధువుమూలక సమస్యలు జ్వరాది అనారోగ్యములు దానవ్యయము, వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది మాసం చివరిన బంధుమిత్రుల సహాయంతో శుభకార్యా అనుకూలత, సంతాన వృద్ధి.

మే : ఈ మాసం శరీరానారోగ్యములు అకాల భోజనము బంధుమిత్రులతో వివాదాలు ఇతరుల వ్యవహారాలలో జ్యోక్యం చేసుకోకపోవడం మంచిది సమయానికి నిద్రాహారాలు ఉండవు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

జూన్ :ఈ మాసం జ్వరాది అనారోగ్యములు వృత్తి ఉద్యోగాలలో స్థాన చలనములు చుట్టుపక్కల వారితో సఖ్యత లోపించడం మాసం మధ్యలో ధన ధాన్య వృద్ధి పనులందు సమస్యలు అధికమించి ముందుకు సాగుతారు.

జులై : ఈ మాసం ప్రారంభంలో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం. సంతాన సౌఖ్యము గృహ వాహన లాభములు. ధన దాన్య లాభములు మాసం చివరన చిన్నపాటి వివాదాలు వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహారించాలి.

ఆగష్టు : మాసం ప్రారంభంలో శుభకార్యములలో పాల్గొనుట, సంతానం అభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలించుట, ఉద్యోగములందు ఉన్నతి, ఆర్థిక పురోగతి విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలితములు పొందుదురు మాసం చివరన నీచజన సాంగత్యము, బంధువైరము, మతిమరుపు సంభవించును

సెప్టెంబర్ : ఈ మాసము శుభాశుభ మిశ్రమ ఫలితములు ఉన్నవి. స్త్రీ మూలక కలహాములు. పితృ, మాతృ వర్గముల వారికి అనారోగ్య సమస్యలు, బంధుమిత్ర సమాగమము, విద్యార్థులకు విదేశీ ప్రయాణాలు కలసివచ్చును.

అక్టోబర్ : అధికారుల నుండి విమర్శలు, జూదముల వలన ధన నాశనము. పుణ్యక్షేత్రములు సందర్శించుట మంచిది మాసం చివరన ధనప్రాప్తి, ఆరోగ్య లాభము, ధన దాన్య వృద్ధి కలుగును.

నవంబర్ : గత మాసం కంటే కొంత అనుకూలంగా ఉండును. దైవదర్శనములు చేయుదురు, భోజన సౌఖ్యము, ధనలాభము, నిలచిన కార్యక్రమములు దిగ్విజయముగా పూర్తి చేయుదురు.మాసం మధ్యన పితృసంబంధ అనారోగ్యము.

డిసెంబర్ : ఈ మాసం వ్యవహారజయము, కార్యనుకూలత, విదేశీ ప్రయాణం, పనులందు కార్యజయం, స్త్రీ సౌఖ్యము, దైవ సందర్శన కార్యక్రమములలో పాల్గొందురు, మాసం చివరన అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బందులు తప్పవు.

జనవరి : మొండి బాకీలు వసూలగుట, నూతన స్నేహితుల పరిచయం, భాగస్వామ్య వ్యాపారమును జాగ్రత్తగా సరిచేసుకోవాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగును మాసం మధ్యన కళత్రమునకు ఆరోగ్యం. జాగ్రత్త అవసరం.

ఫిబ్రవరి :వృత్తి ఉద్యోగమున సహోద్యోగుల సహాయం కుటుంబంలో సంతానమునకు వివాహ ప్రయత్నములు ఫలించుట, మాసాంతమున చేయు ప్రయత్నములు ఫలించును. బంధుమిత్ర సమాగమము, అధికారులకు అనుకూల కాలం.

మార్చ్ :ఉద్యోగమున స్థానచలనము, గృహమున మార్పులు ,మాసం మధ్య నుండి శుభకార్య జయము, నూతన గృహ వస్తు సేకరణ చేయుదురు. అనుకోని విధంగా ధనము సమయమునకు చేతికి అందును. విందులు, వినోదాలలో చురుగా పాల్గొందురు.

పరిహారం :ఈ రాశివారు శనికి తైలాభిషేకం, రాహు, కేతువులకు జపతర్పణ హోమములు మరియు అభిషేకములు జరిపించాలి. మన్యు సూక్త సహితంగా ఆంజనేయ స్వామికు అభిషేకం చేయించాలి.

మీన రాశి:

ఆదాయం: 8 వ్యయం: 11

రాజపూజ్యం: 1 అవమానం: 2

మాసవారీ ఫలితములు

ఏప్రిల్ : మాసం ప్రారంభంలో ప్రయాణము నందు అనుకోని సమస్యలు, శత్రుబాధలు, ఒత్తిడి అధికముగా ఉండును, అనవసరపు వివాదములలో తలదూర్చుట మంచిది కాదు, గృహములో శుభ కార్యక్రమములు వాయిదా పడుట మానసిక ఆందోళనలు.

మే : స్థిరస్తి విషయములో వివాదములు వ్యాపార సంబంధిత విషయముల యందు నష్టము. అనారోగ్య సూచనలు, బంధు వ్యతిరేకతల వల్ల సమస్యలు. వ్యాపారములలో ఊహించని అవాంతరాలు నష్టములు.

జూన్ : చేపట్టిన పనులందు ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, మిత్రభేదములు, ప్రయాణముల యందు అలసట. సంతానమూలక విరోధములు ఏర్పడును. ధన దాన్య నష్టములు స్థానచలనములు.

జులై : ప్రయాణముల యందు జాగ్రత్త అవసరం, వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును. అనుకొన్న దానికన్నా ఖర్చులు అధికామగును, ఉద్యోగులకు పై అధికారుల నుండి ఒత్తిడి వృత్తి పరమైన సమస్యలు అకాల భోజనములు.

ఆగష్టు : గ్రహస్థితివలన అధిక శ్రమ, ఒత్తిడులు, అనవసర వ్యయము, శత్రుపీడ, శుభాకార్య ఆటంకములు, మాసాంతములో బంధుమిత్ర సమాగమము, కుటుంబమందు కొన్ని అనుకోని సంఘటనలు ఆశ్చర్య పరుచును. విద్యార్థులకు అధిక కష్టము వలన మంచి ఫలితాలు రాగలవు.

సెప్టెంబర్ : వృత్తి, ఉద్యోగాలలో అనుకోని ఇబ్బందులు. ధనలాభము, రావలసిన ధనము సమయానికి అందక పోవుట ఉద్యోగస్తుల్లో అనుకోని అవాంతరాలు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు బంధుమిత్రులతో వైరము కలుగును.

అక్టోబర్ : తరచు మానసిక ఆందోళన, అనుకోకుండా కొన్ని విషయముల యందు సమస్యలు, ఆదాయనికి మించి ఖర్చులు వివాహాది శుభ కార్యక్రమముల పనుల ఆటంకములు మాసం చివరన, ప్రారంభమున వున్న ఒత్తిడి కొంత తగ్గుముఖం పడుతుంది. కొంత అభివృద్ధి కనిపిస్తుంది.

నవంబర్ : మానసిక ఆందోళనలు వృత్తి వ్యాపారాలలో సామాన్య లాభాలు స్థిర చరాస్తి క్రయవిక్రయాలలో ఆటంకములు పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. మాసం చివరన శుభకార్య ప్రయత్నం మూలక లాభము చేపట్టిన పనులు యందు కార్య సిద్ది.

డిసెంబర్ :ముఖ్యమైన పనులలో శ్రమ అధికమైనప్పటికీ ఆదాయము వృద్ధి చెందును. శుభ కార్యక్రమాలకు ధన లాభము. ఋణ ప్రయత్నములు ఫలించును. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములు కలసి వస్తాయి ఆరోగ్య లాభము.

జనవరి : ఈ మాసము నందు మిశ్రమ ఫలితములు ఉన్నవి. ఇంటా బయట చికాకులు తగ్గుతాయి. ఆరోగ్య సమస్యలు పరిష్కారమౌతాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహారములు వాయిదా వేయుట మంచిది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయ.

ఫిబ్రవరి : కుటుంబ సభ్యులతో వివాహాది శుభ కార్యక్రమాలలో పాల్గొందురు. వృత్తి వ్యాపారమందు అభివృద్ధి, ఉద్యోగమున అధికారుల ఆధారాభిమానాలు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ ప్రముఖులకు మంచి అనువైన కాలము.

మార్చ్ : శుభాశుభ మిశ్రమ ఫలితములు ఉన్నవి. కుటుంబ వ్యవహారములందు ఆసక్తి పెరుగును, వ్యాపారములు అభివృద్ధి బాటలో సాగుతాయి. స్త్రీమూలక సమస్యలు పరిష్కారమౌతాయి. గృహమున శుభకార్యక్రమములు జరుగును.

పరిహారం :ఈ రాశివారు గురునకు జప దానాలు చేయించాలి, దత్తచరిత్ర పారాయణచేయుట మంచిది. శివాలయమున గురువారం రుద్రభిషేకం. శివ పంచాంక్షారీ పారాయణం చెయ్యాలి.

Next Story