శ్రీ క్రోధినామ సంవత్సర గోచార ఫలములు 2024 - 2025
ఈ సంవత్సర ప్రారంభంలో సోదర మైత్రి అధిక ధన యోగములు కలుగును. వృత్తి. ఉద్యోగము , వ్యాపారములలో ఆచ్చి తూచి అడుగు వేయాలి. ఆరోగ్యము బాగుపడుతుంది.
By జ్యోత్స్న Published on 9 April 2024 12:12 PM ISTశ్రీ క్రోధినామ సంవత్సర గోచార ఫలములు 2024 - 2025
మేష రాశి:
అశ్వని 1,2,3,4 పాదములు
భరణి 1,2,3,4 పాదములు
కృత్తిక 1వ పాదము
ఆదాయము-8, వ్యయం-14 రాజపూజ్యం-4, అవమానం-3
ఈ సంవత్సర ప్రారంభంలో సోదర మైత్రి అధిక ధన యోగములు కలుగును. వృత్తి. ఉద్యోగము , వ్యాపారములలో ఆచ్చి తూచి అడుగు వేయాలి. ఆరోగ్యము బాగుపడుతుంది.ఉద్యోగమునందు అధికారుల యొక్క మన్ననలు పొందగలరు. మాతృసౌఖ్యము కుటుంబాభివృద్ధి, ధనలాభము. బంధుమిత్రులతో శతృత్వము కలుగును. గృహమునందు శుభకార్యములు జరుగును. పాత బాకీలు తిరిగి వచ్చును. వ్యాపారము నందు, వృత్తియందు స్థిరత్వము కలుగును. వివిధ రూపములలో కష్టములు తొలగును. కుటుంబమునందు మనోవిచారములు తొలగి అనుకూలత యోగ్యములు కలుగును. ధనలాభములు, వృత్తి యందు స్థిరత్వము కలుగును. బంధువర్గ అనుకూలతలు పెరుగును. దీర్ఘకాలమునుండి ఉన్న కోర్టు కేసులు కొట్టి వేయబడును. దైవబలముచే అనుగ్రహము పొందగలరు. కొన్నిమార్లు అకాలభోజనము, మనోచాంచల్యము, ధననష్టములు కలుగును. దైవ బ్రాహ్మణ భక్తి, దూర ప్రయాణములు చేయుదురు. అభివృద్ధి, మనోల్లాసములు కలుగును. విద్యార్థులకు విద్యయందు ఉత్తీర్ణతలు కలుగును. నవంబర్ నెలలో భార్యతరపు ఆస్తి వ చ్చే అవకాశం ఉంది. సంఘము నందు గౌరవ ప్రతిష్ఠలు పెరుగును. ఆప్త బంధువులకు రోగ భయము కలుగును. మార్చి నెలలో వ్యాపార భాగస్వాములతో మోసపోయే అవకాశం ఉంది. ధర్మకార్యములలో పాల్గొంటారు.
వృషభ రాశి:
కృత్తిక 2,3,4 పాదములు
రోహిణి 1,2,3,4 పాదములు
మృగశిర 1, 2 పాదములు
ఆదాయము-2, వ్యయం-8, రాజపూజ్యం-7, అవమానం-3
ఈ ఏడాది శరీర సౌఖ్యములు, ఆరోగ్యమును, సంతోషములు కలుగును. వ్యవసాయము, వృత్తిలో స్థిరత్వము కలుగును. వృత్తి యందు వ్యాపారాభివృద్ధి విశేషముగా ధనలాభములు గృహము యందు శుభకార్యప్రాప్తి, తో పాటూ బంధుమిత్రులతో వైరము కూడా కలుగును. వాహన సౌఖ్యము ఉంది. పంటలు బాగా పండును. నూతన గృహ ప్రవేశములు చేయుదురు. అధికార యోగ్యము, సౌఖ్యములు కలుగును. శత్రునాశనము, మంత్ర సిద్ది కలిగి . గృహమునందు అనుకూలతలు పెరుగును. కొన్నిమార్లు అకాల కలహములు, భయములు కలుగును. బంధు మిత్రులతో ఉల్లాసముగా గడుపుతారు. అప్పులు రాబట్టగలరు. ప్రయత్నముల యందు విజయము పొంది సుఖముగా నుండును. జులై నెలలో ఇబ్బందులు, అగౌరవము, ధనవ్యయములు, మనోవేదనలు కలుగును. ఆప్తబంధువులకు అనారోగ్య వాతావరణము కలుగును. గృహమునందు శుభకార్యప్రాప్తి కలుగును. బంధుమిత్రులతో శతృత్వము కలుగును. మాతృసౌఖ్యములు కలుగును. విద్యయందు అనుకూలత, ఉద్యోగప్రాప్తి కలుగును. సంఘములో గౌరవము పెరుగును. దైవ అనుగ్రహము పొందుదురు. దాయదుల సఖ్యత పెరుగును. అభివృద్ధి, మనోల్లాసములు కలుగును. సోదరీ, సోదరులతో ఉల్లాసముగా గడుపుతారు. వ్యాపారము నందు కొంత ధననష్టము కలుగును. అకస్మాత్తుగా ప్రయాణములు చేయవచ్చు. మంచి ఆలోచనలు పెరుగును ఋణవిముక్తులు అవుతారు. చిరకాలము నుండి కోర్టులో ఉన్న కేసులు కొట్టి వేయబడును. సంఘములో గౌరవము పెరుగును. వృత్తి యందు స్థిరత్వము పెరుగును.
మిధునరాశి:
మృగశిర 3, 4 పాదములు
ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు
పునర్వసు 1, 2, 3 పాదములు
ఆదాయము-5, వ్యయం-5 రాజపూజ్యం-3, అవమానం-6
ఈ సంవత్సర ప్రారంభంలో శరీర అనారోగ్యం మనస్తాపము కలిగిస్తుంది. గృహమందు శుభకార్యప్రాప్తి, అభివృద్ధి కలుగును. కుటుంబ సమస్యలు ప్రారంభమవును. సంతానాభివృద్ధి జరుగును. ఉద్యోగప్రాప్తి ద్వారా సంఘములో కీర్తి పెరుగును. నూతన వాహన ప్రాప్తి కలుగును. జూన్ మాసంలో విద్యాభివృద్ధి సంతోషములు సంభవించును. సంతానము గృహప్రవేశము చేయుట, బంధుమిత్ర శతృత్వము, ఆటంకములు కలుగును. సంఘములో గౌరవము సన్నగిల్లును. వ్యవసాయము నందు వ్యాపారము నందు ధననష్టము, చేయు వృత్తియందు స్థిరత్వమేర్పడును. వృత్తియందు, వ్యాపారమునందు ధనలాభములు కలుగును. అయితే శతృవృద్ధి, నరదిష్టి పెరుగును.కానీ కొంత కాలానికే దైవానుగ్రహము వలన సుఖములను అనుభవించగలరు. ధనలాభములు, సర్వత్రా ధనలాభములు, మంచివారితో పరిచయము. విద్యయందు ఉన్నతశ్రేణిలో నుండుట, కుటుంబాభివృద్ధి, పూర్తి అన్యోన్యతలు కల్గును. వృత్తియందు కలహములు, చెడు ఫలములు, వాహన గండములు, ధన నష్టములు ఆప్త బంధువులకు రోగములు, భాతృవృద్ధి, కుటుంబము నందు సఖ్యతలు పెరుగును. జనవరినెలలో గృహమునందు ఆడంబరముగా శుభకార్యము చేయుట. వృత్తి, వ్యాపారములయందు ధనలాభములు కలుగును.కానీ బంధుమిత్రుల వలన ధననష్టములు కలుగును. కుటుంబ సౌఖ్యములు, శరీర సౌఖ్యములు కలుగును. పుత్రుల విద్యయందు అనుకూలత ధనధాన్యవృద్ధియు మొదలగు శుభములు పొందగలరు.
కర్కాటకరాశి:
పునర్వసు 4 పాదము
పుష్యమి 1, 2, 3, 4 పాదములు
ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
ఆదాయము14, వ్యయం-2 రాజపూజ్యం -6, అవమానం-6
ఈ ఏడాది ధనలాభములు, సర్వధనలాభములు కలుగును. వృత్తియందు అనుకూలతలు ఉద్యోగమునందు అభివృద్ధి, వృత్తి వ్యాపారములయందు అనుకూలతలు కలుగును. ఉద్యోగస్తులకు ప్రమోషన్లుతో పాటూ స్థానచలనములు కూడా కలుగును. కానీ మనోచాంచల్యము, అకాల భోజనము తప్పదు. కుటుంబమునందు సమస్యలు ఏర్పడును. విద్యార్థులు ఉత్తీర్ణతలు సాధిస్తారు.కొద్దికాలానికే సోదర సోదరీలతో సఖ్యత పెరుగును. శారీరక శ్రమ పెరుగును. గృహమునందు శుభకార్యములు జరుగును. వృత్తియందు అభివృద్ధి, బంధుమిత్ర సమాగమనము కలుగును. వ్యాపారములందు అనుకూలతలు కలుగును.
జులై నెలలో ఋణబాధా విముక్తి, బంధుమిత్ర దర్శనములు సంభవించును. ఉద్యోగమునందు పూర్తి అనుకూలతలు కలుగును. ధన, కుటుంబ వృద్ధి కలుగును. మనోధైర్యము, విద్యాగోష్ఠి కలుగును. వృత్తి, వ్యాపారముల యందు అభివృద్ధి కలుగును. గృహమునందు అనుకూలతలు పెరుగును. రావలసిన ధనము వస్తు రూపేణ దైవారాధన వలన ప్రశాంతముగా యుందురు.
జనవరి నెలలో గృహమునందు ఆడంబరముగా శుభకార్యములు చేస్తారు. ధనధాన్యవృద్ధియు మొదలగు శుభములు పొందగలరు. ధనప్రాప్తి ప్రయత్నకార్యసిద్ధి అనుకూలతలు కలుగును. రాజకీయ వ్యవహారములయందు అభిరుచి కలుగును. అకస్మాత్తుగా ప్రయాణములు చేస్తారు. శరీరమునందు ధారుఢ్యము తగ్గును. భాతృసౌఖ్యము, ఋణవిముక్తి బాధా నివారణలు కలుగును. సంతానము, విద్య యందు రాణించును. నరదృష్టి పెరుగును. నూతన వ్యాపారములు ప్రారంభించుట జరుగును.
సింహరాశి:
మఖ 4 పాదములు
పుబ్బ 1, 2, 3, 4 పాదములు
ఉత్తర 1వ పాదము
ఆదాయము-2, వ్యయం-14 రాజపూజ్యం-2, అవమానం-2
సంవత్సర ప్రారంభంలో దూరాలోచనలు, మంచి అనుకూలతలు కలుగును. గృహమునందు శుభకార్యము చేయుదురు. వ్యాపారమునందు మోసము, ధననష్టము కలుగును. భాతృసౌఖ్యము కలిగి రుణవిముక్తి కలుగును. ధనధాన్యాదులు కలుగును. వృత్తియందు అనుకూలతలు, విద్యాభివృద్ధి కలుగును. పుత్ర సంతానము అభివృద్ధి చెందును. సంతానమునందు విద్యయందు పరిపూర్ణతలు కలుగును. వృత్తి, వ్యాపారముల యందు పూర్తిగా అనుకూలములు కలుగును. ఋణబాధ విముక్తి శత్రువుపై పై చేయి సాధించెదరు. ఉద్యోగముల యందు ప్రమోషన్లు కలుగును. గృహమునందు శుభకార్యప్రాప్తి, వృత్తియందు ప్రమోషన్లు, అజీర్ణ వ్యాధి వలన బాధపడుదురు. విద్యయందు ఉత్తీర్ణత కలుగును.గృహము నందు వివాహాది శుభకార్యములు జరుగును. కుటుంబ సౌఖ్యములు, అభివృద్ధియు కలుగును. స్థిరాస్తియోగ్యతలు, ధనలాభములు, సంభవించును. అక్టోబర్ లో వాహన గండములు కలవు జాగ్రత్తపడండి. అకారణ ప్రయాణములు ఆటంకములు కలుగును. వృత్తియందు అనుకూలతలు, నూతనవ్యాపారాభివృద్ధి కలుగును. స్థిరాస్తి యోగ్యతలు అనుకూలతలు కలుగజేయును. శారీరక బాధలు కలిగి ఆరోగ్యము కుంటుపడును. జనవరిలో విద్యా, ఉద్యోగములందు అధికార యోగ్యతలు కలుగును. అభివృద్ధి, ధనలాభములు, విశేష సౌఖ్యము కలుగును. వ్యాపారము నందు స్థిరత్వము, వ్యాపారములందు అనుకూలతలు కలుగును. నరదృష్టి అభివృద్ధికి ఆటంకములు కలుగజేయును. గృహమునందు శుభకార్యప్రాప్తి కలుగును. కొన్ని మార్లు సంఘములో కీర్తి సన్నగిల్లును. కోర్టు కేసులయందు అనుకూలతలు కలుగును. కుటుంబవృద్ధి కలుగును.మార్చి నెలలో పుత్రుల సంతానము అభివృద్ధి చెందును.
కన్యారాశి :
ఉత్తర 2, 3, 4 పాదములు
హస్త 1, 2, 3, 4
చిత్త 1, 2 పాదములు
ఆదాయము-5, వ్యయం-5 రాజపూజ్యం-5, అవమానం-2
సంతానము అభివృద్ధి పొందుట జరుగును. పూర్తి అనుకూలతలు కలుగును. అభివృద్ధి భోగభాగ్యములు కలుగును. పిత్రార్జిత ధనము వృద్ధి చెందుట, అనుకూలతలు కలుగును. వాహన సౌఖ్యములు కలుగును. శతృత్వము కలుగును. రావలసిన బాకీ వచ్చును. ఉద్యోగములందు ప్రమోషన్లు కలుగును. వ్యాపారోద్యోగముల యందు కీర్తి, ధనలాభములు కల్గును.
జూన్ నెలలో గృహమునందు నూతన శుభకార్యప్రాప్తి జరుగును. కుటుంబ రుణబాధలు తగ్గును. వృత్తి యందు అభివృద్ధి కల్గును. దూర ఆలోచనలు కలిగి మంచి అనుకూలతలు పొందును. పోయినటువంటి ధనము వచ్చును. ధనాభివృద్ధి కలుగును. దైవదర్శనం వలన ధనలాభము కలిగి సుఖముగా నుండును.విద్య యందు అనుకూలత స్థిరత్వము కలుగును. ధనలాభము కుటుంబవృద్ధి, చిరకాలము నుండి కోర్టులో కేసులు కొట్టివేయును. ఉద్యోగులకు ప్రమోషన్లు కలుగును. స్థిరాస్తి పంపకములు, ధనలాభములు అనుకూలత జరుగును. వృత్తి వ్యాపారము నందు స్థిరత్వము పొంది ధనలాభములు ప్రారంభమగును. బంధుమిత్రుల ద్వారా అనుకూలత పొందురు. ఉద్యోగమునందు లాభము. సోదర సఖ్యతలు పెరిగి సంతోషముగా నుందురు. విద్యయందు అనుకూలత స్థిరత్వము కలుగును. ఉద్యోగములయందు అధికారులతో మన్ననలు పెరుగును. మాతృసౌఖ్యములు కలుగును. మాతృసౌఖ్యము కలుగును. మనస్తాపము కలిగి ఉందురు. జనవరి నెలలో ఉద్యోగములందు అనుకూలతలు పెరుగును. అభివృద్ధికై నిర్ణయములు చేస్తారు. దూర ప్రయాణములు చేస్తారు. సజ్జన సాంగత్యము పెరుగును. సంఘమునందు అభివృద్ధి పెరుగును. సంతానాభివృద్ధి విద్యయందు ఉత్తీర్ణత కలుగును
తులారాశి:
చిత్త 3,4 పాదములు
స్వాతి 1, 2, 3, 4 పాదములు
విశాఖ 1, 2, 3 పాదములు
ఆదాయము-2, వ్యయం-8 రాజపూజ్యం-1, అవమానం-5
ఈ ఏడాది మీ సంతానము అభివృద్ధి పొందును. పూర్తి అనుకూలతలు కలుగును. పిత్రార్జితము వృద్ధి చెందును. ఉద్యోగ, వ్యాపారములందు కీర్తి, ధనలాభములు కలుగును. బంధు వైరములు కలుగును. భార్యతరపున ఆస్తి రాగలదు. వృత్తియందు స్థిరత్వము ఏర్పడును. శతృవృద్ధి, మనస్తాపములు కలుగును. జ్ఞాతి విరోధములు సంభవించును. ప్రయత్నకార్యములందు జయము కలుగును. సోదరమైత్రి కుటుంబ సమస్యలు నివారణ కలుగును. శత్రువుల అభివృద్ధి కలుగును. తల్లికి అనారోగ్యము. అవసరం లేని ప్రయాణాల వల్ల ధన నష్టము కలుగును. వృత్తి యందు స్థిరత్వము, కుటుంబ సౌఖ్యములుకలుగును. విద్యయందు విద్యార్థులు రాణించరు. రావలసిన ధనము రాగలదు. వృద్ధి పొందగలరు. ధర్మకార్యములయందు పాల్గొంటారు.
డిసెంబర్ నెలలో మనస్తాపము, భయము, అకాలభోజనము, శతృత్వము, వ్యాపారములయందు సమస్యలు కలుగును. జనవరి నెలలో ఋణబాధ, స్థిరాస్తి అమ్మటానికి అవకాశం ఉంది. రాను రాను సమస్యలు తగ్గి . ధనలాభములు కలుగును. అనుకూలతలు పెరుగును. ఉద్యోగమునందు పై అధికారుల సహాయములు అందును. పిత్రార్జిత ధనము వృద్ధి చెందును. స్థిరాస్తి యోగ్యతలు, ధనలాభములు మనఃశాంతి కలుగును. సంవత్సరం చివరిలో శారీరక బలము పెరుగుతుంది. ఋణవిముక్తి కలిగి శతృవులపై విజయము సాధించెదరు. భాతృవృద్ధి , వృత్తి, వ్యాపారములయందు అనుకూలతలు పెరుగును. పుత్రుల యొక్క విద్యాభ్యాసము అభివృద్ధి చెందును. ఆయాచితముగా ధనలాభములు కలుగును. సర్వకార్యముల యందు విజయము పొందగలరు. మాతృసౌఖ్యము కలుగును. చేతి వృత్తి యందు స్థిరత్వము కలుగును.
వృశ్చికరాశి:
విశాఖ 4 పాదము
అనూరాధ 1,2,3,4 పాదములు
జ్యేష్ఠ 1,2,3,4 పాదములు
ఆదాయము-8, వ్యయం-14 రాజపూజ్యం-4, అవమానం-5
ఈ ఏడాది ఆరోగ్య చింతన, మనో చాంచల్యములు కలుగును. బంధుమిత్రుల వైరము కలుగును. రుణవిముక్తి కలుగును. మాతృసౌఖ్యము కలిగియుందురు. రావలసిన ధనము రాగలదు. సంతానాభివృద్ధి, విద్యయందు ఉత్తీర్ణత కలుగును. వృత్తియందు ప్రమోషన్లు కలుగును. గృహమునందు శుభకార్యప్రాప్తి కలుగును. ఋణవిముక్తి కలుగును. ఉద్యోగులకు అధికార యోగ్యతలు కలుగును. ధనలాభములు కుటుంబవృద్ధి కలుగును. శరీర శ్రమ కుటుంబ కలహములు కలుగును.
వృత్తి వ్యాపారములందు అనుకూలతలు ధనలాభములు కలుగును. విద్యయందు పరిపూర్ణతలు కలుగును. వ్యాపారములయందు అభివృద్ధి నిర్ణయము కలుగును. ధనవ్యయము, ఆప్త బంధువులకు అనారోగ్యము కలుగును. పుత్ర సంతానము అభివృద్ధి చెందగలదు. వృత్తి, వ్యాపారములయందు జయములు ధనలాభములు కలుగును. దూర ఆలోచనలు కుటుంబ వృద్ధి చెందును. నవంబరులో అగ్ని భయము వలన నష్టములు కలుగును. అనారోగ్యము చింతన మనోచాంచల్యము కలుగును.కానీ ఉద్యోగలాభము వ్యాపారములందు కీర్తి, ధనలాభము కలుగును. జనవరి నెలలో బంధుమిత్రుల వలన ధనము రాగలదు. కుటుంబ సౌఖ్యము పెరుగును. నరదృష్టి పెరిగి శతృవృద్ధి క్షీణించును. ప్రశాంతముగా నుండగలరు. దైవభక్తి పెరిగి, దైవారాధనలు చేయుదురు. పుత్రులు విద్యయందు రాణించగలరు. దూరప్రయాణములు చేయుదురు.మార్చి నెలలో గృహమునందు శుభకార్యప్రాప్తి కలుగును.రావలసిన బాకీలు చేతికందును. ధనలాభములు అభివృద్ధి కలుగును. ఉద్యోగములందు అధికారుల మన్ననలు పొందెదరు.
ధనస్సురాశి :
మూల 1, 2, 3, 4 పాదములు
పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు
ఉత్తరాషాఢ 1 పాదము
ఆదాయము-11, వ్యయం-5 రాజపూజ్యం -7,అవమానం -5
ఈ సంవత్సరం లో వృత్తి వ్యాపారములయందు ధనలాభము పొందగలరు. నూతనముగా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేస్తారు. గృహము నందు శుభకార్య ప్రాప్తి చేయుదురు. అనారోగ్య సమస్యలు ప్రారంభమగును. కుటుంబ చిక్కులు, చేసేపనిలో ఆలస్యం వల్ల మనోవిచారములు కలుగును. సంతానవృద్ధి విద్యయందు ఉత్తీర్ణతలు కలుగును. ఆరోగ్యము, ఉత్సాహము బంధుమిత్ర దర్శనము కలుగును. తండ్రి సోదరులతో వైరము. ఆగస్టు నెలలో ప్రయాణ మధ్యలో వాహనముల ఇబ్బందులు కలుగును. రాని బాకీలు వసూలు అగును. ఉద్యోగ ప్రమోషన్లు కలుగును. నరదృష్టి కుటుంబ సమస్యలు కలుగును. వృత్తి వ్యాపారముల యందు అనుకూల వాతావరణము కలుగును. భాతృ సౌఖ్యములు కలుగును. స్థానచలనము స్థిరత్వము కలుగును.
నవంబర్లో చోర భయములు, వాహన భయములు, ధననష్టము కలుగును. విద్యయందు అభివృద్ధి, ఉద్యోగప్రాప్తి కలుగును. శరీర అనారోగ్యత ఇబ్బంది పెడుతుంది. బంధు విరోధములు నష్టములు కలుగును. స్థిరాస్తి, కుటుంబ ఆస్తి పెరుగును. వ్యాపారమునందు అభివృద్ధి అనుకూలతలు పెరుగును. శుభాశుభములు సమానముగా నుండును. వ్యాపార చలనములు, కష్టములు వాటిల్లును. వ్యాపార భాగస్వాములచే ధననష్టము కలుగును.మార్చి లో బంధు మిత్రుల నుండి రావలసిన ధనము రాగలదు. శతృవృద్ధి, నరదృష్టి సంప్రాప్తమగును. వృత్తియందు, వ్యాపారమునందు అనుకూల వాతావరణము కలుగును. వృధా వ్యయము చేయుదురు. పుత్రులు విద్యయందు రాణించగలరు. దైవారాధనలు చేయుట వలన ప్రశాంతముగా నుండగలరు. భాతృసౌఖ్యము, ఋణవిముక్తి బాధ నివారణ కలుగును.
మకరరాశి:
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు
శ్రవణం 1, 2, 3, 4 పాదములు
ధనిష్ట 1, 2 పాదములు
ఆదాయము-14, వ్యయం-14 రాజపూజ్యం-3, అవమానం-1
ఈ సంవత్సరంలో వ్యాపారముల యందు ధనలాభములు అభివృద్ధి కలుగజేయును. ఉద్యోగములయందు అధికారుల మన్ననలు పొందుట జరుగును. ఆరోగ్య చింతన మనోచాంచల్యములు కలుగును. గౌరవాభివృద్ధి కలుగును. మాతృసౌఖ్యములు, సోదర మైత్రి సంతోషములు కలుగును. వృత్తి యందు అనుకూలతలు లేకుండుట జరుగును. కుటుంబమునందు అభివృద్ధి కలుగును. స్థిరాస్తి లభించుట, పిత్రార్జిత ధనము వచ్చును. అగ్నివలన నష్టములు కలుగును. గృహము నందు శుభకార్యప్రాప్తి కలుగును. రాని బాకీలు వసూలు అగును. విద్యయందు స్థిరత్వము, ఉద్యోగప్రాప్తి కలుగును.
డిసెంబర్ నెలలో శరీర శ్రమ, ఆపదలు సంభవించును. మనో విచారములు కలుగును. ప్రయత్నకార్యములు చెడిపోవును. సుదూర ప్రయాణములు చేయుట, ప్రమోషన్లు అభివృద్ధి కుటుంబ సౌఖ్యములు కలుగును. ధనాదాయము పెరుగుట, అభివృద్ధి కలుగును. ధనలాభములు, కుటుంబాభివృద్ధి కలుగును. సోదరితో సఖ్యతలు పెరుగును. బంధు మిత్ర విరోధములు కలుగును. ఫిబ్రవరిలో మీ ప్రథమ సంతాన అనారోగ్యము కలుగును వ్యాపారములందు అభివృద్ధి పథకములు ఏర్పడును. దైవ బ్రాహ్మణ భక్తి అనుగ్రహములు అనుకూలించును. పూర్వము అప్పుగా ఇచ్చిన ధనము రాగలదు. శరీర పీడయు, ఉత్సాహ భంగము కలుగును. వృత్తి, ఉద్యోగములందు అనుకూలతలు పెరుగును. ప్రయత్నకార్యములందు ధనలాభములు కలుగును. కుటుంబమునందు అభివృద్ధి కలుగును. ధనమునందు అనుకూలతలు, సుఖభోజన ప్రాప్తి కలుగును. సుఖసంతోషములు కలుగుట, మంచి ఆలోచనలు కలుగును. గృహమునందు శుభకార్యప్రాప్తి కలుగును.
కుంభరాశి:
ధనిష్ట 3, 4 పాదములు
శతభిషం 1, 2, 3, 4 పాదములు
పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు
ఆదాయము-14, వ్యయం-14 రాజపూజ్యం-6, అవమానం-1
ఈ ఏడాది మీ ప్రయత్నకార్యములందు జయము కలుగును. శారీరక శ్రమ కుటుంబ కలహములు తప్పవు. . గృహ నిర్మాణ పనులు ఆగిపోవును. రావలసిన ధనము రాగలదు. వృద్ధి పొందగలరు. గృహమునందు శుభకార్యప్రాప్తి, సంతానవృద్ధి, విద్యయందు ఉత్తీర్ణతలు కలుగును. ధర్మకార్యములందు పాల్గొనెదరు. వాహన సౌఖ్యము కలుగును. అధికారప్రాప్తి, ధనలాభములు సంభవించును. జూన్లో ఆయాచితముగా ధనలాభములు కలుగును. విద్యయందు స్థిర యోగము కలుగును. ఉద్యోగ ప్రాప్తి కలుగును. సంతానాభివృద్ధి కలుగును. నరదృష్టి, కుటుంబ సమస్యలు కలుగును. గృహనిర్మాణములు, శుభకార్యప్రాప్తి కలుగును. రాని బాకీలు వసూలు అగును. ఋణబాధలు, స్థిరాస్తి అమ్ముట, అధికార వత్తిడి కొన్నిమార్లు కలుగును.
నవంబర్నెలలో ధర్మకార్యముల యందు పాల్గొనెదరు. నరదృష్టి, బంధుద్వేషము కలుగును. గృహమునందు సౌఖ్యము కలుగును. వృత్తి వ్యాపారముల యందు అనుకూలతలు కలుగును. సంతానాభివృద్ధి, అనుకూలతలు ఏర్పడును. విద్యయందు పరిపూర్ణతలు, ఉద్యోగప్రాప్తి కలుగును. ధర్మకార్యములయందు పాల్గొంటారు. వ్యవసాయమునందు వృత్తియందు స్థిరత్వము పొందుదురు. మార్చిలో తండ్రి సోదరులతో వైరములు, ధననష్టములు ఉన్నప్పటికీ అన్నింటికీ తట్టుకొని గృహమునందు శుభకార్యము చేయగలరు. . రాని బాకీలు వసూలు అగుట, ధనలాభములు కలుగును. విద్యయందు స్థిరత్వము, ఉద్యోగప్రాప్తి కలుగును. పరోపకార్యము చేయును. ఋణబాధలు తీరును. నరదృష్టి కుటుంబ సమస్యలు కలుగును. మార్గమధ్యమందు వాహనములు ఇబ్బంది కలుగును. స్థానచలనములు, స్థిరత్వము కలుగును. ఆయాచితముగా ధనలాభములు కలుగును. సంఘములో గౌరవము కలుగును.
మీనరాశి :
పూర్వాభాద్ర 4 పాదము
ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు
రేవతి 1, 2, 3, 4 పాదములు
ఆదాయము-11, వ్యయం-5 రాజపూజ్యం-2, అవమానం-4
ఈ ఏడాది మీకు వృత్తియందు ప్రమోషన్ ఖచ్చితంగా లభించును. గృహమునందు శుభకార్యప్రాప్తి కలుగును. ఋణవిముక్తి కలుగును. శతృజయము కలుగును. తల్లికి అనారోగ్యము కలుగును. అధికార ప్రాప్తి, ధనలాభములు కలుగును. గౌరవ అభివృద్ధి కలుగును. సంతానాభివృద్ధి, విద్యయందు ఉత్తీర్ణతలు కలుగును. రాజకీయ వ్యవహారములందు అభిరుచిగా మాట్లాడును. వృత్తియందు, వ్యాపారములందు ధనలాభము కలుగును. వాహన భంగములు కలుగును. రావలసిన ధనము రాగలదు. వృద్ధి పొందగలరు. మాతృసౌఖ్యము కలుగును. వ్యాపారములో వైరములు కలుగును. పిత్రార్జిత ధనము వృద్ధి చెందును. అనుకూలతలు కలుగును. అధికార ప్రాప్తి ధనలాభములు సంభవించును. వాహన సౌఖ్యములు కలుగును. అనారోగ్యత చింతన కలుగును. వృత్తియందు ఉద్యోగము, ప్రమోషన్లు లభించును. ఉద్యోగ అభివృద్ధి కలిగి సంతోషము కలుగును. ఆగష్టులో భార్య తరపున ఆస్తి కలసి వచ్చును. విద్యయందు అభివృద్ధి కలుగును. ప్రయత్నకార్యముల యందు జయము కలుగును. శిరోవేదనము వలన బాధ కలుగును. బంధుమిత్రుల వలన పోయిన ధనము వచ్చును. వ్యాపార భాగస్వాములందు విరోధము పెరుగును. ఆరోగ్య వృద్ధి కలుగును. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగును. పుత్రుల అభివృద్ధి చూసి గర్వపడుట జరుగును. వాహన సౌఖ్యములు కలుగును. వివిధ రూపములలో వృద్ధి జరుగును. సంవత్సరం చివరిలో కుటుంబ సమస్యలు పరిష్కారం కాగలవు. ధనలాభములు అభివృద్ధి అనుకూలతలు కలుగును. ప్రయత్నకార్య సిద్ధి, విద్యాభివృద్ధి కలుగును. శుభాశుభములు సమానముగా నుండును. వ్యాపారములందు ధనలాభములు కలుగును. విద్యయందు అనుకూలతలు అభివృద్ధి కలుగును.