కుబేర యోగంతో అంతులేని ఐశ్వర్యం.. ఈ యోగాన్ని పొందడం ఎలా?
జాతకంలో ఈ యోగం లేకపోయినా కొన్ని పరిహారాలతో కుబేరుడి అనుగ్రహం పొందవచ్చు. రోజూ ఇంట్లో ఉత్తర దిశలో 'కుబేర యంత్రం'...
By - అంజి |
కుబేర యోగంతో అంతులేని ఐశ్వర్యం.. ఈ యోగాన్ని పొందడం ఎలా?
జాతకంలో ఈ యోగం లేకపోయినా కొన్ని పరిహారాలతో కుబేరుడి అనుగ్రహం పొందవచ్చు. రోజూ ఇంట్లో ఉత్తర దిశలో 'కుబేర యంత్రం' ఉంచి పూజిస్తే ఆర్థిక అడ్డంకులు తొలగుతాయి. కుబేర ముద్రను ధ్యానంలో ఉపయోగించడం, లక్ష్మీ కుబేర మంత్రాన్ని 108 సార్లు పఠించడం శ్రేయస్కరం. ఆకుపచ్చ రంగు వస్తువులను దగ్గర ఉంచుకోవడం, పేదలకు దానధర్మాలు చేయడం ద్వారా కుబేర శక్తిని ఆకర్షించవచ్చు. మనసులో దృఢ సంకల్పం, శ్రమ ఉంటే ఈ యోగం తప్పక లభిస్తుంది.
కుబేర యోగం అంటే?
జ్యోతిష శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన ధన యోగాల్లో 'కుబేర యోగం' ఒకటి. పేరుకు తగ్గట్టే ఈ యోగం ఉన్న వ్యక్తిపై కుబేరుడి అనుగ్రహం మెండుగా ఉంటుంది. సాధారణంగా రాజయోగాలు అధికారాన్ని ఇస్తే.. కుబేర యోగం అంతులేని ఐశ్యర్యాన్ని, భౌతిక సుఖాలను ప్రసాదిస్తుంది. ఇది కేవలం డబ్బు సంపాదించడమే కాదు, సంపాదించిన ధనాన్ని స్థిరంగా ఉంచుకోవడాన్ని సూచిస్తుంది. ఈ యోగం ఉన్నవారు సమాజంలో అత్యంత ధనవంతులుగా గుర్తింపు పొందుతారు.
పుట్టుకతో కుబేర యోగం ఎలా?
జాతక చక్రంలో ధన స్థానమైన 2వ ఇల్లు, లాభా స్థానమైన 11వ ఇల్లు చాలా కీలకం. ఈ 2 స్థానాల అధిపతులు తమ స్వక్షేత్రాల్లో లేదా ఉచ్చ స్థితిలో ఉండి, ఒకరినొకరు వీక్షించుకున్నా లేదా కలిసి ఉన్నా కుబేర యోగం సిద్ధిస్తుంది. ముఖ్యంగా గురు, శుక్ర, గ్రహాల అనుకూలత ఈ యోగానికి బలాన్ని ఇస్తుంది. లగ్నాధిపతి బలంగా ఉండి ఎనిమిది, పన్నెండో స్థానాలతో శుభ సంపద కలిగి ఉన్నప్పుడు కూడా ఈ యోగం ఏర్పడి వ్యక్తిని ధనవంతుడిని చేస్తుంది.
కుబేర యోగం ఉంటే?
కుబేర యోగం ఉన్నవారికి అదృష్టం ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. వీరు ఏ వ్యాపారం చేపట్టినా అందులో భారీ లాభాలు గడిస్తారు. చిన్న వయసులోనే సొంత ఇల్లు, వాహనాలు, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వీరికి పూర్వీకుల ఆస్తి కలిసి రావడమే కాకుండా, లాటరీ లేదా షేర్ మార్కెట్ వంటి మార్గాల ద్వారా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు అనేవి వీరి జీవితంలో ఉండవు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు లభిస్తాయి.