దిన ఫలితాలు: చిన్ననాటి మిత్రులతో ఒక వ్యవహారంలో వివాదాలు కలుగుతాయి

వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం వలన నష్టాలు తప్పవు.

By జ్యోత్స్న  Published on  8 July 2024 6:14 AM IST
horoscope, astrology, Rasiphalalu

దిన ఫలితాలు: చిన్ననాటి మిత్రులతో ఒక వ్యవహారంలో వివాదాలు కలుగుతాయి

మేషం:

వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం వలన నష్టాలు తప్పవు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమౌతుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. గృహ వాతావరణం కొంత చికాకుగా ఉంటుంది. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు.

వృషభం:

సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరిగినప్పటికీ ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి.

మిధునం:

దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. శుభకార్యాల కొరకు వృధా వ్యయం చేస్తారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.

కర్కాటకం:

దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యల నుంచి కొంత బయటపడతారు. వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.

సింహం:

చిన్ననాటి మిత్రులతో ఒక వ్యవహారంలో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి కావు. అవసరానికి చేతిలో ధనం నిలువ ఉండదు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చేజారుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

కన్య:

దూరప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. ఉద్యోగస్తులకు విధులలో ఆటంకాలు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

తుల:

అన్ని వైపుల నుండి లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్య విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. సమాజంలో పెద్దల ఆదరణ కలుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపార విషయమై ఇతరుల సలహాలు అంతగా కలిసిరావు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది.

వృశ్చికం:

ఇంటా బయట ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ప్రయాణాలలో వాహన విషయంలో ఇబ్బందులుంటాయి. దైవానుగ్రహంతో కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

ధనస్సు:

ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. నూతన రుణయత్నాలు సాగిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో వాదనకు వెళ్లకపోవడం మంచిది. వాహన ప్రయాణాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

మకరం:

చుట్టు పక్కల వారితో ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆకస్మిక ధన లబ్ది కలుగుతుంది. వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి. ఉద్యోగమున స్థిరత్వం కలుగుతుంది.

కుంభం:

ఇంటా బయట విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు అందుతాయి.

మీనం:

సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ధన పరమైన ఇబ్బందులు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలలో కొంత నిరాశ కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Next Story