వీరు లాభాలు పొందే అవ‌కాశం

Daily horoscope for 9-12-2022.ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.

By జ్యోత్స్న  Published on  9 Dec 2022 1:47 AM GMT
వీరు లాభాలు పొందే అవ‌కాశం

మేషం: ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార విషయంలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. ఇంటాబయట మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి.

వృషభం: నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. పాతరుణాలు తీర్చగలరు. వ్యాపార విస్తరణకు పెట్టుబడులు అందుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

మిధునం: వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మిత్రులతో చిన్నపాటి మాటపట్టింపులు కలుగుతాయి. అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఇంటాబయట నూతన సమస్యలు తప్పవు. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

కర్కాటకం: వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ హోదా పెరుగుతుంది. విద్యార్థుల నూతన విద్యావకాశములు లభిస్తాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

సింహం: ఉద్యోగస్తులకు పనిఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆర్థిక వాతావరణం ఆశించిన విధంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య: వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి.

తుల: నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అకారణ వివాదాలు కలుగుతాయి.

వృశ్చికం: సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు.

ధనస్సు: వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారులు అనుగ్రహంతో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలో ఆచరణలో పెడతారు. శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటా బయట మానసిక ప్రశాంతత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.

మకరం: వ్యాపార ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి. బంధు వర్గంతో విభేదాలు కలుగుతాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. దైవ చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

కుంభం: వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలుచేస్తారు.

మీనం : వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. పాతమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

Next Story