ఈ రాశివారికి ఆర్థికంగా అనుకూలం
Daily Horoscope for 8-12-2022.భాగస్వామ్య వ్యాపారాలు మధ్య స్వల్ప విభేదాలు ఉంటాయి.
By జ్యోత్స్న Published on 8 Dec 2022 1:43 AM GMTమేషం: భాగస్వామ్య వ్యాపారాలు మధ్య స్వల్ప విభేదాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో చికాకులు తప్పవు. వాహనాలు ప్రయాణ విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్ధిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ఉద్యోగులకు నూతన సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
వృషభం: నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది.
మిధునం: వ్యాపారమున ఎంతగా శ్రమించినా ఫలితం లభించక నిరాశ కలుగుతుంది. గృహమున పెద్దల ఆరోగ్య విషయం ఆందోళన కలిగిస్తుంది. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇతరులకు ధన వ్యవహారాలలో మాట ఇవ్వకపోవడం మంచిది.
కర్కాటకం: మొండి బాకీలు తీర్చగలుగుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రారంభించిన పనులు నిదానంగా సాగుతాయి.
సింహం: ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు కలసివస్తాయి. విలువైన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
కన్య: ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు. వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. రాజకీయ సభ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్ధిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది.
తుల: దూర ప్రాంతాల బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపారమున భాగస్థులతో జాగ్రత్తగా మాట్లాడటం మంచిది.
వృశ్చికం: నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగమున కొంత అనుకూలత కలుగుతుంది. దాయాదులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది.
ధనస్సు: కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం ఋణాలు వసూలవుతాయి. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి ఉద్యోగమున ఆశించిన స్థానచలనాలు కలుగుతాయి.
మకరం: అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అదనపు పని బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుంభం: ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మరి సహాయ పడతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి తెలివిగా బయటపడతారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
మీనం: సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సహాన్నిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఎదురైనా సమస్యలు తెలివిగా అధిగమిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది.