నేటి దినఫలాలు.. వీరికి బాధ.. వారికి సంతోషం
Daily horoscope for 30-11-2022.వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
By జ్యోత్స్న Published on 30 Nov 2022 1:51 AM GMTమేషం: వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. పాతమిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి.
వృషభం: నూతన వాహన యోగం ఉన్నది.స్థిరస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం కలుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి.
మిధునం:ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.
కర్కాటకం: పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం ఉండదు. వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదాలు మరింత చికాకు కలిగిస్తాయి.
సింహం: ఇంటాబయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.
కన్య: దూరపు బంధువులను కలుసుకుని వివాహ విషయమై చర్చ చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడగలుగుతారు.
తుల: దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి.
వృశ్చికం: ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. శ్రమతో కూడిన దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
ధనస్సు: వ్యాపారాల విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగమున మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.
మకరం: కుటుంబ సమస్యలు వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
కుంభం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. సంతానం విద్యా విషయాల సంతృప్తినిస్తాయి. వృత్తి వ్యాపారాలు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
మీనం: చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.