నేటి దిన ఫ‌లాలు.. నిరుద్యోగుల‌కు ఉద్యోగ అవ‌కాశాలు

Daily Horoscope for 30-09-2022. బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి

By జ్యోత్స్న  Published on  29 Sep 2022 11:30 PM GMT
నేటి దిన ఫ‌లాలు.. నిరుద్యోగుల‌కు ఉద్యోగ అవ‌కాశాలు

మేషం: బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి తప్పవు ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి.

వృషభం: రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయం మరింత పెరుగుతుంది.

మిధునం: నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగాలలో అవరోధాలు అధిగమిస్తారు విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. అధికారులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.

కర్కాటకం: దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు కలుగుతాయి. బంధు, మిత్రులతో విభేదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

సింహం: వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి.

కన్య: వ్యాపారాలలో అధిక లాభాలు పొందుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. విద్యార్థులకు పరీక్ష ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

తుల: వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో విభేదాలు కలుగుతాయి నూతన రుణాలు చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది కుటుంబ సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

వృశ్చికం: విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభవర్తమానాలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. అందరిలోనూ మీ విలువ పెరుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

ధనస్సు: ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఉంటాయి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

మకరం: వ్యాపారాలలో లాభాలు అందుతాయి. పనులు సజావుగా సాగుతాయి. ఆప్తులు నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. ఉద్యోగుల కలలు సహకారం అవుతాయి ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

కుంభం: నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

మీనం: వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలలో కష్టానికి ఫలితం కనిపించదు. పని ఒత్తిడి అధికమవుతుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగాలలో సమస్యలు మరింత చికాకు కలిగిస్తాయి. మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.

Next Story