వీరికి ఇంటాబయట చికాకులు పెరుగుతాయి
Daily horoscope for 30-08-2022.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్య విషయమై చర్చలు జరుగుతాయి.
By జ్యోత్స్న Published on 30 Aug 2022 2:02 AM GMTమేషం: నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్య విషయమై చర్చలు జరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృషభం: సంతాన ఆరోగ్య విషయాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురికావల్సి వస్తుంది.
మిధునం: ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. గృహమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది చేపట్టిన పనులలో జాప్యం తప్పదు ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
కర్కాటకం: బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి.
సింహం: దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
కన్య: గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలిక ఋణ సమస్యలు నుండి బయటపడతారు. చేపట్టిన వ్యవహారాలో ఆకస్మికంగా విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.
తుల: చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు. వృధా ఖర్చులు పెరుగుతాయి నూతన రుణయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
వృశ్చికం: నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి కుటుంబ సభ్యులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి.
ధనస్సు: సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది స్థిరాస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.
మకరం: వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. ఉద్యోగమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి బంధువర్గంతో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయటం మంచిది.
కుంభం: నిరుద్యోగ యత్నాలు ముందుకు సాగక నిరాశకలిగిస్తాయి. సన్నిహితులతో కొన్ని వ్యవహారాలలో మాట పట్టింపులు కలుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప నష్ట సూచనలున్నవి సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థికపరంగా ఒడిదుడుకులు అధికం అవుతాయి.
మీనం: దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.