వీరు ధ‌న‌లాభం పొందుతారు

Daily horoscope for 3-09-2022. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి

By జ్యోత్స్న  Published on  3 Sep 2022 1:23 AM GMT
వీరు ధ‌న‌లాభం పొందుతారు

మేషం: ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు మరింత పెరుగుతాయి ధనవ్యయ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

వృషభం: నూతన వస్తులాభాలు ఉంటాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఇంటా బయట ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటాయి.

మిధునం: నూతన వాహనయోగం ఉన్నది. సమాజంలో పరపతి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. విద్యార్థుల అంచనాలు అందుకుంటారు.

కర్కాటకం: గృహమున కొందరి ప్రవర్తన శిరో బాధ కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు.

సింహం: ఎంత శ్రమపడిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

కన్య: ఆపదల నుండి శుభవార్తలు అందుకుంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది, స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున మీ విలువ మరింత పెరుగుతుంది.

తుల: ధన పరమైన చికాకులు పెరుగుతాయి. మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఆరోగ్యం మందగిస్తుంది.

వృశ్చికం: వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలం అవుతాయి ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి.నిరుద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది.

ధనస్సు: ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది.

మకరం:దైవచింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

కుంభం: చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. విలువైన వస్త్ర ఆభరణలు కొనుగోలు చేస్తారు.వాహన అనుకూలత కలుగుతుంది.

మీనం: ఆర్థిక ఇబ్బందులు అధికమౌతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. వృత్తి ఉద్యోగాలలో శ్రమ తప్పదు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి.

Next Story