నేటి రాశిఫ‌లాలు.. ఈ రాశుల వారికి పండగే

Daily horoscope for 29-09-2022.నేటి రాశిఫ‌లాలు.. ఈ రాశుల వారికి పండగే

By జ్యోత్స్న  Published on  29 Sep 2022 2:03 AM GMT
నేటి రాశిఫ‌లాలు.. ఈ రాశుల వారికి పండగే

మేషం: ఇంటా బయట పని ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమానంతరం పనులు పూర్తి అవుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. ఆదాయ మార్గాలు తగ్గుతాయి.

వృషభం: చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన వ్యాపారానికి పెట్టుబడులు అందుతాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

మిధునం: దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు.

కర్కాటకం:అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. మిత్రులతో కలహాలు సూచనలు ఉన్నవి.

సింహం: ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

కన్య: ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దూరపు బంధువులు కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి.

తుల: వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. గృహమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం: దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో కొంత ఒత్తిడి తప్పదు. వృథా ఖర్చులు పెరుగుతాయి.

ధనస్సు:అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

మకరం: విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. స్థిరస్తి వివాదానికి సంబంధించి విలువైన సమాచారం అందుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభం: వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. కీలక వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన మానసిక బాధను కలిగిస్తుంది వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

మీనం: కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. దైవ సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.

Next Story