ఈ రాశి ఉద్యోగస్తులు శుభవార్త వినే అవకాశం

Daily Horoscope for 28-09-2022.దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు

By జ్యోత్స్న  Published on  27 Sep 2022 11:30 PM GMT
ఈ రాశి ఉద్యోగస్తులు శుభవార్త వినే అవకాశం

మేషం: దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. అందరిలోనూ మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు అనుకూలిస్తాయి.

వృషభం: నూతన రుణయత్నాలు చేస్తారు. అనారోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. పనులలో శ్రమ తప్పదు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

మిధునం: ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. నూతన ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగమున అధికారులతో వ్యతిరేకత పెరుగుతుంది. శారీరక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు.

కర్కాటకం: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. మొండి బాకీలు వసూలవుతాయి.

సింహం: దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపారాలు ఆశించిన మేరకు రాణిస్తాయి. ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

కన్య: ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.

తుల: విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం అందదు. వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలలో మార్పులు చేస్తారు.

వృశ్చికం: ఆలయ దర్శనాలు చేసుకుంటారు.వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక లావాదేవీలలో చికాకులు తొలగుతాయి.

ధనస్సు: ఉద్యోగాలలో సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. నూతన ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలు నిదానిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉంటాయి.

మకరం: నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు పొందుతారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.

కుంభం: దైవచింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఒక విషయంలో బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

మీనం: ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

Next Story