నేటి దిన ఫ‌లాలు

Daily horoscope for 27-09-2022.కుటుంబ వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి.

By జ్యోత్స్న  Published on  27 Sep 2022 1:50 AM GMT
నేటి దిన ఫ‌లాలు

మేషం: కుటుంబ వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

వృషభం: దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. చేపట్టిన పనులలో శ్రమతో పూర్తవుతాయి. ఉద్యోగాలలో అధికారుల అండదండలు పొందుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటాబయట కొంత వ్యతిరేక పరిస్థితులుంటాయి.

మిధునం: వ్యాపారాలలో శత్రు సమస్యలు ఉంటాయి.ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకుంలించవు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఆకస్మిక ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.

కర్కాటకం: నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. ఉద్యోగమున కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. కుటుంబ పరిస్థితులు చికాకు పరుస్తాయి. పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రహారాలు ఉండవు.

సింహం: స్థిరస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి.

కన్య: సన్నిహితులు ధన పరంగా ఒత్తిడులు పెరుగుతాయి.కొన్ని వ్యవహారాలలో చికాకులు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులుంటాయి అనుకోని ప్రయాణాలు చెయ్యవలసిన వస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

తుల: కుటుంబ విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

వృశ్చికం: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మఖ్యమైన పనులు మధ్యలో విరమిస్తారు. మిత్రులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపార,ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది.ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి.

ధనస్సు: ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.కుటుంబంలో సమస్యలు చికాకు పరుస్తాయి. పాత విషయాలు గుర్తుకు వస్తాయి. కొన్ని పనులలో శిరోబాధలు పెరుగుతాయి వ్యాపార పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది.

మకరం: చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి.

కుంభం: మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. వ్యాపార,ఉద్యోగాలలో చికాకులు తప్పవు వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తుంది. ధన పరంగా ఇబ్బందులు తప్పవు.

మీనం: స్థిరస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. సన్నిహితుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిసారిస్తారు. వృత్తి ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

Next Story