వీరు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి

Daily horoscope for 27-08-2022.దైవదర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.

By జ్యోత్స్న  Published on  27 Aug 2022 1:47 AM GMT
వీరు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి

మేషం: దైవదర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగమున నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. మిత్రులు, కుటుంబసభ్యుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.

వృషభం: ఇంటాబయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో భాగస్తుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.

మిధునం: వాహన అనుకూలత కలుగుతుంది. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు పొందుతారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు.సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

కర్కాటకం: బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పనిచేయదు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది వృధా ఖర్చులు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన శారీరక శ్రమ పెరుగుతుంది. దూర ప్రయాణాలలో వాహనం నడిపే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

సింహం: నూతన వాహన భూ లాభాలు కలుగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పురోగతి కలుగుతుంది ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. పాత బాకీలు వసూలు చేస్తారు.

కన్య: చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దూర ప్రయాణాలలో అవాంతరాలు. సమయానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు.

తుల: వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. బంధు మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారులతో చర్చల్లో కొంత పురోగతి సాధిస్తారు.

వృశ్చికం: ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వాహన సౌఖ్యం ఉన్నది. అవసరానికి ధనసహాయం లభిస్తుంది.

ధనస్సు: ఆరోగ్యం మందగిస్తుంది. నూతన రుణాలు చేస్తారు. గృహమున కొద్దిపాటి ఒత్తిడులు తప్పవు. ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి.

మకరం: దైవదర్శనాలు చేసుకుంటారు.ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి.

కుంభం: దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మీనం: శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.విలువైన వస్తు , వాహనాలు కొనుగోలు చేస్తారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

Next Story