దిన ఫ‌లాలు.. వీరికి అదృష్టం వెన్నంటే ఉంటుంది

Daily horoscope for 26-08-2022.దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు.

By జ్యోత్స్న  Published on  26 Aug 2022 1:50 AM GMT
దిన ఫ‌లాలు.. వీరికి అదృష్టం వెన్నంటే ఉంటుంది

మేషం: దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. స్థిరస్తి ఒప్పందాలలో అవాంతరాలు తప్పవు.స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

వృషభం: ఉద్యోగంలో ఉన్న అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహమున ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. వృత్తి వ్యాపారాలు సాఫీగా కొనసాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.

మిధునం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. కొన్ని విషయాలలో శిరో బాధలు తప్పవు. కుటుంబసభ్యులతో వివాదాలు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు ఆకస్మిక దూరప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

కర్కాటకం: వ్యాపారాలు పుంజుకుంటాయి. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. విలువైన సమాచారం సేకరిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది.

సింహం: ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో వ్యయప్రయాసలు అధికమవుతాయి దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ధన పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. బంధువులతో ఊహించని తగాదాలు ఉంటాయి.

కన్య: వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది. దీర్ఘకాలిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పని తీరు అందరినీ ఆకట్టుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.

తుల:నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. ఉద్యోగంలో ఉన్న మీ సమర్థత వెలుగులోకి వస్తుంది. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

వృశ్చికం: చేపట్టిన పనులలో ప్రతిష్టంభన ఉంటాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు కొన్ని వ్యవహారాలు ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు.

ధనస్సు: వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉండదు. పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా కొనసాగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలతో కలుగుతాయి.

మకరం: ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి ఆర్థికపరంగా ఉన్నతి సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అనుకుంటారు ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

కుంభం: ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగుతోంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.నూతన వాహన యోగం ఉన్నది.చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.

మీనం: ఆకస్మిక ప్రయాణాలు వలన శారీరక శ్రమ కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని చికాకులు కలుగుతాయి. బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

Next Story