అవరోధాలు అధిగమించి లాభాలను అందుకుంటారు

Daily horoscope for 25-08-2022.వృత్తి వ్యాపారాలలో భాగస్థులతో వివాదాల నుండి కొంత వరకు బయటపడగలుగుతారు.

By జ్యోత్స్న  Published on  25 Aug 2022 1:53 AM GMT
అవరోధాలు అధిగమించి లాభాలను అందుకుంటారు

మేషం : వృత్తి వ్యాపారాలలో భాగస్థులతో వివాదాల నుండి కొంత వరకు బయటపడగలుగుతారు. కుటుంబ సభ్యుల సహాయంతో చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులకు ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. దూర ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయం కలుగుతాయి.

వృషభం: ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులను అధిగమిస్తారు. ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు పొందుతారు. బంధుమిత్రుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.

మిధునం: ఒక వ్యవహరంలో సమాజంలో పేరు కలిగిన వారి సహాయంతో కార్యసిద్ధి కలుగుతుంది. గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విలువైన, వస్త్ర, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆకస్మిక లాభాలు పొందుతారు.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా సాగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన అవరోధాలు అధిగమించి స్వల్ప లాభాలను అందుకుంటారు. గృహమున సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణతో పదోన్నతులు పెరుగుతాయి.

సింహం: ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.

కన్య: సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. దైవ చింతన పెరుగుతుంది. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. అన్ని రంగాల వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్ధిక సమస్యలు నుంచి బయట పడతారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.

తుల: వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు రాజీ చేసుకుంటారు సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతం అవుతాయి నూతన వ్యాపారాలకు ప్రారంభానికి శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం: ఆర్ధిక లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సోదరుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగులకునూతనప్రోత్సాహకాలు అందుతాయి చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.

ధనస్సు: దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. వ్యాపార పెట్టుబడులు ఈ విషయంలో పునరాలోచన మంచిది. ఉద్యోగులకు అదనపు పని భారం నుండి ఉపశమనం కలుగుతుంది. చుట్టుపక్కల వారితో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దూరప్రయాణాలు కలసివస్తాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

మకరం: కుటుంబ పెద్దల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ధనాదాయం బాగుంటుంది. విద్యార్థులు నూతన విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగినా సమయానికి పూర్తిచేస్తారు.

కుంభం: గృహనిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. సంఘంలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాలు ప్రారంభానికి ఆప్తుల నుండి పెట్టుబడులు అందుతుంది.

మీనం: మొండి బాకీలు వసూలవుతాయి. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులుకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ఉద్యోగమున పురోగతి కలుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.

Next Story