ఈ రాశి వారు ఆర్థికంగా శుభ‌ఫ‌లితాలు అందుకుంటారు

Daily horoscope for 24-11-2022.వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

By జ్యోత్స్న  Published on  24 Nov 2022 1:54 AM GMT
ఈ రాశి వారు ఆర్థికంగా శుభ‌ఫ‌లితాలు అందుకుంటారు

మేషం: వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగులు శ్రమ వృధాగా మిగులుతుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.

వృషభం: జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. స్థిరస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

మిధునం: వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. స్నేహితుల సహాయంతో రుణ సమస్యలు నుండి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి.

కర్కాటకం: ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

సింహం: వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరగటం వలన తగినంత విశ్రాంతి లభించదు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితులతో మాటపట్టింపులు తప్పవు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది.

కన్య: వ్యాపారానికి నూతన పెట్టుబడులు అందుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. చాలాకాలంగా వేదిస్తున్న సమస్యలు నుండి బయట పడతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

తుల: ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. గృహమున కొందరి ప్రవర్తన మానసిక అశాంతి కలిగిస్తుంది. నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగ విషయాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహారించాలి. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి.

వృశ్చికం: వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఆదాయ మార్గాలు సంతృప్తి కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తిచేస్తారు.

ధనస్సు: ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

మకరం: ధన వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు పుంజుకుని మరింత ముందుకు సాగుతాయి.

కుంభం: వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి. భూ క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి.

మీనం: నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టె విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులుతో అకారణ వివాదాలు కలుగుతాయి.

Next Story