దిన ఫ‌లాలు.. ఆప్తులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు

Daily Horoscope for 24-08-2022.ఉద్యోగస్తులకు అదనపు పనిభారం పెరుగుతుంది. ఆర్ధిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి.

By జ్యోత్స్న  Published on  24 Aug 2022 7:22 AM IST
దిన ఫ‌లాలు.. ఆప్తులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు

మేషం: ఉద్యోగస్తులకు అదనపు పనిభారం పెరుగుతుంది. ఆర్ధిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు ఆలోచనలు మంచివి కావు.

వృషభం: నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలను పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి. బంధు మిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది.

మిధునం: దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు విషయంలో పునరాలోచన చెయ్యాలి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

కర్కాటకం: బంధు మిత్రులకు శుభకార్య ఆహ్వానాలు అందిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా సాగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ సేవ చేసుకుంటారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

సింహం: ఇంటాబయటా అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. గృహ నిర్మాణ వ్యవహారాలలో తొందరపాటు మంచిది కాదు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన పనులు సకాలంలో పూర్తి చెయ్యలేరు ఆకస్మిక దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

కన్య: దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. దైవ సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఆప్తులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

తుల: సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి స్థిరాస్తి వివాదాలలో ఒక కొల్లిక్కి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి ఆశించిన లాభాలను అందుకుంటారు.

వృశ్చికం: బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలోఅధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ విషయమై అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.

ధనస్సు: కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది l ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వృత్తి వ్యాపారాలు సొంత నిర్ణయాలు కలసిరావు. బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తాయి. వ్యాపార పరంగా ఒత్తిడి పెరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు చివరి నిమిషంలో చేజారుతాయి. ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి

మకరం: సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆత్మీయులతో వివాదాలు సర్దుమణుగూతాయి. నూతన కార్యక్రమాలు ఆరంభించి సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.

కుంభం: వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికి అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది. ఆప్తుల నుండి అందిన ఆహ్వానాలు కొంత ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు.

మీనం: ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటా బయటా కొన్ని పరిస్థితులు ఇబ్బందికరంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.




Next Story