నేటి రాశిఫ‌లాలు

Daily horoscope for 23-11-2022.వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది

By జ్యోత్స్న  Published on  23 Nov 2022 1:57 AM GMT
నేటి రాశిఫ‌లాలు

మేషం:వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

వృషభం: వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు నూతన పనులకు శ్రీకారం చుడతారు. నూతన వాహనయోగం ఉన్నది, కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

మిధునం:ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలలో వ్యయప్రయాసలు అధికమౌతాయి.

కర్కాటకం:మానసిక ప్రశాంతతకు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పడ్డ ఫలితం కనిపించదు సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.

సింహం: చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట నూతన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.

కన్య: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు చర్చిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు.

తుల: నూతన రుణయత్నాలు అనుకూలించవు.ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలు వాయిదా వేయటం మంచిది వ్యాపార ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు.

వృశ్చికం: చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంపై అప్రమత్తంగా వ్యవహరించాలి.

ధనస్సు: రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం: ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. ఆర్థికపరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటాయి.

కుంభం: ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.

మీనం: వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. నిరుద్యోగులకు రావలసిన అవకాశాలు తృటిలో చేజారుతాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి.

Next Story