ఈ వారికి అన్నీ శుభ ఘడియలే.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Daily horoscope for 23-09-2022.కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.
By జ్యోత్స్న Published on 23 Sept 2022 5:00 AM ISTమేషం: కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. రాబడికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధువులు ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీ మాటతో విబేదిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని వివాదాలు కలుగుతాయి.
వృషభం: బంధు మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. నూతన రుణయత్నాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు మండకోడిగా సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి.
మిధునం:ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్న అవసరానికి ధన సహాయం లభిస్తుంది.
కర్కాటకం: ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి. దైవ చింతన పెరుగుతుంది. దాయదులతో భూ వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి.
సింహం: వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. స్థిరస్తి కొనుగోలు చేస్తారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగుల కలలు నిజమవుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి.
కన్య: కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విభేదిస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తప్పవు. చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
తుల: పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి.
వృశ్చికం: స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక వివాదాలకు సంబంధించి ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు.
ధనస్సు: ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. బంధువులతో ఒక విషయంలో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు.
మకరం: వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. అవసరం లేని వస్తువుల పై ధన వ్యయం చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది.
కుంభం: వృత్తి, వ్యాపారాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు ఆశించిన స్థాన చలనాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.
మీనం: ప్రముఖుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. స్థిరస్తి వివాదాల పరిష్కారమవుతాయి. కీలక వ్యవహారంలో సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు.