దిన ఫ‌లాలు.. దూర ప్రాంతాల నుంచి శుభ‌వార్త‌లు వింటారు

Daily horoscope for 23-08-2022.ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది దూర ప్రయాణాలు

By జ్యోత్స్న  Published on  23 Aug 2022 2:01 AM GMT
దిన ఫ‌లాలు.. దూర ప్రాంతాల నుంచి శుభ‌వార్త‌లు వింటారు

మేషం : ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. సోదరుల నుంచి స్థిరస్తి లాభాలుంటాయి.

వృషభం : వృత్తి వ్యాపారాలలో తొందరపడి పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. దైవ చింతన కలుగుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక దూర ప్రయాణ సూచనలున్నవి. నేత్ర సంభంధిత ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

మిధునం : కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. వాహన వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. గృహమున ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యత కలుగుతుంది.

కర్కాటకం : అవసరానికి ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో నూతన లాభాల అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.

సింహం : దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. ధనదాయం బాగుంటుంది.

కన్య : భూ క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలుంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన ధైర్యంగా పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల : దూర ప్రాంతాల బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు కొంత ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారపరంగా ఎదురైనా అవరోధాలను అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థాణాచలానాలుంటాయి.

వృశ్చికం : సోదరుల నుండి ఊహించని ఆర్ధిక సహాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరస్తి క్రయవిక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమై మానసిక ప్రశాంతత పొందుతారు.

ధనస్సు : వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దీర్ఘకాలిక రుణాలు నుండి బయట పడతారు. వ్యాపారములు అనుకూలంగా సాగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.

మకరం : సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దీర్ఘ కాలిక సమస్యలు నుండి బయట పడతారు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను ప్రారంబించి సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరుగుతాయి.

కుంభం : ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. సంతాన విద్యా వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

మీనం : గృహమున పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఆలోచనలను కలసివస్తాయి.

Next Story