ఈ రాశివారికి చేపట్టిన పనుల్లో ఆటంకాలు

Daily horoscope for 21-10-2022.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులు కొంత నెమ్మదిస్తాయి

By జ్యోత్స్న  Published on  21 Oct 2022 1:32 AM GMT
ఈ రాశివారికి చేపట్టిన పనుల్లో ఆటంకాలు

మేషం: ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ఉద్యోగాలలో చికాకులు తప్పవు. సంతాన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా సాగుతాయి.

వృషభం: ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు శ్రమాధిక్యంతో పూర్తి చేస్తారు ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది సోదరులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

మిధునం: చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వాహనయోగం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు కలుగుతాయి. స్థిరస్తి క్రయ విక్రయాలలో పురోగతి కలుగుతుంది.

కర్కాటకం: కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపార,ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి. కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి.

సింహం: నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఆప్తుల నుంచి వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది.

కన్య: వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒక వ్యవహారంలో బంధువర్గంతో మాటపడవలసి వస్తుంది. దైవచింతన పెరుగుతుంది ఉద్యోగాలలో సమస్యలు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. చేపట్టిన పనులు ముందుకు సాగవు.

తుల: వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఆస్తుల వివాదాలు వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు తప్పవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పనుల్లో ప్రతిష్ఠంభనలు తప్పవు. మిత్రుల వలన సమస్యలు కలుగుతాయి.

వృశ్చికం: ఉద్యోగాలలో ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. సంఘములో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది.

ధనస్సు: స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ధన వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మకరం : కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఉంటాయి.పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సోదరులతో స్థిరస్తి ఒప్పందాలు చేసుకుంటారు.

కుంభం: ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. భూవివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. సన్నిహితుల నుంచి ధన సహాయం అందుతుంది వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.

మీనం: కుటుంబ సమస్యల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దైవచింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సన్నిహితుల సాయం అందుతుంది.

Next Story