ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం

Daily horoscope for 20-09-2022.దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా

By జ్యోత్స్న  Published on  20 Sep 2022 1:10 AM GMT
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం

మేషం: దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారులకు చిక్కులు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి.

వృషభం: వ్యాపారమున ఆశించిన లాభాలు అందుకుంటారు ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో కీలక సమాచారం అందుతుంది.

మిధునం: ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

కర్కాటకం: ఉద్యోగులకు దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది అవసరానికి సన్నిహితుల సాయం పొందుతారు. గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. వ్యాపారులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. స్థిరస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది.

సింహం:ఆరోగ్య పరంగా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారులకు గందరగోళ పరిస్థితులుంటాయి ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

కన్య: ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. దైవచింతన పెరుగుతుంది. ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు అనుకున్నది సాధిస్తారు.

తుల: వాహన వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు అందుతాయి సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు ఉద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశములు లభిస్తాయి. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఆలయ దర్శనం చేసుకుంటారు. స్థిరస్తి కొనుగోలు చేస్తారు.

వృశ్చికం: ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. బంధు మిత్రులతో మీ మాటతో విబేదిస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక వాతావరణం చికాకుగా ఉంటుంది ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి.

ధనస్సు: దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. అవరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

మకరం: చేపట్టిన పనుల్లో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం యోగం ఉన్నది వ్యాపారలకు ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి.

కుంభం:వృత్తి వ్యాపారములు ఉత్సాహంగా సాగుతారు. నిరుద్యోగుల ఊహలు నిజమవుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. భూ వివాదాలు పరిష్కారమౌతాయి. ఉద్యోగులకు ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది మిత్రుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి.

మీనం:బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. అనారోగ్య విషయంలో స్వల్ప ఇబ్బందులుంటాయి. ప్రయాణాల్లో ఆకస్మిక మారులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున పరిస్థితులు అంతగా అనుకుంలించవు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపారులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

Next Story