నేటి దిన ఫలాలు
Daily horoscope for 20-08-2022. దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడి పెరిగి నూతన రుణాలు చేస్తారు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప
By జ్యోత్స్న Published on 20 Aug 2022 7:00 AM ISTమేషం : దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడి పెరిగి నూతన రుణాలు చేస్తారు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు మిత్రుల మాటలు కొంత మానసికంగా బాధిస్తాయి.వృత్తి ఉద్యోగపరంగా నూతన బాధ్యతలు వలన శ్రమాధిక్యత పెరుగుతుంది.
వృషభం : ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనయోగం ఉన్నది.కుటుంబ విషయమై కీలక నిర్ణయాలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యములలో పాల్గొంటారు.
మిధునం : నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. దూరప్రాంత మిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
కర్కాటకం : స్థిరాస్తి వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడుతాయి. వ్యాపారమున కష్టానికి తగిన ఫలితం ఉండదు. ఆర్థిక వ్యవహారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చేపట్టినపనులలో అవరోధాలున్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.
సింహం : వృత్తి వ్యాపారాలలో ఒత్తిడి అధిగమించి లాభాలు అందుకుంటారు. బంధు మిత్రులు సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.
కన్య : విలువైన వస్తు వాహనాలు కొనుగోలుచేస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది . వ్యాపారాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
తుల : పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.. వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక వివాదాలు రాజీకి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.
వృశ్చికం : ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు మిత్రులు కొన్ని విషయాలలో మీమాటతో విభేదిస్తారు. చేపట్టిన పనులను మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలు సమస్యలు అధిగమిస్తారు. గృహ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు.ధనస్సు : సోదరుల నుండి విలువైన విషయాలు తెలుస్తాయి. దైవదర్శనం చేసుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుకుంటారు. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.
మకరం : ప్రభుత్వ వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి సంతాన విద్యా విషయాలలో దృష్టి సారిస్తారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి.
కుంభం : అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
మీనం : సన్నిహితులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. ధనదాయం బాగుంటుంది. నూతన వ్యాపారాలు సజావుగా సాగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు.