ఈ రాశివారికి అధిక ధన వ్యయం
Daily horoscope for 2-12-2022.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి
By జ్యోత్స్న Published on 2 Dec 2022 1:58 AM GMTమేషం: స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
వృషభం: వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇతరులకు సహాయం అందిస్తారు. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.
మిధునం: వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. సంతానం విద్యా విషయాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
కర్కాటకం: వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. బంధు మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.
సింహం: చేపట్టిన పనులలో శ్రమాధిక్యం. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. సోదరులతో కలహా సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.
కన్య: దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలిస్తాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.
తుల: నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
వృశ్చికం: వ్యాపారాలు కొంత మందగిస్తాయి. వ్యయ ప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది తప్పదు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.
ధనస్సు: దూర బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
మకరం: వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
కుంభం:ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటుచేసుకుంటాయి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయాలి. కుటుంబసభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.
మీనం : ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులను మరింత ఉత్సాహంగా పూర్తిచేస్తారు. స్థిరస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.